General Studies | సాధారణ ఆమ్లాల్లో తప్పనిసరిగా ఉండే మూలకం?
రసాయనశాస్త్రం
1. మిథైల్ ఆరెంజ్ సూచికను ఆమ్ల ద్రావణం, క్షార ద్రావణానికి కలిపినప్పుడు ఏర్పడే రంగులు వరుసగా…
1) ఎరుపు, పసుపు
2) ఆకుపచ్చ, ఎరుపు
3) నీలం, ఎరుపు
4) పసుపు, ఎరుపు
2. సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీకి అవసరమైన వాయువులేవి?
ఎ. ఆక్సిజన్
బి. సల్ఫర్ డై ఆక్సైడ్
సి. హైడ్రోజన్ సల్ఫైడ్
1) బి 2) ఎ, బి
3) ఎ, సి 4) పైవన్నీ
3. నిశ్చితం (ఎ): ఎర్ర చీమలు కుట్టినప్పుడు మంటగా ఉంటుంది
కారణం (ఆర్): ఎర్ర చీమలు కుట్టినప్పుడు మన శరీరంలోకి ఫార్మికామ్లాన్ని పంపిస్తాయి
1) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు కానీ ఆర్ సరైనది
4. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లల్లో ఉండే పదార్థం?
1) కాల్షియం ఆక్సలేట్
2) కాల్షియం పాస్ఫేట్
3) కాల్షియం క్లోరేట్
4) కాల్షియం సల్ఫేట్
5. కింది వాటిలో క్షార గుణం గల ద్రావణాలు
ఎ. నిమ్మరసం
బి. బట్టల సోడా ద్రావణం
సి. వెనిగర్
డి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
ఇ. కాఫీ
1) ఎ, సి, ఇ 2) బి, ఇ
3) డి, ఇ 4) బి, డి
6. సోడియం హైడ్రాక్సైడ్ జల ద్రావణానికి మిథైల్ ఆరెంజ్ సూచికను కలిపితే ఏర్పడే రంగు?
1) ఎరుపు 2) పింక్
3) పసుపు 4) రంగు లేదు
7. ఒక రంగులేని ద్రావణాన్ని లోహ బైకార్బోనేట్కు కలిపినప్పుడు CO2 వెలువడింది. ఆ ద్రావణం?
1) క్షారం 2) ఆమ్లం
3) తటస్థం 4) చెప్పలేం
8. వెనిగర్లో ఉండే ఆమ్లం?
1) ఎసిటికామ్లం 2) ఫార్మికామ్లం
3) హైడ్రోక్లోరికామ్లం
4) సల్ఫ్యూరికామ్లం
9. ఆమ్ల వర్షాలకు సంబంధించి సరైన వాక్యం?
ఎ. ప్రధాన కారణం పారిశ్రామికీకరణం
బి, కారణమైనవి నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్లు
సి. ముఖ్యమైన ఆమ్లాలు నైట్రికామ్లం, సల్ఫ్యూరికామ్లం
డి. నేలల PH తగ్గి భూసారం దెబ్బతింటుంది
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
10. మానవ రక్తం PH విలువ ఎంత?
1) 7.2 2) 7.8
3) 6.6 4) 7.4
11. ఆమ్లాలకు అతిముఖ్యమైన ఒక మూలకం?
1) హైడ్రోజన్ 2) నైట్రోజన్
3) ఆక్సిజన్ 4) హీలియం
12. సాధారణ యాంటాసిడ్ సిరప్లలో ఉండేది ఏది?
1) అల్యూమినియం హైడ్రాక్సైడ్
2) సోడియం హైడ్రాక్సైడ్
3) జింక్ హైడ్రాక్సైడ్ 4) వెనిగర్
13. క్షార మృత్తిక లోహం కానిది ఏది?
1) Mg 2) Ba 3) Ca 4) Fr
14. గాలిలో X, Y ల ఆక్సైడ్లుండటం వల్ల ఆమ్ల వర్షం ఏర్పడుతుంది. X, Y లు వరుసగా..
1) నైట్రోజన్, సల్ఫర్
2) సల్ఫర్, లెడ్
3) లెడ్, మెర్క్యూరీ
4) నైట్రోజన్, లెడ్
15. ఫినాప్తలీన్ సూచిక క్షారంలో ప్రదర్శించే రంగు?
1) పసుపు 2) పింక్
3) రంగు లేదు 4) ఆకుపచ్చ
16. ఆమ్లం బలం దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) ఆమ్ల గాఢత
2) H+ అయాన్ల గాఢత
3) OH- అయాన్ల గాఢత
4) అయాన్ల తటస్థీకరణం కోసం ఉపయోగించే క్షార మోల్ల సంఖ్య
17. H+ అయాన్ గాఢత 10X104 మోల్/ లీటర్ అయితే ఆ ద్రావణం PH విలువ?
1) 1 2) 2 3) 3 4) 4
18. వీటిలో సాధారణ లవణాన్ని ఇచ్చే జంట?
1) సోడియం థయో సల్ఫేట్, సల్ఫేట్ డై ఆక్సైడ్
2) హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్
3) క్లోరిన్, ఆక్సిజన్ వాయువు
4) నత్రికామ్లం, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్
19. నీలి లిట్మస్ను ఎరుపుగా మార్చేవి?
1) ఆమ్లాలు 2) క్షారాలు
3) లవణాలు 4) పరిశుద్ధ జలం
20. ఆమ్ల విరోధి (యాంటాసిడ్) ఏది?
1) శీతల పానీయం 2) వెనిగర్
3) నిమ్మరసం 4) బేకింగ్ సోడా
21. క్షార యానకంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు?
1) పసుపు 2) పింక్
3) రంగులేదు 4) ఎరుపు
22. ఆమ్లం, క్షారం రెండింటిలాగా ప్రవర్తించే పదార్థం?
1) క్షారం 2) లవణం
3) మిశ్రమం 4) ద్వి స్వభావయుత పదార్థం (ఆంఫొటరిక్)
23. నిశ్చితం (ఎ): క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి
కారణం (ఆర్) క్షారాలు ముట్టుకుంటే మృదువుగా సబ్బును తాకినట్లు ఉంటాయి
1) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైంది కానీ ఆర్ సరైనది కాదు
4) ఎ సరైంది కాదు కానీ ఆర్ సరైనది
24. సోడా నీటిలో ఉండే ఆమ్లం?
1) కార్బోనికామ్లం
2) పాస్ఫారికామ్లం
3) సల్ఫ్యూరికామ్లం 4) వెనిగర్
25. సజల సల్ఫ్యూరికామ్ల జల ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చెందించినప్పుడు ఆనోడ్, కాథోడ్ల వద్ద వెలువడే వాయు ఉత్పన్నాలు వరుసగా ఏవి?
1) SO2, H2 2) H2SO4
3) H2, O2 4) O2, H2
26. ఆమ్ల యానకంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు?
1) పసుపు పచ్చ 2) పింక్
3) ఆకుపచ్చ 4) ఎరుపు
27. క్షారలోహం కానిది ఏది?
1) లిథియం 2) సోడియం
3) పొటాషియం 4) కాల్షియం
28. సాధారణ ఆమ్లాల్లో తప్పనిసరిగా ఉండే మూలకం?
1) క్లోరిన్ 2) సల్ఫర్
3) హైడ్రోజన్ 4) ఆక్సిజన్
29. ఆమ్లాలు రుచికి ఎలా ఉంటాయి?
1) తియ్యగా 2) పుల్లగా
3) చేదుగా 4) వగరుగా
30. ఆమ్ల వర్షానికి కారణమైన ఆక్సైడ్లు?
ఎ. నైట్రోజన్ ఉన్నత ఆక్సైడ్లు
బి. సల్ఫర్ ఆక్సైడ్లు
సి. కార్బన్ ఆక్సైడ్లు
డి. క్లోరిన్ ఆక్సైడ్లు
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
31. చిన్నపిల్లలకు యాంటాసిడ్ (ఆమ్లతకు విరుగుడు)గా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా రసాయన నామం?
1) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
2) అల్యూమినియం హైడ్రాక్సైడ్
3) మెగ్నీషియం సల్ఫేట్
4) మెగ్నీషియం కార్బోనేట్
32. కింద ఇచ్చిన లోహాల జాబితాలో ఎన్ని లోహాలు ఆమ్లాలతోనూ, క్షారాలతో చర్యనొందుతాయి?
ఎ. అల్యూమినియం బి. జింక్
సి. బెరీలియం డి. ఐరన్
ఇ. కాల్షియం
1) 2 2) 1 3) 3 4) 4
33. నిమ్మ ఉప్పులో ఉండేది?
1) ఎసిటికామ్లం 2) సిట్రికామ్లం
3) హైడ్రోక్లోరికామ్లం 4) ఫార్మికామ్లం
34. కిందివాటిలో ఆల్కలీ?
1) NaOH 2) KOH
3) Mg (OH)2 4) Be(OH)2
35. తేనెటీగ కుట్టినప్పుడు దాన్నుంచి విడుదలై, చర్మం కిందకు చేరే ఆమ్లం?
1) మిథనోయిక్ ఆమ్లం
2) టార్టారిక్ ఆమ్లం
3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
4) సిట్రిక్ ఆమ్లం
36. ఉదరంలో ఉండే ఆమ్లం?
1) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
2) ఎసిటికామ్లం
3) కార్బోనికామ్లం
4) సల్ఫ్యూరికామ్లం
37. నిమ్మ పండ్లలోని ఆమ్లం?
1) ఫార్మికామ్లం 2) ఎసిటికామ్లం
3) సిట్రికామ్లం 4) కార్బోనికామ్లం
38. బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన ద్రావణం?
1) బలమైన ఆమ్ల యానకం
2) తటస్థ క్షారం
3) తటస్థ 4) పైవన్నీ
39. PH విలువ 7 కన్నా తక్కువ గల లవణ జల ద్రావణాన్ని గుర్తించండి?
1) Na2SO4
2) CH3COONa
3) NaCl 4) NH4Cl
40. సోడానీటిలో ఉండే ఆమ్లం?
1) ఎసిటికామ్లం 2) కార్బోనికామ్లం
3) నైట్రస్ ఆమ్లం 4) నైట్రిక్ ఆమ్లం
41. PH=2 గల జల ద్రావణంలోని హైడ్రోజన్ ఆమ్లం పరిమాణం gL-1 లలో ఎంత?
(హైడ్రోక్లోరిక్ ఆమ్లం మోలార్
ద్రావ్యరాశి= 36.5g mol-1)
1) 3.65 2) 7.30
3) 0.365 4) 0.730
42. సాధారణ నీటితో కడిగితే కొవ్వులు శుభ్రం కావు. కానీ సబ్బు ఉపయోగిస్తే నీటిలో కొవ్వు కరగడానికి కారణం?
1) ద్రవాభిసరణం
2) కేశనాళికీయత
3) ఎమల్షన్ ఏర్పడటం
4) అవలంబనం ఏర్పడటం
43. విరిగిన పాలు పులిసిన వాసన రావడానికి కారణం?
1) సిట్రికామ్లం 2) లాక్టికామ్లం
3) ఎసిటికామ్లం 4) ఫార్మికామ్లం
44. ద్రాక్షలోని ఆమ్లం?
1) సిట్రికామ్లం 2) గ్లూకోనికామ్లం
3) సుక్రోనికామ్లం 4) ఫార్మికామ్లం
45. ఎసిటికామ్ల విలీన ద్రావణాన్ని ఏమంటారు?
1) గ్లిజరాల్ 2) వెనిగర్
3) పర్ హైడ్రాల్ 4) సిట్రస్ సాస్
46. షేవింగ్ సబ్బుల్లో పొటాషియం అయాన్లతో పాటు అధికంగా ఉండే పదార్థం?
1) స్టియరిక్ ఆమ్లం 2) గ్లిజరాల్
3) ఫార్మికామ్లం 4) మెంథాల్
47. ఆపిల్ గుజ్జు నుంచి తయారు చేసే ఆమ్లం?
1) సిట్రికామ్లం 2) మాలికామ్లం
3) ఫార్మికామ్లం 4) లాక్టికామ్లం
48. సోడియం బై కార్బోనేట్ జల ద్రావణం…
1) నీటి లిట్మస్ను ఎర్రగా మారుస్తుంది
2) మిథైల్ ఆరెంజ్ను పసుపుగా మారుస్తుంది
3) ఫినాప్తలీన్ను గులాబీ రంగులోకి
మారుస్తుంది
4) మిథైల్ ఆరెంజ్ను ఎరుపు రంగులోకి మారుస్తుంది
జవాబులు
1.1 2. 2 3. 1 4.1
5.4 6.3 7. 2 8.1
9.4 10. 4 11.1 12.1
13.4 14.1 15.2 16.2
17.3 18.2 19.1 20.4
21.1 22.4 23.2 24.1
25.4 26.3 27.4 28.3
29.2 30.2 31.1 32.4
33.2 34.4 35.1 36.1
37.3 38.2 39.4 40.2
41.3 42.3 43.2 44.1
45.2 46.1 47.2 48.2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు