ఫలదీకరణం చెందకుండా ఏర్పడే ఫలం? ( జనరల్ సైన్స్)

ఫలం (The fruit)
– ఫలాల అధ్యయనాన్ని పోమాలజీ అని, ఫలాల పెంపకాన్ని పోమీకల్చర్ అని అంటారు.
– ఫలం ఏర్పడటం పుష్పించే మొక్కల ముఖ్య లక్షణం.
– సాధారణంగా ఫలం అనేది ఫలకవచం, విత్తనాలను కలిగి ఉంటుంది.
– ఫలకవచం శుష్కంగా లేదా కండకలిగి ఉంటుంది.
– ఫలకవచం (Peri carp) కండ కలిగి ఉన్నప్పుడు వెలుపల బాహ్య ఫలకవచం (Epicarp), మధ్యలో మధ్య ఫలకవచం (Meso carp), లోపల అంతఃఫలకవచం (Endo carp) ఉంటాయి.
– ఫలాలను స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి.. అనిషేక ఫలాలు (Partheno carpic fruits), అనృత ఫలాలు (False fruits), నిజ ఫలాలు (True fruits).
–ఫలదీకరణం చెందకుండా ఫలం ఏర్పడితే దాన్ని అనిషేక ఫలం అంటారు.
ఉదా: అరటి, ద్రాక్ష
– ఫలదీకరణ అనంతరం అండాశయం కాకుండా ఇతర భాగం ఫలంగా ఏర్పడితే అనృత ఫలం అంటారు.
ఉదా: ఆపిల్, జీడిమామిడి, స్ట్రాబెరీ
– ఫలదీకరణం అనంతరం అండాశయం ఫలంగా ఏర్పడితే నిజ ఫలం అంటారు.
విత్తనాలు (The seeds)
– ఫలదీకరణ అనంతరం అండాలు విత్తనాలుగా వృద్ధి చెందుతాయి.
– విత్తనం అనేది విత్తన కవచం, పిండాన్ని కలిగి ఉంటుంది.
– పిండం ఒక పిండాక్షం, ఒకటి (గోధుమ, మొక్కజొన్న మొదలైనవి) లేదా రెండు (చిక్కుడు, కంది) బీజదళాలను కలిగి ఉంటుంది.
–ఆహార పదార్థాలను నిల్వచేసే భాగం – బీజదళాలు
–విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండటాన్ని బపిండత అంటారు.
–విత్తనం వెలుపలి పొరను టెస్టా అని, లోపలి పొరను టెగ్మినా అని అంటారు.
– అతిపెద్ద విత్తనంగల మొక్క – లోడిసియా మాల్దీవికా
–అతిచిన్న విత్తనంగల మొక్క – ఆర్కిడ్ మొక్క
–విత్తనాలు మొలకెత్తడానికి నేల, నీరు, ఉష్ణోగ్రత, కాంతి అవసరం.
–విత్తనాలు మొలకెత్తడాన్ని మూడు రకాలుగా చూడవచ్చు. అవి..
ఊర్ధ భూమిజ అంకురణ
(Epigeal Germination): మొలకెత్తినప్పుడు బీజదళాలు భూమిపైకి వస్తాయి.
ఉదా: చింత, చిక్కుడు
అధో భూమిజ అంకురణ
(Hypogeal Germination): మొలకెత్తినప్పుడు బీజదళాలు భూమిలోపల ఉండి పోతాయి.
ఉదా: మొక్కజొన్న, బఠానీ
వివిపారి అంకురణ
(Viviparous Germin ation): ఫలాలు మొక్కలపై ఉన్నప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి.
ఉదా: మాంగ్రూవ్ మొక్కలు (మడ మొక్కలు)
– ఫలకవచం స్వభావాన్ని బట్టి ఫలాలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిని దిగువ పట్టికలో గమనిద్దాం.
ఫలం రకం ఉదాహరణ తినదగిన భాగాలు
పెంకుగల ఫలం జీడిమామిడి బీజదళాలు, కండగల పుష్పవృంతం (అనృత ఫలం)
సోరోసిస్ (సంయోగఫలం) అనాస పుష్పవిన్యాసం, రసయుత, రసభరిత పుష్పపుచ్చాలు
మృదుఫలాలతో కూడిన సీతాఫలం ప్రతి చిరుఫలంలోని మధ్య ఫలకవచం, అంతఃఫలకవచం
సంకలిత ఫలం
ద్వివిదారక ఫలం వేరుశనగ బీజదళాలు
సోరోసిస్ (సంయోగ ఫలం) పనస రసభరిత పరిపత్రాలు
హెస్పరీడియం తీపి ఆరెంజ్ (నారింజ) అంతఃఫలకవచంలోని రసయుత, రసభరిత,
———————————————————————–అండన్యాసకేశాలు
టెంకగల ఫలం కొబ్బరి అంకురచ్చదం
పెపో దోస మధ్య ఫలకవచం,అంతఃఫలకవచం,అండన్యాస స్థానం
ద్వివిదారక ఫలం చిక్కుడు బీజదళాలు
సైకోనస్ (సంయోగ ఫలం) మర్రి కండగల పుష్పవిన్యాస వృంతం
మృదు ఫలం టమాటా మధ్యఫలకవచం, అంతఃఫలకవచం, అండన్యాస స్థానం
టెంకగల ఫలం మామిడి మధ్య ఫలకవచం
కవచబీజకం వరి అంకురచ్చదం
ద్వివిదారక ఫలం బఠాని బీజదళాలు
పోమ్ ఆపిల్ కండగల పుష్పాసనం (అనృతఫలం)
ప్రాక్టీస్ బిట్స్
1. బంగాళదుంప దేని రూపాంతరం?
1) కాండం 2) వేరు
3) పుష్పం 4) పత్రం
2. అల్లం, పసుపు దేని రూపాంతరం?
1) వేరు 2) కాండం
3) పుష్పం 4) పత్రం
3. క్యారట్, ముల్లంగి, చిలగడ దుంపలు వేటి రూపాంతరాలు?
1) వేరు 2) కాండం
3) పుష్పం 4) పత్రం
4. అతిపెద్ద విత్తనం కలిగిన మొక్క ఏది?
1) ఆర్కిడ్ 2) లొడీసియా మాల్దీవికా
3) 1, 2 4) రఫ్లీషియా
5. ఫలాలు మొక్కపై ఉండగానే విత్తనాలు మొలకెత్తడాన్ని ఏమంటారు?
1) అధోభూమిజ అంకురణ
2) ఊర్ధభూమిజ అంకురణ
3) వివిపారి అంకురణ 4) పైవన్నీ
6. ఏ మొక్కల్లో విత్తనాలు మొలకెత్తినప్పుడు బీజదళాలు భూమిలోపలే ఉంటాయి?
1) మొక్కజొన్న 2) బఠానీ
3) 1, 2 4) చిక్కుడు
7. ఏ మొక్కల్లో విత్తనాలు మొలకెత్తినప్పుడు బీజదళాలు భూమిపైకి వస్తాయి?
1) చిక్కుడు 2) చింత
3) 1, 2 4) బఠానీ
8. దేనిలో అంకురచ్ఛదం తినదగిన భాగం?
1) మామిడిలో డ్రూప్
2) యాపిల్లో పోమ్
3) దోసలో పెపో
4) కొబ్బరిలో పెంకుగల ఫలాలు
9. వేటిలో బీజదళాలు తినదగిన భాగం?
1) బఠానీ 2) వేరుశనగ
3) 1, 2 4) వరి
10. అరటి, ద్రాక్షలో ఫలం రకం ఏది?
1) నిజ ఫలం 2) అనృత ఫలం
3) అనిషేక ఫలం 4) పైవన్నీ
11. యాపిల్, జీడి మామిడి, స్ట్రాబెరీలో ఫలం రకం ఏది?
1) నిజ ఫలం 2) అనృత ఫలం
3) అనిషేక ఫలం 4) పైవన్నీ
12. మొక్కలకు సంబంధించి ఫలదీకరణం అనంతరం ఏం జరుగుతుంది?
1) అండాశయం ఫలంగా మారుతుంది
2) అండాలు విత్తనాలుగా మారుతాయి
3) సంయుక్త బీజం పిండంగా మారుతుంది
4) పైవన్నీ
13. ఉడుతల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఏది?
1) ఖైరాప్టెరోఫిలి 2) థెరోఫిలి
3) ఒఫియోఫిలి 4) మెలకోఫిలి
14. స్వపరాగ సంపర్కం/ఆత్మపరాగ సంపర్కం వేటిలో జరుగుతుంది?
1) గోధుమ 2) పీ నట్
3) నేరేడు 4) పైవన్నీ
15. పరపరాగ సంపర్కం ఏ మొక్కల్లో జరుగుతుంది?
1) ఉమ్మెత్త 2) మందార
3) గుమ్మడి 4) పైవన్నీ
16. ఉపాంత అండన్యాసం (Marginal placentation) కలిగిన మొక్క ఏది?
1) మందార 2) ఆవ
3) పొద్దుతిరుగుడు 4) బఠానీ
17. అక్షీయ అండన్యాసం (Axile placen tation) కలిగిన మొక్క ఏది?
1) టమాటా 2) డయాంథిస్
3) బంతి 4) బఠానీ
18. వర్షాకాలంలో పుష్పించే మొక్క ఏది?
1) గన్నేరు 2) బంతి
3) చామంతి 4) మామిడి
19. ఎండాకాలంలో పుష్పించే మొక్క ఏది?
1) మల్లె 2) మామిడి
3) వేప 4) పైవన్నీ
20. సాధారణంగా అండాలు ఉండే పిండకోశంలో కణాలు, కేంద్రకాల సంఖ్య వరుసగా ఎంత ఉంటుంది?
1) 8, 7 2) 7, 8
3) 7, 7 4) 8, 8
21. పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగం ఏది?
1) అండకోశం 2) కేసరావళి
3) ఆకర్షణ పత్రావళి 4) రక్షణ పత్రావళి
22. పుష్ప భాగాల్లో వెలుపలివైపు అమరి ఉండే భాగం?
1) అండకోశం 2) కేసరావళి
3) ఆకర్షణ పత్రావళి 4) రక్షణ పత్రావళి
23. పరాగ రేణువుల అధ్యయనం?
1) పేలియెంటాలజీ 2) పేలినాలజీ
3) పేలిమ్నియాలజీ 4) పేలియో బాటనీ
24. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏది?
1) అండకోశం 2) కేసరావళి
3) ఆకర్షణ పత్రావళి 4) రక్షణ పత్రావళి
25. కవాటయుత పుష్పరచన కలిగిన మొక్క ఏది?
1) మందార 2) పత్తి
3) బెండ 4) జిల్లేడు
26. చిక్కైన పుష్పరచన ఏ మొక్కల్లో కనబడుతుంది?
1) తంగేడు 2) జిల్లేడు
3) పత్తి 4) బెండ
27. బలింగాశ్రయ స్థితి (Polygamous condition) ఏ మొక్కల్లో కనబడుతుంది?
1) మామిడి 2) తాటి
3) బొప్పాయి 4) కొబ్బరి
28. ద్విలింగక పుష్పాలు కలిగిన మొక్క ఏది?
1) ఉమ్మెత్త 2) మందార
3) 1, 2 4) కాకర
29. ఏకలింగక పుష్పాలు కలిగిన మొక్క ఏది?
1) దోస 2) సొర
3) కాకర 4) పైవన్నీ
30. సంపూర్ణ పుష్పం కలిగిన మొక్క ఏది?
1) ఉమ్మెత్త 2) బొప్పాయి
3) కాకర 4) దోస
31. అసంపూర్ణ పుష్పం కలిగిన మొక్క ఏది?
1) దోస 2) కాకర
3) బొప్పాయి 4) పైవన్నీ
32. వృక్షరాజ్యంలో అతిపెద్ద పుష్పంగల మొక్క ఏది?
1) రఫ్లీషియా ఆర్నాల్డె
2) ఉల్ఫియా అంగుస్టా
3) ఓక్ 4) మందార
33. వృక్షరాజ్యంలో అతిచిన్న పుష్పంగల మొక్క ఏది?
1) రఫ్లీషియా ఆర్నాల్డె
2) ఉల్ఫియా అంగుస్టా
3) అమర్ఫోపాలస్ టైటానం
4) కాగితపు పూలు
34. కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడే ముఖ్యమైన శాఖీయ అంగం?
1) వేరు 2) కాండం
3) పుష్పం 4) పత్రం
35. అతిపెద్ద పుష్ప విన్యాసంగల మొక్క ఏది?
1) అమర్ఫోపాలస్ టైటానం 2) క్యాబేజీ
3) రఫ్లీషియా ఆర్నాల్డె
4) ఉల్ఫియా అంగుస్టా
36. అతిపెద్ద శాఖీయ మొగ్గ/శాఖీయ కోరకంగల మొక్క ఏది?
1) తంగేడు 2) నీరుల్లి
3) క్యారట్ 4) క్యాబేజీ
37. ప్రత్యుత్పత్తి పత్రాలుగల మొక్క ఏది?
1) బ్రయోఫిల్లం (రణపాల)
2) డయోనియా
3) ఒపన్షియా 4) నీరుల్లి
38. కీటకాహార/మాంసాహార పత్రాలుగల మొక్క ఏది?
1) నెపంథిస్ 2) యుట్రిక్యులేరియా
3) డ్రాసిరా 4) పైవన్నీ
39. ప్రభాసనాలు (Phyllodes) ఏ మొక్కల్లో ఉంటాయి?
1) ఆస్ట్రేలియా తుమ్మ 2) ఒపన్షియా
3) నీరుల్లి 4) బఠానీ
40. ఏ మొక్కల్లో కండగల పత్రాలు ఉంటాయి?
1) నీరుల్లి 2) వెల్లుల్లి
3) 1, 2 4) జామ
41. నులితీగల (Tendrils)ను ఏ మొక్కల్లో చూడవచ్చు?
1) ఆవ 2) గన్నేరు
3) బఠానీ 4) ఆల్స్టోనియా
42. ఏకాంతర పత్ర విన్యాసం (alternate Phyllotaxy) ఏ మొక్కల్లో చూడవచ్చు?
1) మందార 2) జిల్లేడు
3) గన్నేరు 4) జామ
సమాధానాలు
1-1, 2-2, 3-1, 4-2, 5-3, 6-3, 7-3, 8-4, 9-3, 10-3, 11-2, 12-4, 13-2, 14-4, 15-4, 16-4,
17-1, 18-1, 19-4, 20-2, 21-2, 22-4, 23-2, 24-1, 25-4, 26-1, 27-1, 28-3, 29-4, 30-1, 31-4, 32-1, 33-2, 34-2, 35-1, 36-4, 37-1, 38-4, 39-1, 40-3. 41-3, 42-1.
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు