Home
Eligibility Tests
TET Special – Child Development | వ్యక్తి భవిష్యత్తు స్థితిని సూచించేదే సహజ సామర్థ్యం
TET Special – Child Development | వ్యక్తి భవిష్యత్తు స్థితిని సూచించేదే సహజ సామర్థ్యం
సహజ సామర్థ్యాలు
- సహజ సామర్థ్యాల అర్థం, భావన, నిర్వచనాలు
- ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించడానికి వ్యక్తిలో స్వతహాగా వుండే సామర్థ్యమే సహజ సామర్థ్యం.
- వ్యక్తి ఏ రంగంలో రాణించగలడో తెలిపేదే సహజ సామర్థ్యం.
- ఎక్కువ సహజ సామర్థ్యం కలిగిన వ్యక్తి తక్కువ సమయంలో నైపుణ్యం సాధిస్తాడు.
- ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఉన్న సహజ సామర్థ్యాన్ని గుర్తించి సరైన శిక్షణ సూచించగలిగి, దానిపై సరైన అభిరుచి, వైఖరులను పెంచగలిగితే విద్యా వ్యవస్థ లక్ష్యాలు నెరవేరుతాయి.
- సచిన్ టెండూల్కర్‌కు క్రికెట్ ఆటకు సంబంధించిన సహజ సామర్థ్యాలు ఉండటం వల్లే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాడు. అలా కాకుండా సచిన్‌ను చెస్‌లో ప్రోత్సహించి ఉంటే ఆ రంగంలో సహజ సామర్థ్యాలు లేని కారణంగా సాధారణ వ్యక్తిగా మిగిలి ఉండేవాడు.
- ప్రజ్ఞ అనేది వ్యక్తి సాధారణ మానసిక సామర్థ్యం అయితే, సహజ సామర్థ్యం ప్రత్యేక సామర్థ్యం.
- సహజ సామార్థ్యాల అధ్యయనానికి ఆద్యుడు – సి.ఎల్.హాల్
- సహజ సామర్థ్యాల మాపనానికి మూల పురుషుడు – థర్స్టన్
- సంఖ్యాపరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో అనేక చిన్న దేశాలకంటే చివరిలో ఉండటానికి గల కారణం కచ్చితంగా క్రీడల్లో క్రీడాకారులకు సహజ సామర్థ్యాలు లేకపోవడం.
లక్షణాలు
- ఇవి జన్మతః సంక్రమిస్తాయి
- జన్మతః వచ్చిన ఈ సహజ సామర్థ్యాలు పరిసరాల ప్రభావం వల్ల వికాసం చెందుతాయి.
- ఇవి అంతర్గతంగా నిగూఢంగా ఉంటాయి.
- ఇది వ్యక్తి ప్రస్తుత స్థితి ఆధారంగా భవిష్యత్ రంగాన్ని ప్రాగుక్తీకరిస్తుంది.
- ఇది ప్రతివ్యక్తిలో ఉండే ఒక ప్రత్యేక మానసిక సామర్థ్యం.
- ఇది ఒక వ్యక్తి, మిగతా వ్యక్తులకు భిన్నంగా నిలుపుతుంది.
- ప్రజ్ఞతో పాటు వ్యక్తిలో ఉండే ప్రత్యేక కారకమే సహజ సామర్థ్యం.
- సాధారణ విషయాల్లో ఒక వ్యక్తి సాఫల్యం ప్రజ్ఞపై ఆధారపడి ఉంటే, వృత్తి సంబంధ విషయాల్లో వ్యక్తి సాఫల్యం సహజ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.
- ఒక వ్యక్త అనేక రంగాల్లో రాణించడానికి కారణం ప్రజ్ఞ అయితే ఒక ప్రత్యేక రంగంలో రాణించడానికి గల కారణం సహజ సామర్థ్యం.
నోట్: - రమ్య ఎటువంటి శిక్షణ లేకుండా పాటలు పాడగలుగుతుందంటే కారణం సహజ సామర్థ్యం. గీతకి ఎంత శిక్షణ ఇచ్చినా పాడలేకపోవడానికి కారణం సహజ సామర్థ్యం లేకపోడం.
- నిర్వచనాలు
- వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని, సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితే సహజ సామర్థ్యం -సి.ఎల్ హాల్
- భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితే సహజ సామర్థ్యం -ట్రాక్సీలర్
- ఒక ప్రత్యేకమైన విభాగంలో, ఉన్నత స్థాయిని చేరగలిగే కౌశలాన్ని శక్తి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటారు – మన్
- కొన్ని ప్రత్యేక సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడే లక్షణాలు కలిగిన ప్రవర్తనే సహజ సామర్థ్యం – బింగ్‌హాం.
- సామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చకోవడానికి, సాధనను ప్రదర్శించడానికి అవసరమైన అంతర్గత శక్తులను, అభివృద్ధి చెందిన సామర్థ్యాలను తెలిపేదే సహజ సామర్థ్యం – హాన్,మాక్లీన్
నోట్: - ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేది – సామర్థ్యం.
- ఒక వ్యక్తి గతాన్ని సూచించేది – సాధన.
- ఒక వ్యక్తి భవిష్యత్ స్థితిని సూచించేది – సహజ సామర్థ్యం.
సహజ సామర్థ్యం – రకాలు
- సహజ సామార్థ్యాలను విద్యాసంబంధ సహజ సామర్థ్యాలు, వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు,సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలు అని మూడు విభాగాలుగా విభజించారు.
1. విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు: విద్యా విషయంలో వారి ప్రస్తుత స్థితిని మాపనం చేసి భవిష్యత్తులో వారు ఎంచుకునే అభ్యాసనాంశాలకు సంబంధించి మార్గదర్శకం చేయడానికి ఉపయోగపడుతుంది. - దీని ప్రధానాంశాలు అన్నీ పదాలకు అర్థాలను తెలపడం, వాక్య నిర్మాణాలు చేయడం, పటాల్లోని అంశాలను వ్యాఖ్యానించడం, గణిత సమస్యలను సాధించడం అమూర్త ఆలోచనకు సంబంధించిన సామర్థ్యాలపై ఉంటాయి.
ఉదా:
1. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ (MPRT)
2. రెఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్
బ్యాటరీ (DATB) - ఈ పరీక్షల ద్వారా లభించిన గణనల్లో విద్యార్థి సహజ సామర్థ్యాలు ఎందులో ఎక్కువగా ఉన్నాయో గమనించి, శిక్షణ ఇచ్చినైట్లెతే, నిర్దిష్ట రంగంలో రాణిస్తాడని చెప్పవచ్చు.
- ఈ పరీక్షలను మనదేశంలో సైనిక పాఠశాల్లో ప్రవేశం కోసం రక్షణశాఖలోను విద్యా సంస్థల ప్రవేశాల్లో ఉపయోగిస్తారు.
NCERT వారు గణిత శాస్త్ర విభాగాల్లో అనేక భాషల్లో సహజ సామర్థ్య పరీక్షలను రూపొందించారు.
2. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు: - మనిషి జీవనానికి అవసరమయ్యే వాటిని సమకూర్చుకోవడానికి ఎన్నో పనులను చేయాల్సి ఉంటుంది.
- ఆయా పనులను చేపట్టడానికి వృత్తి సంబంధ సహజ సామర్థ్యాల పరీక్షలు నిర్వహించి వారిలో గల నైపుణ్యాన్ని గుర్తిస్తారు.
- ముఖ్యమైన వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు
ఎ) యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు
బి) గుమస్తా సహజ సామర్థ్య పరీక్షలు
సి) టీచింగ్ ఆప్టిట్యూట్ టెస్ట్
డి) Flying Aptitude test
ఎ. యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు - వివిధ లక్షణాల సమన్వయం ద్వారా యాంత్రిక సంబంధమైన పనులను చేయాల్సి ఉంటుంది.
- యాంత్రిక సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి కింది పరీక్షలు నిర్వహిస్తారు.
1. అంగుళ నైపుణ్య పరీక్ష (Finger Dexterity Test)
2. శ్రవణ నైపుణ్య పరీక్ష (Tweeter Dexterity Test)
3. మిన్నిపోటా మానిప్యులేషన్ టెస్ట్
4. స్టెన్క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష
బి. గుమస్తా సహజ సామర్థ్య పరీక్ష - ఇందులో అక్షరాల పూరణం, భాషా దోషాలను సరిదిద్దడం, పోల్చడం, వివేచనా సామర్థ్యానికి సంబంధించిన అంశాలు, సాధారణ గణిత సమస్యల సాధనపై ప్రశ్నలు ఉంటాయి.
ఉదా 1. మిన్నిపోటా క్లరికల్ టెస్ట్
2. జనరల్ క్లరికల్ టెస్ట్
3. సౌందర్య కళా సంబంధ సహజ
సామర్థ్యాలు: - సాహిత్యం, చిత్రలేఖపం, శిల్పం, నృత్యాలను లలిత కళలు అంటారు.
- వీటిని కింది విధంగా పరీక్షిస్తారు.
సాహిత్యం: వ్యక్తిలో ఉన్న పదధారాళత, శాబ్దిక సామార్థ్యాల ద్వారా.
సంగీతం : వ్యక్తిలో సర్వస్థాయి విచక్షణ, స్వరతీవ్రత విచక్షణ, కాల విచక్షణ, ధ్వనిరూప విచక్షణ, లయ నిర్ధారణ, స్వరస్మృతి ద్వారా (వీటిని పరీక్షించడానికి “సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్ పరీక్షను ఉపయోగిస్తారు)
చిత్రలేఖనం : మెయిర్ – సీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్‌ల ద్వారా పరీక్షిస్తారు.
సహజ సామర్థ్యాల మాపనం – ఉపయోగాలు
- సహజ సామర్థ్యాల గురించి, సహజ సామర్థ్యాల పరీక్షలు గురించి, ఉపాధ్యాయుడు తెలుసుకోడం వల్ల విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలను తెలుసుకునే వీలుటుంది – సహజ సామర్థ్య పరీక్షలు మార్గదర్శకత్వానికి వెన్నెముక లాంటిది.
- విద్యార్థి దశలోగాని, వృత్తి స్వీకరించే దశలో గాని, వారి సహజ సామర్థ్యాల ఆధారంగా మార్గదర్శకం చేస్తే ఆయా వృత్తుల్లో సఫలత సాధించగలరు.
- విద్యార్థుల సహజ సామర్థ్యాలు ఉపాధ్యాయులకు తెలిసి ఉంటే వారికి దాని పట్ల అభిరుచిని, వైఖరిని పెంపొందించవచ్చు.
- సహజ సామర్థ్యాల పరిజ్ఞానం విద్యార్థులకు కలిగించినైట్లెతే, వారు తమకు సహజ సామర్థ్యం లేని అంశాల్లో అసంతృప్తి, నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా చూడవచ్చు.
- వివిధ సహజ సామర్థ్యాలకు అనువైన కరికులం (విద్యా ప్రణాళిక)ను రూపొందించడం వల్ల విద్యార్థుల శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగించడానికి అవకాశం ఉంటుంది.
- సహజ సామార్థ్యాల పరిజ్ఞానం ఆయా సంస్థల యజమానులకు తెలిసి ఉండటం వల్ల తాము ఇచ్చే శిక్షణకు అనువైన విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి సమయం, డబ్బు వృథా కాకుండా కాపాడుకోవచ్చు.
- రాబోయే కాలంలో వ్యక్తి భవిష్యత్తు సాఫల్యం ఏ వృత్తిలో ఉండో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.
- విద్యాపరమైన, వృత్తిపరమైన మార్గదర్శకత్వం ఇచ్చేందకు ఉపాధ్యాయుడికి సహజ సామర్థ్యాల పరిజ్ఞానం అవసరం.
సహజ సామర్థ్యాలు – పరిమితులు :
1. సప్రమాణత తక్కువుగా ఉండటం
2. నిర్వహణ వ్యవ ప్రయాసలతో కూడి ఉండటం
3. సుశిక్షితులైన వ్యక్తులు మాత్రమే పరీక్షలు నిర్వహించగలగడం.
4. కాలయాపనతో కూడి ఉండటం.
5. కొన్ని కొన్ని విషయాలకు, పరిస్థితులకు సంబంధించి వ్యక్తుల సహజ సామర్థ్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోలేం
ఉదా :
Aptitude for Selling.
సృజనాత్మకత
1. సృజనాత్మకత అర్థం , భావన, నిర్వచనాలు ఊహకు రూపాన్ని ఇవ్వడమే సృజనాత్మకత
కొత్తది సృష్టించడం, లేదా ముందు ఉన్నదానికి, ఊహకు అనుగుణంగా రూపాన్ని మార్చడమే సృజనాత్మకత
- సృజనాత్మకత అంటే (ఉత్పత్తి ప్రక్రియ+ఉపయోగం)
- నూతన అంశాలు/అసాధారణ అంశాలు/నూతన సంబంధాలను రాబట్టడం.
- సమస్యలకు కొత్త పరిష్కారాలను రాబట్టడం.
- కళాత్మక వస్తువులను, రూపాలను కనుక్కోవడం.
- ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్యా పరిష్కార లక్షణాల కలయికే సృజనాత్మకత – అసుబెల్
- ఒక కొత్త ఊహను కాని, వస్తువును కాని, ఉత్పత్తి చేసే ప్రక్రియే సృజనాత్మకత
– జె.పి.గిల్ఫర్డ్ - ఆలోచనల్లో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తీకరించడమే సృజనాత్మకత
– చాప్లిన్ - సంపూర్ణంగా/పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత
– స్టాగర్న్, కార్వొస్కి - సృజనాత్మకతపై విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తి జె.పి.గిల్ఫర్డ్
- ఆలోచన సృజనాత్మకతకు మూలమని గిల్ఫర్డ్ తెలిపారు.
- 1950లో సృజనాత్మకతను మరో విజ్ఞాన శాస్త్రం అంశంగా జె.పి.గిల్ఫర్డ్ ప్రస్తావించారు.
గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మకతలో సామర్థ్యాలు
1. సృజనాత్మకత/వాస్తవికత
2.సరళత్వం (సమ్యత)
3.ధారాళత 4. పునర్ నిర్వచనం
5. సమస్యల పట్ల సున్నితత్వం
సృజనాత్మకత మూలకాలు - పోర్టర్ ప్రకారం సృజనాత్మకత ఐదు మూలకాలను కలిగి ఉంటుంది.
1. ధారాళత : పుంఖాను పుంఖాలుగా ఆలోచనలు రావడం తద్వారా ఏదో ఒక నూతన ఆలోచన కలగడం
2. సమ్యత : తెలిసిన ఆలోచనలను మార్చుకోవడం లేదా రూపాంతరం చెందడం
3. వాస్తవికత: అసాధారణ ఆలోచలను ఉత్పత్తి చేయడం ద్వారా ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడం
4. అవగాహన : మన చుట్టూ ఉన్న విషయాల మధ్యగల సంబంధాలను గుర్తించి వాటికి అతీతంగా ఆలోచించడం.
5. ప్రేరణ : నూతన ఆలోచనలను ప్రేరేపించు అంతర్గత సామర్థ్యం
సృజనాత్మకత – లక్షణాలు - సృజనాత్మకత ఒక ఆలోచన
- ఒక విధానమే కాని ఉత్పత్తి కాదు
- చేతన ఆలోచనలు ఇమిడి ఉంటాయి.
- సృజనాత్మకతను వ్యక్తిగతంగా/ సామూహికంగా ఉద్దీపింపచేయవచ్చు.
- క్రమబద్ధం కావచ్చు లేదా కాకపోవచ్చు.
- మార్పునకు దోహదపడే నూతన ఆలోచనా సరళి.
- ఒకసారి జరిగి ఆగిపోయే ప్రక్రియ కాదు, ఒక నిరంతర ప్రక్రియ
- సృజనాత్మకతకు ఉన్నత స్థాయి ఆలోచన అవసరం.
- లక్షణాలు అనువంశికంగా రానవసరం లేదు.
- ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత స్థాయిలో ఉంటాయి.
- ప్రతిభావంతులు సృజనాత్మకత కలిగి ఉన్నవారు ప్రతిభావంతులు కావచ్చును.
శివపల్లి
సైకాలజీ ఫ్యాకల్టీ
టీఎస్, ఏపీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?