కణంలో వంటిల్లు – హరితరేణువు
వృక్ష శరీరధర్మశాస్త్రం
-మొక్కల వివిధ రకాల జీవక్రియల గురించి అధ్యయనం చేసే శాసా్త్రన్ని వృక్ష శరీరధర్మశాస్త్రం అంటారు.
కిరణజన్యసంయోగ క్రియ (Photosythesis)
-జీవుల్లో ఆకుపచ్చని మొక్కలు మాత్రమే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఇతర జీవులన్నీ తమ అవసరాలకు ఈ ఆకుపచ్చ మొక్కలపై ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఆధారపడుతాయి.
-ఆకుపచ్చని మొక్కలు (పత్రహరితం (Chlorophyll) కలిగి ఉన్న మొక్కలు) కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి.
-కాంతి, పత్రహరితం సమక్షంలో CO2, H2O లు కలిసి ఆహారపదార్థాల (పిండిపదార్థం)ను, ఆక్సిజన్ను వెలువరించే ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు.
6CO2 + 12H2O కాంతి
——-
పత్రహరితం
C6H12O6 + 6O2 + 6H2O
-ఈ కిరణజన్యసంయోగ క్రియాచర్యలో క్రియాజనకాలు CO2, H2O. క్రియాజన్యాలు లేదా ఉత్పన్నాలు పిండిపదార్థం (ప్రధాన ఉత్పన్నం), O2 (ఉప ఉత్పన్నం).
– కిరణజన్య సంయోగక్రియా చర్యలో CO2 క్షయకరణం చెంది పిండిపదార్థం, H2O ఆక్సీకరణం చెంది O2 విడుదల అవుతాయి.
-కిరణజన్య సంయోగక్రియలో కాంతిశక్తి రసాయన శక్తిగా మారుతుంది. కాబట్టి దీన్ని ఒక కాంతి రసాయనచర్య (Photochemical reaction)గా భావిస్తారు.
-కిరణజన్యసంయోగ క్రియలో పిండిపదార్థం (గ్లూకోజ్) ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఒక నిర్మాణాత్మక క్రియ (Anabolic rea ction) గా భావిస్తారు.
-కిరణజన్యసంయోగ క్రియలో కాంతిశక్తి వినియోగం అవుతుంది. కాబట్టి గ్రాహక చర్యగా భావిస్తారు. (భూమి మీద పడే సూర్యకాంతిలో మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు 1.5 శాతం కంటే తక్కువ కాంతిని ఉపయోగించుకుంటాయి).
-కిరణజన్యసంయోగ క్రియ హరితరేణువులో జరుగుతుంది. ఈ కణాంగాన్ని కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ (కణం వంటగది) అంటారు.
– కిరణజన్యసంయోగ క్రియ రెండు దశల్లో పూర్తవుతుంది. అవి..
1. కాంతి దశ (Light Phase)
2. రసాయన సంశ్లేషణ దశ/నిష్కాంతి దశ (Dark Phase)
-కాంతిదశ హరితరేణువు గ్రానా/పటలికారాశి అనే భాగంలో, రసాయన సంశ్లేషణ దశ/నిష్కాంతి దశ హరితరేణువు స్టోమా/ఆవర్ణిక అనే భాగంలో జరుగుతుంది.
కాంతి దశ (Light Phase)
– ఈ దశలో PS I, PS II లోని వర్ణద్రవ్యాలు కాంతిశక్తిని శోషించి O2, ATP, NADH2 లను ఏర్పరుస్తాయి.
-ఈ క్రియ సూర్యకాంతిలో మాత్రమే జరిగి, వాతావరణంలో ఆక్సిజన్ విడుదలై కాలుష్యం తగ్గుతుంది. రాత్రి సమయంలో సూర్యకాంతి ఉండదు కాబట్టి ఈ క్రియ జరుగదు. కాబట్టి రాత్రివేళల్లో మొక్కల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ వెలువడుతుంది.
గమనిక: గోధుమ రంగు శైవలాల్లో (ఫియోఫైసీ) సూర్యకాంతితోపాటు చంద్రకాంతిలో కూడా కిరణజన్యసంయోగ క్రియ జరుగుతుంది.
కాంతి రసాయన సంశ్లేషణ
దశ/నిష్కాంతి దశ (Dark Phase)
-ఈ దశలో వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ స్థీరికరణం జరిగి, కార్బన్ డై ఆక్సైడ్ క్షయకరణం చెంది గ్లూకోజ్ (పిండి పదార్థం) తయారవుతుంది.
– ఇది ఉష్ణోగ్రత సమక్షంలో జరుగుతుంది.
– ఈ క్రియలో గ్లూకోజ్ (పిండిపదార్థం) ఏర్పడే విధానాన్ని వివరించిన శాస్త్రవేత్త మెల్విన్ కెల్విన్. దీనికిగాను ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది (1961లో).
– వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ హరితరేణువులోకి చేరగానే ఆవర్ణిక/స్ట్రోమాలోని ఎంజైమ్స్ వల్ల ఏర్పడే మొదటి స్థిరమైన పదార్థాన్ని బట్టి మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి..
C3 మొక్కలు: PGA (3C) అనే స్థిర పదార్థం ఏర్పడుతుంది.
C4 మొక్కలు: OAA (4C) అనే స్థిర పదార్థం ఏర్పడుతుంది.
C2 మొక్కలు: గ్లెకోలేట్ (2C) అనే స్థిర పదార్థం ఏర్పడుతుంది.
l C3 మొక్కల్లో జరిగే కార్బన్ డై ఆక్సైడ్ స్థాపనను C3 వలయం/కెల్విన్ వలయం అంటారు. ఈ వలయంలో కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించే ఎంజైమ్ రుబిస్కో.
l C4 మొక్కల్లో జరిగే కార్బన్ డై ఆక్సైడ్ స్థాపనను C4 వలయం/హచ్స్లాక్ వలయం/బీటా కార్బాక్సిలేషన్ వలయం అంటారు.
l C2 మొక్కల్లో జరిగే ప్రక్రియనే కాంతి శ్వాస క్రియ/గ్లెకోలేజ్ వలయం/C2 వలయం
అంటారు.
కాంతి దశ (Light Phase) నిష్కాంతి దశ (Light Dark Phase)
– కాంతి అవసరం ఉంటుంది l కాంతి ఉన్నా లేకున్నా జరుగుతుంది
– ఇది హరితరేణువు గ్రానా/ పటలికారాశిపై జరుగుతుంది l ఇది హరితరేణువు స్ట్రోమా/ ఆవర్ణి కలో జరుగుతుంది
-దీనిలో అంత్య ఉత్పన్నాలు – O2, ATP, NADPH2 l దీనిలో అంత్య ఉత్పన్నం – గ్లూకోజ్ (పిండిపదార్థం)
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు