విటమిన్లు – వాటి ప్రయోజనాలు
అన్ని విటమిన్లు మనం నిత్యం తీసుకునే ఆహారంలో లభిస్తాయి. కానీ విటమిన్ డి మాత్రం అరుదుగా లభిస్తుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉన్న కొలెస్ట్రాల్ కరిగి డి విటమిన్‌గా మారుతుంది. ఇది ముఖ్యంగా గర్భిణులకు అవసరం. ఇది చేపలలో కూడా లభిస్తుంది. కాబట్టి గర్భిణులు ఎక్కువగా చేపలు తినడం వల్ల పుట్టబోయే పిల్లలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. అదేవిధంగా నవజాత శిశువులకు డి విటమిన్ అందించడానికి ఉదయం ఎనిమిది గంటలలోపు వచ్చే ఎండలో ఉంచాలి. దీనివల్ల తగిన మోతాదులో డి విటమిన్ లభించి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
విటమిన్లు రెండు రకాలు
1. కొవ్వులో కరిగే విటమిన్లు- ఎ, డి, ఈ, కె
2. నీటిలో కరిగే విటమిన్లు – బి, సి
విటమిన్ -ఏ
- దీన్ని రెటినాల్, యాంటీ జిరాప్తాల్మిక్ విటమిన్ అంటారు.
లభించే పదార్థాలు: పసుపుపచ్చని పండ్లు, కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు, పాలు, షార్క్, కాడ్ చేపల కాలేయ నూనె.
నోట్: ఎ విటమిన్ అధికంగా లభించే పదార్థం- క్యారెట్ - మొక్కల్లో ఎ విటమిన్ బిటా కెరోటిన్ రూపంలో ఉండి మానవుడి పేగు, కాలేయంలో ఎ విటమిన్‌గా మారుతుంది.
- విధి: కంటి చూపు స్పష్టంగా కనపడటానికి తోడ్పతుంది.
- ఎ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు: రేచీకటి, జిరాప్తాల్మియా(పొడి కళ్లు).
- కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు ‘లాక్రిమల్ (అశ్రు) గ్రంథులు
- కన్నీటిలో సోడియం క్లోరైడ్ అనే లవణం, లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల కంటిలోని సూక్ష్మజీవులు చనిపోయి దుమ్మ, ధూళి బయటకు వెళ్తుంది.
- ఒకవేళ ఈ గ్రంథులు పనిచేయకుంటే కళ్లు పొడిగా మారి కనుగుడ్డును కప్పుతూ ఉండే సున్నితమైన కార్నియా(శుక్లపటలం) పగిలిపోవడం వల్ల శాశ్వత అంధత్వం కలుగుతుంది.
నోట్: కనుగుడ్లు దానం చేసిన వ్యక్తుల నుంచి 6-8 గంటల్లో కార్నియాను సేకరిస్తారు.
విటమిన్ -డీ
- దీన్ని కాల్సిఫెరాల్, యాంటి రికెటింగ్ విటమిన్, ఫ్రీ విటమిన్, సన్ షైన్ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్ అంటారు.
- లభించే పదార్థాలు: పాలు, షార్క్, కాడ్ చేపల కాలేయ నూనె, సూర్యకాంతి
నోట్: వృక్ష సంబంధ పదార్థాల్లో ఇది లభించదు. - సూర్యకాంతి చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ కరిగి డి విటమిన్‌గా మారుతుంది.
విధి: తీసుకున్న ఆహారంలోని కాల్షియం, పాస్ఫరస్లను పారాథార్మోన్లాగా ఎముకల్లోకి పంపించి గట్టిగా, - దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
- లోపం వల్ల కలిగే వ్యాధులు : రికెట్స్, ఆస్టియో మలేసియా
విటమిన్ -ఈ
- దీన్ని టోకోఫెరాల్, యాంటీ స్టెరిలిటీ (వంధ్యత్వ నిరోధక) విటమిన్ అంటారు.
- లభించే పదార్థాలు: తాజా ఫలాలు, మొలకెత్తిన పప్పు గింజలు, సన్ ఫ్లవర్, కాటన్ సీడ్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడి పప్పు).
- విధి: ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి తోడ్పడుతుంది.
- లోపాలు: 1. వంధ్యత్వం: ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవడం.
- 2. ఎర్రరక్త కణాల జీవిత కాలం తగ్గడం
నోట్: ఎర్రరక్త కణాల జీవిత కాలం 120 రోజులు.
విటమిన్ -కే
- దీన్ని ఫిల్లోక్వినోన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్, యాంటీ ఎమర్జియా విటమిన్, కొయాగ్యులెంట్ (రక్తం గడ్డ కట్టించే) విటమిన్ అంటారు.
- లభించే పదార్థాలు: ఆకుకూరలు, పాలు, పెద్ద పేగులోని ఎచరీషియా కోలై(ఈ-కోలై) అనే బ్యాక్టీరియా.
- విధి: గాయపడినప్పుడు రెండు నుంచి ఐదు నిమిషాల్లో రక్తాన్ని గడ్డ కట్టిస్తుంది.
- లోపం: కె విటమిన్ లోపం వల్ల అధిక రక్తస్రావం జరుగుతుంది.
విటమిన్ -బీ కాంప్లెక్స్
- ఇవి సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో లభిస్తాయి.
- బి1-విటమిన్ : దీన్ని థయామిన్, యాంటీ బెరిబెరి విటమిన్ అంటారు.
- లభించే పదార్థాలు: తవుడు, పాలు
నోట్: బాగా పాలిష్ చేసిన బియ్యంలో బి1 విటమిన్ లభించదు. - విధి: కార్బోహైడ్రేట్ల జీవక్రియకు సహకరిస్తుంది.
- లోపం: దీని లోపం వల్ల బెరిబెరి, హృదయ స్పందన లోపం, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం.
బి2-విటమిన్:
- దీన్ని రైబోఫ్లొవిన్, ఎల్లో విటమిన్ అంటారు.
- విధి: ఇది సీపీఎఫ్ జీవక్రియకు సహకరిస్తుంది.
లోపాలు: - కిలోసిస్: నోరు మూలల్లో పగిలి రక్తస్రావం అవుతుంది.
- గ్లాసైటీస్: నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరుస్తుంది.
బి3- విటమిన్
- నియాసిన్, నికోటినిక్ ఆమ్లం, యాంటీ పెల్లాగ్రా విటమిన్ అంటారు.
- లభించే పదార్థాలు: ఈస్ట్ (బూజు) అనే శిలీంధ్రం, వేరుసెనగ, చిలగడ దుంప (స్వీట్ పొటాటో)
- విధి: సీపీఎఫ్ జీవక్రియ
- లోపం: పెల్లాగ్రా (చర్మం వాచి పైపొర పొలుసులుగా ఊడిపోవడం)
బి6- విటమిన్ :
- పెరిడాక్సిన్, యాంటీ ఎనీమియా విటమిన్ (రక్తహీనత నిరోధకం) అంటారు.
- లభించే పదార్థాలు: అన్ని రకాల పప్పులు
- విధి: ప్రోటీన్ల జీవక్రియ.
- లోపం: ఎనీమియా (ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గడం)
- దీనికి ప్రధాన కారణమైన మూలకం ఐరన్(Fe)
నోట్: ఐరన్ రక్తంలో అధికంగా ఉండే లోహం. ఇది ఆకుకూరలు, పాలు, బెల్లం, డ్రైఫ్రూట్స్‌లో ఎక్కువగా లభిస్తుంది.
బి12- విటమిన్
- సయనోకొబాలమిన్ అంటారు.
- ఇది నీలి వర్ణంలో ఉండి కోబాల్ట్ అనే లోహాన్ని కలిగి ఉంటుంది.
- లభించే పదార్థాలు: కాలేయం, ఈకోలి బ్యాక్టీరియా
- విధి: అమైనో ఆమ్లాల జీవక్రియ
- లోపం: పెర్నీయస్ ఎనీమియా (హానికర రక్తహీనత) ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గడంతోపాటు హీమోగ్లోబిన్ శాతం (14-16%) కూడా తగ్గడం.
విటమిన్ -సీ
- దీన్ని ఆస్కార్బిక్ ఆమ్లం, యాంటీ స్కర్వీ విటమిన్, స్లిమ్‌నెస్ విటమిన్ అంటారు.
- లభించే పదార్థాలు: సిట్రస్ లేదా నిమ్మజాతి ఫలాలు, జామ, ఉసిరిలో అధిక మొత్తంలో లభిస్తుంది.
- విధి: 1. కొల్లాజన్ అనే ప్రోటీన్ తయారీలో ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలను అతికించడంలో తోడ్పడుతుంది. కోల్పోయిన భాగాలు తిరిగి ఏర్పరుస్తుంది.
- గాయాలు మానడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. యాంటీ క్యాన్సర్‌గా పని చేస్తుంది.
- లోపం: కండరాలు, ఎముకల నొప్పి, స్కర్వి
(చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగడం)
ఫలం / పదార్థం – ఆమ్లం
పాలు – లాక్టిక్ ఆమ్లం
చింతపండు – టార్టారిక్ ఆమ్లం (తేలుకాటుకు మందు)
ఆపిల్ – మానిక్ ఆమ్లం
ఉసిరి – ఆస్కిర్బిక్ ఆమ్లం
నిమ్మ – సిట్రిక్ ఆమ్లం
ద్రాక్ష – ఎసిటిక్ ఆమ్లం (వెనిగర్)
విటమిన్ల లోపంతో కలిగే వ్యాధులు
విటమిన్ ఏ – రేచీకటి, జిరాఫ్తాల్మియా, శుక్తపటలం పగలడం, చర్మం మీద పొలుసులు ఏర్పడటం
విటమిన్ డీ – రికెట్స్, ఎముకలు పెలుసు బారడం
విటమిన్ ఈ – పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం, ఎర్ర రక్తకణాల జీవితకాల పరిమితి తగ్గడం
విటమిన్ కే – రక్తం ఆలస్యంగా గడ్డకట్టడం
విటమిన్ బీ1 – బెరిబెరి, ఆకలి మందగించడం
విటమిన్ బీ2 – నోటిపూత, పెదవుల మూలాల్లో పగలడం
విమటిన్ బీ6 – రక్తహీనత, ఉద్వేగం, నాడీమండలంలో లోపాలు
ఫోలిక్ ఆమ్లం – అతిసారం, తెల్ల రక్తకణాలు తగ్గడం
విటమిన్ బీ12 – హానికర రక్తహీనత
బయోటిన్ – కండరాల నొప్పులు, నాడీమండలంలో తేడాలు, అలసట
విటమిన్ సీ – స్కర్వీ, చిగుళ్ల వాచి రక్తస్రావం కావడం, చర్మం కింద రక్తస్రావం కావడం
ప్రాక్టీస్ బిట్స్
1. కొవ్వులలో కరిగే విటమిన్లు
1) బి, సి 2) ఎ, డి
3) బి, డి 4) ఎ, సి
2. నీటిలో కరిగే విటమిన్లు
1) బి,సి 2) ఎ, డి
3) బి, డి 4) ఎ, సి
3. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం రావడానికి కారణమయ్యేది కింది వాటిలో ఏది?
1) కాల్సిఫెరాల్ 2) ఫైలో క్వినైన్
3) టోకోఫెరాల్ 4) రెటినాల్
4. పిల్లల్లో రికెట్స్ వ్యాధి ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది.
1) సన్‌షైన్ విటమిన్
2) యాంటీ జిరాప్తాల్మిక్ విటమిన్
3) టోకోఫెరాల్
4) నాఫ్తాక్వినోన్
5. ఏ విటమిన్ లోపం వల్ల రక్త స్కందనం ఆలస్యమవుతుంది.
1) ఎ 2) బి 3) సి 4) కె
6. ఆరోగ్యవంతమైన కళ్లకు అవసరమైన విటమిన్ ఏది?
1) రెటినాల్ 2) కాల్సిఫెరాల్
3) టోకోఫెరాల్ 4) నాఫ్తాక్వినోన్
7. విటమిన్-బి లోపం వల్ల కలిగే వ్యాధి
1) స్కర్వీ 2) కెరటోమలేసియా
3) బెరిబెరి 4) రికెట్స్
8. ఏ విటమిన్ లోపం వల్ల స్కర్వీ వస్తుంది?
1) ఎ 2) బి 3) సి 4) డి
9. శాకాహారుల్లో లోపించే విటమిన్ ఏది?
1) విటమిన్-బి12 2) విటమిన్-ఎ
3) విటమిన్ బి6 4) విటమిన్-డి
10. గర్భిణులు ఏ విటమిన్ ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు?
1) విటమిన్-సి
2) విటమిన్-బి9(ఫోలిక్ ఆమ్లం)
3) విటమిన్-బి6
4) విటమిన్-బి12
జవాబులు
1-2 2-1 3-3 4-1 5-4 6-1 7-3 8-3 9-1 10-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు