BIOLOGY | భారతదేశంలో విలుప్త వన్యజాతులుగా వేటిని గుర్తించారు?
1. ఆక్టోపస్ అనేది?
1) ఆర్థ్రోపొడా 2) ఇఖైనోడెర్మ్
3) హెమికార్డేట్ 4) మొలస్కా
2. ఓజోన్ రంధ్రం అనేది కింది విధంగా ఏర్పడుతుంది?
1) ఓజోన్ పొరలో రంధ్రం ఏర్పడటం వల్ల
2) ట్రోపో ఆవరణంలో ఓజోన్ పొర మందం క్షీణించటం వల్ల
3) స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర మందం క్షీణించడం వల్ల
4) ట్రోపో ఆవరణంలో ఓజోన్ పొర మందంపెరగడం వల్ల
3. మానవదేహం ఏ భాగంలో పిండి పదార్థాలు ైగ్లెకోజెన్గా నిల్వ చేయబడతాయి?
1) జీర్ణాశయం 2) క్లోమం
3) కాలేయం 4) శేషాంత్రికం
4. కేసరిపప్పు ఆహారంలో తీసుకోవడం వల్ల ఏర్పడే ‘లాథరిజమ్’ అనే వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
1) దేహాభివృద్ధి మందగింపు
2) డయాబెటిస్‌కు లోనవడం, ప్రత్యుత్పత్తి విఫలమవటం
3) మానసికాభివృద్ధి మందగింపు, ప్రత్యుత్పత్తి విఫలమవడం
4) కొల్లాజెన్ తంతువులు, నాళికలు పలుచబడుట, మొత్తం అస్థిపంజరం సరిగా అస్థీకరించకపోవడం
5. కణిక సహిత రక్తకణం కానిది?
1) శోషరస కణం 2) ఇసినోఫిల్
3) బేసోఫిల్ 4) న్యూట్రోఫిల్
6. మానవదేహం కింది ఏ వ్యాఖ్యలతో అనుసంధానించవచ్చు?
1) సొమాటోట్రోఫిన్ ఉత్పత్తి వ్యాయామం చేయుట వల్ల ఎక్కువవుతుంది
2) పురుషునిలోని వృక్కాలు ప్రొజెస్టిరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి
3) స్త్రీలలో అధివృక్క గ్రంథి టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి
4) అడ్రినల్ గ్రంథి సాధారణంగా ఉత్పత్తి చేసే కార్టిసాల్ మోతాదు ఒత్తిడి వల్ల తగ్గుతుంది
7. నిశ్చితవాక్యం (ఎ) – 1980లో భోపాల్
ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు విడుదలైన మిథైల్ ఐసో సయనేట్ (MIC) 20000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది.
హేతువు (ఆర్) – ఫ్యాక్టరీలోని విషరహిత ద్రావణాలతో నింపిన రక్షిత పొగగొట్టాలు పనిచేయకుండా విఫలమైనవి
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఆర్) నిజం కానీ (ఎ) తప్పు
8. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. జనాభాలోని ప్రతి ఒక్కరూ స్వైన్‌ఫ్లూ, అతిథేయిగా దాడి చేయబడుతారు
2. ప్రాథమిక చికిత్సలో స్వైన్‌ఫ్లూకు ప్రతిరక్షకాల పాత్ర లేదు
3. స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా, వ్యాధికి లోనైన ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ జీవిని చంపివేయుట
1) 1, 2 2) 2
3) 2, 3 4) 1, 2, 3
9. లాక్టోఫ్లావిన్ కింది వాటిలో ఎందులో ఉంటుంది?
1) కంటి చుక్క
2) పార కశాభాయుత దేహం
3) గాల్జీసంక్లిష్టం 4) మైటోకాండ్రియా
10. ఏ అమైనో ఆమ్లం కాంతిలోని 280nm తరంగదైర్ఘ్యాన్ని శోషించుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది?
1) ైగ్లెసీన్ 2) సిస్టీన్
3) ల్యూసిన్ 4) ట్రీఫ్టోఫాన్
11. కింది వాటిలో గ్రీన్హౌస్ వాయువైన మీథేన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేవి?
1. వరిపొలాలు 2. బొగ్గు గనులు
3. పెంపుడు జంతువులు
4. మాగాణి భూములు
1) 1, 4 2) 2, 3
3) 1, 2, 3 4) 1, 2, 3, 4
12. జతపరచండి.
ఎ. పరాన్న జీవి సంబంధం 1. జాత్యంతర సంబంధం
బి. హానికర కీటకం 2. చెదపురుగు
సి. సాంఘిక జీవనం 3. ఎఫిడ్
డి. సంపర్క పోటీ తత్వం 4. జాతుల మధ్య సంబంధం
5. ఏనుగు
1) ఎ-3, బి-1, సి-5, డి-2
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-5, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
13. సర్కేడియన్ లయలు అంటే వేటి జీవక్రియ (లేదా) ప్రవర్తన లయలు?
1) 24 నిమిషాల వలయం
2) 24 గంటల వలయం
3) 24 రోజుల వలయం
4) 24 నెలల వలయం
14. నిశ్చిత వాక్యం (ఎ) – స్వేచ్ఛా ఆక్సిజన్ పరమాణువులు వాతావరణంలో రెండు బిలియన్ సంవత్సరాల క్రితం నుంచి గుమికూడాయని భూగర్భ సాక్ష్యాల ఆధారంగా తెలుస్తుంది
హేతువు (ఆర్) – నీలి ఆకుపచ్చని బ్యాక్టీరియాకి చెందిన జీవులు వాతావరణంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి
1) (ఎ), (ఆర్) రెండూ నిజం.
(ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం.
(ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఆర్) నిజం కానీ (ఎ) తప్పు
15. BOD అనేది కాలుష్య సేంద్రియ పదార్థాన్ని ఇచ్చిన ఒక పదార్థంలో కొలవడానికి ఉపయోగపడేది?
1) నీరు 2) గాలి
3) మృత్తిక 4) కొలను అడుగు భాగంలోని బురదమట్టి
16. కింది వాటిలో ఎప్పటికీ కాల్చబడని అడవి?
1) కొనిఫర్ / శృంగాకార అడవులు
2) వర్షపాత అడవులు
3) ఆకురాల్చే అడవులు
4) టండ్రా అడవులు
17. సరైన వాక్యాలను గుర్తించండి.
1. సంఘం, ఆవాసం పరస్పరం ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి
2. సంఘం, ఆవాసం పరస్పరం ఆధారపడి ఉంటాయి
3. సంఘం, ఆవాసం ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి
1) 1, 2 2) 1
3) 1, 3 4) 2
18. పిత్తాశయానికి జీర్ణాశయం, చిన్నపేగుల నుంచి పోషక పదార్థసహిత రక్తాన్ని అందించే రక్తనాళం?
1) ఎడమ కాలేయ ధమని
2) కాలేయ సిర
3) కుడి కాలేయ ధమని
4) కాలేయ మహాసిర
19. జనాభా నియంత్రణను జంతువుల్లో సంబంధించని కారకం ఏది?
1) ప్రాంతీయత
2) జీవుల వంశక్రమంలో పోటీ
3) ముప్పు వాటిల్లుట
4) శీతాకాల సుప్తావస్థ
20. టినామస్, ఎగురలేని పక్షుల ప్రజాతికి చెందిన పక్షి ఏ ఖండంలో ఎక్కడ గుర్తించవచ్చు?
1) ప్రాచీన ఆర్కిటిక్ మండలం
2) ఓరియంటల్ మండలం
3) నియోట్రాఫికల్ మండలం
4) నవీన ఆర్కిటిక్ మండలం
21. వాలేన్ సిద్ధాంతం ప్రకారం ఏ సందర్భాలు రక్షిత అనుకరణలో అవసరమని చెప్పవచ్చు?
1. నవీన జాతులచే ఒకే రకంగా జీవులు అనుకరించడాన్ని అనుకరణ అంటారు.
2. అనుకరణ రక్షణరహితమైనది, హానికరమైన జంతువులను అనుకరిస్తాయి
3. అనుకరణలు, నమూనాల కంటే ఎల్లప్పుడూ తక్కువ సంఖ్యలో ఉంటాయి
4. అనుకరణ తక్కువగా ఉన్నప్పుడు, బాహ్యపరమైనది, దృశ్యపరమైనది
1) 1, 3 2) 2, 4
3) 1, 2, 4 4) 1, 2, 3, 4
22. హ్యూమస్ అనేది ఎలా ఏర్పడుతుంది
1) సేంద్రియ పదార్థం మృత్తికలో పూర్తిగా కుళ్లుట వల్ల
2) సేంద్రియ పదార్థం మృత్తికలో పాక్షికంగా కుళ్లుట వల్ల
3) కొలనులో సేంద్రియ పదార్థం పూర్తిగా కుళ్లుట వల్ల
4) కొలనులో సేంద్రియ పదార్థం పాక్షికంగా కుళ్లుట వల్ల
23. నిశ్చితవాక్యం (ఎ) – టాడ్‌పోల్ తోక రూపవిక్రియ దశలో క్షీణిస్తుంది
హేతువు (ఆర్) – జల విశ్లేషణ ఎంజైమ్స్ ఈ క్షీణతకు కారణం
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఆర్) నిజం కానీ (ఎ) తప్పు
24. ఆవరణ వ్యవస్థలో శక్తి అనేది?
1) ఏక దిశలో చలిస్తుంది
2) అచక్రీయంగా కోల్పోతుంది
3) అచక్రీయంగా చలిస్తుంది
4) అత్యధిక స్థాయి నుంచి అత్యల్ప పోషక స్థాయి వరకు చలిస్తుంది
25. నిశ్చితవాక్యం (ఎ) – పైలాండోప్రోక్టా, ఎక్టోప్రోక్టా అనే వేర్వేరు శాఖలుగా బ్రయోజోవా విభజించారు
హేతువు (ఆర్) – ఎండోప్రోక్టా, ఎక్టోప్రోక్టాతో పోలికలను కలిగి ఉన్నప్పటికి ఎండోప్రోక్టా శరీరకుహరరహిత జీవులకు చెందినది అయితే, ఎక్టోప్రోక్టా శరీర కుహరసహితం
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఆర్) నిజం కానీ (ఎ) తప్పు
26. జతపరచండి.
ఎ. ఎకోటోన్ 1. ప్రవాహనీరు
బి. బెంథిక్ 2. ఒక సంఘం మరో దానితో స్థాన భ్రంశం చెందటం వల్ల
సి. క్రమకం 3. రెండు సంఘాల మధ్య సంధాన స్థానం
డి. లోటిక్ 4. సముద్రం అడుగునున్న మండలం
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-1, డి-2
27. కాల్షియం లభించని పదార్థం?
1) బియ్యం 2) రాగి
3) వెన్నతీసిన పాలు 4) గుడ్డు
28. జతపరచండి.
ఎ. ఉష్ణోగ్రత 1. ద్రవాభిసరణ నియంత్రణ సమస్య
బి. కాంతి హెచ్చుతగ్గులు 2. శాకభక్షక జీవులకు ఆహారపు కొరత
సి. H+ 3. జంతు విస్తరణలో ప్రభావం చూపుట
డి. తక్కువ క్షీణత 4. స్థూల పరిమిత కారకం
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-2, సి-1, డి-3
29. ప్రవాళాలు, జూక్సాంథెల్లే మధ్య సంబంధాన్ని ఏమంటారు?
1) శుద్ధ సహజీవనం
2) జీవక్రియ సంబంధ సహజీవనం
3) పరభక్షణం
4) వ్యాధికారకత
30. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. ఎలీసా పరీక్షను క్యాన్సర్ నిర్ధారక పరీక్షలో ప్రాథమికంగా, ఆధార పరీక్షగా ఉపయోగిస్తారు
2. 50% Rh+, 50% Rh- గా మానవ జనాభా ఉంటుంది
1) 1 2) 2
3) 1, 2 4) 1, 2 కాదు
31. నిశ్చితవాక్యం (ఎ) – గ్లోబిన్ గొలుసులో నిర్మాణాత్మక మార్పులు కలుగుట వల్ల రక్తానికి సంబంధించిన తలసీమియా అనే భయంకరమైన వ్యాధి కలుగుతుంది
హేతువు (ఆర్) – గ్లోబిన్ గొలుసులో అమైనో ఆమ్లాల క్రమంలో మార్పులు జరుగుట వల్ల నిర్మాణాత్మక మార్పులు కలుగుతాయి
1) (ఎ), (ఆర్) నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఆర్) నిజం కానీ (ఎ) తప్పు
32. భారతదేశంలో విలుప్త వన్యజాతులుగా చెప్పగలిగే జత/జతలను గుర్తించండి.
1) హిమాలయ మచ్చల జింక, భారతదేశపు సింహం, ఖడ్గమృగం, సాంబార్ , కాకి
2) హిమాలయ మచ్చల జింక, భారతదేశపు సింహం, నీటి ఏనుగు, అడవి దున్న, బంగారు పిల్లి
3) ఎర్గెట్, నల్ల ఎలుగుబంటి, అడవిదున్న, మచ్చల జింక
4) హిమాలయ మచ్చల జింక, ధ్రువపు చిరుత, కశ్మీర్ జింక, అడవి గాడిద
33. నిశ్చితవాక్యం (ఎ) – నిజకేంద్రక జీవుల కంటే కేంద్రక పూర్వ జీవులు ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందుతాయి
హేతువు (ఆర్) – కేంద్రక పూర్వ జీవుల్లో క్రోమోజోమ్స్లు పొట్టిగా మందంగా ఉండి, కండె తంతు పరికరం ఏర్పడకపోవటం, అవి సరళంగా ద్విగుణీకరణ చెంది డీఎన్ఏ విడిపోతుంది.
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఆర్) నిజం కానీ (ఎ) తప్పు
34. క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్‌తో నిర్మితమైన క్రిమిసంహారక పదార్థం ఆహార పంటలపై పిచికారీ చేస్తారు. ఆహారపు గొలుసు ఈ విధంగా ఉంటుంది.
ఆహారపు పంట -> ఎలుక -> పాము -> గద్ద ఈ ఆహారపు గొలుసులో అత్యధిక శాతంలో ఎక్కడ క్రిమిసంహారకం గుమికూడుతుంది.
1) ఆహారపు పంట 2) ఎలుక
3) పాము 4) గద్ద
35. జతపరచండి.
ఎ. గల్ఫ్ ఆఫ్ మన్నార్ 1. గుజరాత్
బి. సుందర్బన్స్ 2. పశ్చిమబెంగాల్
3. రాణ్ ఆఫ్ కచ్ 3. తమిళనాడు
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-3, బి-2, సి-1
జవాబులు
1.4 2.3 3.3 4.4
5.1 6.4 7.3 8.3
9.2 10.4 11.4 12.2
13.2 14.4 15.1 16.2
17.1 18.4 19.4 20.3
21.4 22.2 23.1 24.3
25.3 26.1 27.1 28.2
29.2 30.4 31.1 32.1
33.1 34.4 35.4
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు