స్త్రీలలో గర్భస్రావం జరుగకుండా తోడ్పడే విటమిన్?
పోషణ
1. కింది వాటిలో పోషకాలకు సంబంధించి సరికానిది ఏది?
1) విటమిన్లు 2) పిండి పదార్థాలు
3) కొవ్వులు 4) ప్రొటీన్స్
2. పాలకు సంబంధించి సరైనది ఏది?
1) పాలలో ప్రొటీన్ – లాక్టోజ్
2) పాలలో ఆమ్లం – కెసిన్
3) పాలలో చక్కెర – రెనిన్
4) పాలలో మూలకాలు – Ca, Fe, K
3. కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. పాల దిగుబడిని పెంచే కార్యక్రమం – ఆపరేషన్ మిల్క్
బి. పాల ఉత్పత్తులు పెంచడానికి చేపట్టిన విప్లవం – వెండి విప్లవం
సి. పాల స్వచ్ఛత కొలిచే పరికరం – స్పిగ్మోమానోమీటర్
డి. పాలలో ఉండని విటమిన్ – సి
1) బి, సి 2) సి, డి
3) బి, డి 4) ఎ, బి, సి
4. కింది వాటిని జతపర్చండి.
1. ప్రపంచ ఆహార దినం ఎ. జూన్ 1
2. ప్రపంచ పాల దినోత్సవం బి. నవంబర్ 14
3. ప్రపంచ మధమేహ దినం సి. అక్టోబర్ 16
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-ఎ, 3-బి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
5. వర్గీస్ కురియన్‌కు సంబంధించి సరికానిది ఏది?
1) మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా
2) శ్వేత విప్లవ పితామడు
3) అమూల్ పాలపరిశ్రమ స్థాపన
4) లాక్టోమీటర్ను కనుగొన్నాడు
6. పిండి పదార్థాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. శక్తి జనకులు బి. శక్తి నిల్వలు
సి. దేహ నిర్మాణాలు డి. సూక్ష్మపోషకం
1) ఎ, బి 2) బి, సి 3) బి 4) ఎ
7. ఒక గ్రామ్ పిండి పదార్థం నుంచి ఎంత శక్తి విడుదలవుతుంది?
1) 4.3 K.Cal 2) 4300 Cal
3) 1 & 2 4) 6000 Cal
8. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) మోనోశాఖరైడ్ – సెల్యూలోజ్
2) డై శాఖరైడ్ – సుక్రోజ్
3) పాలి శాఖరైడ్ – గ్లెకోజన్
4) 1 & 2
9. కింది వాటిని జతపర్చండి.
1. గ్లూకోజ్ ఎ. పండ్లలోని చక్కెర
2. ఫ్రక్టోజ్ బి. జంతువుల స్టార్చ్
3. గ్లెకోజన్ సి. చెరుకులోని చక్కెర
4. సుక్రోజ్ డి. రక్తంలోని చక్కెర
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
2) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
10. గ్లూకోజ్‌కు సంబంధించి సరికానిది ఏది?
1) క్షయకరణ చక్కెర 2) తక్షణ శక్తి చక్కెర
3) బార్లీ చక్కెర 4) సహజ పాలిమర్
11. కింది వాటిలో అతి తియ్యని చక్కెర ఏది?
1) ఫ్రక్టోజ్ 2) లాక్టోజ్
3) మాల్టోజ్ 4) సెల్యూలోజ్
12. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
ఎ. సెల్యూలోజ్ – సహజ పాలిమర్
బి. గ్లెకోజన్ – జంతువుల స్టార్చ్
సి. లాక్టోజ్ – డైశాఖరైడ్
డి. మాల్టోజ్ – పాలలోని చక్కెర
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
13. ఏక కణ ప్రొటీన్ల ఉత్పత్తికి ఉపయోగించే బ్యాక్టీరియా?
1) బ్రెవి పాక్టమ్ 2) స్పైరులీనా
3) శాఖరోమైసిస్ 4) క్లోరెల్లా
14. ఒక క్రీడాకారుడు పోటీల్లో పాల్గొనే ముందు తక్షణ శక్తి కోసం ఉపయోగించే చక్కెర?
1) ఫ్రక్టోజ్ 2) లాక్టోజ్
3) గ్లూకోజ్ 4) మాల్టోజ్
15. వంట గదిలో వివిధ రకాల తీపి పదార్థాల తయారీ కోసం ఉపయోగించే చక్కెర?
1) లాక్టోజ్ 2) ఫ్రక్టోజ్
3) గ్లూకోజ్ 4) మాల్టోజ్
16. ఒక వ్యక్తి వివిధ రకాల ఫలాలు లేదా బార్లీ గింజలను ఉపయోగించి సారాయి పరిశ్రమలో ఆల్కహాల్ తయారు చేయాలనుకున్నాడు. అందుకు అతడు ఉపయోగించే చక్కెర ఏది?
1) లాక్టోజ్ 2) గెలాక్టోజ్
3) సెల్యూలోజ్ 4) మాల్టోజ్
17. ప్రొటీన్లకు సంబంధించి సరికానిది ఏది?
1) ఒక రోజుకు దాదాపు 70-100 గ్రాములు అవసరం
2) ఒక గ్రామ్ ప్రొటీన్ నుంచి 5.3 నుంచి 5.6 కేలరీల శక్తి వస్తుంది
3) ప్రొటీన్లలో అతి ముఖ్య మూలకం – Zn
4) ప్రొటీన్లు శరీర నిర్మాణాలు
18. అప్పుడే పుట్టిన శిశువులో లోపించిన విటమిన్?
1) టోకోఫెరాల్ 2) పెల్లోక్వినైన్
3) థయామిన్ 4) కాల్సిఫెరాల్
19. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి.
వాక్యం-ఎ: సోయా చిక్కుడును పేదవాడి మాంసం అంటారు
వాక్యం-బి: పుట్టగొడుగులో ప్రొటీన్లు ఉండవు
1) ఎ సత్యం, బి అసత్యం
2) ఎ అసత్యం, బి సత్యం
3) ఎ సత్యం, బి సత్యం
4) ఎ అసత్యం, బి అసత్యం
20. కింది వాటిలో అమైనో ఆమ్లాలకు సంబంధించి సరైనది?
1) మొత్తం అమైనో ఆమ్లాలు – 35
2) బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రొటీన్స్
3) పెప్టెడ్ బంధాలు కలవు
4) ఆవశ్యక అమైనో ఆమ్లాలు-9
21. కింది వాటిలో ఆవశ్యక అమైనో ఆమ్లం కానిది?
1) లూసిన్ 2) మిథియోనైన్
3) గ్లెసిన్ 4) వెలైన్
22. కింది వాటిలో అనావశ్యక అమైనో ఆమ్లం ఏది?
1) ట్రిప్టోపాన్ 2) లైసిన్
3) హిస్టిడిన్ 4) టైరోసిన్
23. చిన్న పిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం, ఎంజైమ్‌లు వరుసగా..
1) హిస్టిడిన్, లాక్టేజ్ 2) హిస్టిడిన్, రెనిన్
3) రెనిన్, హిస్టిడిన్ 4) లాక్టేజ్, హిస్టిడిన్
24. కింది వాటిని జతపర్చండి.
1. గ్లోబిన్ ఎ. మృదులాస్థి
2. కాండ్రిన్ బి. రక్తం
3. మయోసిన్ సి. పట్టు
4. సిరిసిన్ డి. కండరాలు
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
25. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) ఎముకలు – అస్సిన్
2) గోధుమలు – గ్లుటనిన్
3) జలగ లాలాజలం – హిరుడిన్
4) అల్బుమిన్ – పాలు
26. కొవ్వులకు సంబంధించి సరికానిది?
1) శక్తి నిల్వలు
2) ఒక రోజుకు 50 గ్రాములు అవసరం
3) ఒక గ్రామ్ కొవ్వు నుంచి 4.63 కిలో కేలరీల శక్తి ఉత్పత్తి
4) కొవ్వుల్లో ఉండే బంధాలు – ఎస్పర్ బంధాలు
27. కింది వాటిని జతపర్చండి.
1. లినోలెనిక్ ఆమ్లం ఎ. కొబ్బరి
2. అరాఖిడినిక్ ఆమ్లం బి. పత్తి
3. ఎసిటిక్ ఆమ్లం సి. వేరుశనగ
4. కాప్రిక్ ఆమ్లం డి. ద్రాక్ష రసం
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
28. 14 ఏండ్ల లోపు వయసున్న బాలబాలికలకు అతి ముఖ్యమైన పోషకాలు?
1) కార్బోహైడ్రేట్స్ 2) ప్రొటీన్లు
3) కొవ్వులు 4) విటమిన్లు
29. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
1) క్వాషియార్కర్ – ప్రొటీన్ లోపం
2) మెరాస్మస్ – ప్రొటీన్, కేలరీల లోపం
3) స్థూలకాయం – అధిక కొవ్వు నిల్వలు
4) పైవన్నీ
30. ధ్రువపు ఎలుగుబంట్లు, పెంగ్విన్ పక్షులు, డాల్ఫిన్లు వంటి జంతువుల్లో శరీరం కింద ఉండే కొవ్వు పొరను ఏమంటారు?
1) కొలెస్ట్రాల్ 2) బ్లబర్
3) స్టిరాయిడ్ 4) స్టియరిక్ పొర
31. విటమిన్లకు సంబంధించి సరికానిది ఏది?
1) విటమిన్లను కనుగొన్నది – ఐజాక్ మాన్
2) విటమిన్ పేరు – ఫంక్
3) సూక్ష్మ పోషకాలు
4) విటమిన్ల అధ్యయనం – విటమినాలజీ
32. విటమిన్-ఎ అధికంగా ఉన్న పత్రాలు,
దుంప, ఫలం వరుసగా..
1) బచ్చలి, బీట్రూట్, మామిడి
2) తోటకూర, ముల్లంగి, జామ
3) బచ్చలి, క్యారెట్, బొప్పాయి
4) పాలకూర, బంగాళదుంప, మామిడి
33. విటమిన్-ఎ కు సంబంధించి సరికానిది?
1) రసాయనిక నామం – రెటినాల్
2) సాధారణ నామం – యాంటీ స్టెరిలిటీ విటమిన్
3) కొవ్వుల్లో కరిగే విటమిన్
4) కనుగొన్నది – మెక్కల్లమ్
34. కింది వాక్యాలను పరిశీలించి, సరైనది ఏదో గుర్తించండి.
వాక్యం-ఎ: విటమిన్-ఎ కంటిచూపునకు సంబంధించినది
వాక్యం-బి: NIN వారు విటమిన్-ఎ ను అందిస్తారు
1) ఎ సత్యం, బి సత్యం
2) ఎ అసత్యం, బి అసత్యం
3) ఎ సత్యం, బి అసత్యం
4) ఎ అసత్యం, బి సత్యం
35. విటమిన్-A మొక్కలు, ఆహార పదార్థాల్లో బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత ఎక్కడ విటమిన్-ఎ గా మారుతుంది?
1) కండరాల్లో 2) కాలేయం, పేగుల్లో
3) క్లోమం 4) ప్లీహం
36. కింది వాక్యాలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి.
వాక్యం-ఎ: విటమిన్-డి వృక్ష సంబంధ పదార్థాల్లో లభించదు
వాక్యం-ఎ: ఎముకల పెరుగుదలకు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది
1) ఎ సత్యం, బి అసత్యం
2) ఎ సత్యం, బి సత్యం
3) ఎ అసత్యం, బి అసత్యం
4) ఎ అసత్యం, బి సత్యం
37. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. చురుకైన శుక్ర కణాలు, అండాల ఉత్పత్తికి ఇ-విటమిన్ అవసరం
బి. బి విటమిన్ లోపంవల్ల డయేరియా వ్యాధి కలుగుతుంది
సి. బి12 విటమిన్‌ను చిన్న పేగులోని బ్యాక్టీరియా సంశ్లేషణ చేస్తుంది
డి. ఫోలిక్ ఆమ్లాన్ని H విటమిన్ అంటారు
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
38. కింది వాటిని జతపర్చండి.
1. విటమిన్-బి ఎ. పెల్లాగ్ర
2. విటమిన్-బి2 బి. ఎనీమియా
3. విటమిన్-బి3 సి. థయామిన్
4. విటమిన్-బి6 డి. గ్లాసైటిస్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
39. విటమిన్-సి కి సంబంధించి సరైనది ఏది?
ఎ. స్కర్వీ బి. సిట్రస్ జాతి ఫలాలు
సి. పాలలో ఉండదు
డి. రసాయన నామం – ఫోలిక్ ఆమ్లం
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
40. అతినీలలోహిత కిరణాల సమక్షంలో క్షీరదాల చర్మం కింద ఉన్న కొలెస్ట్రాల్ ఏ విటమిన్‌ను తయారు చేస్తుంది?
1) విటమిన్-సి 2) విటమిన్-డి
3) విటమిన్-కె 4) విటమిన్-ఇ
41. పాలిష్ చేయబడిన బియ్యం ఎక్కువగా వినియోగిస్తే లోపించే విటమిన్ ఏది?
1) విటమిన్-బి1 2) విటమిన్-కె
3) విటమిన్-ఇ 4) విటమిన్-ఎ
42. గోర్లలో, కొమ్ముల్లో, వెంట్రుకల్లో ఉండే ప్రొటీన్ ఏది?
1) కేసిన్ 2) కెరాటిన్
3) అల్బుమిన్ 4) అస్సిన్
43. సముద్రపు కలుపు మొక్కల నుంచి లభించే మూలకం?
1) గంధకం 2) కాల్షియం
3) జింక్ 4) అయోడిన్
44. కింది వాటిలో సరికానిది ఏది?
1) మానవ శరీరానికి అవసరమయ్యే మూలకాలు-54
2) మానవ శరీరంలో అతి ఎక్కువగా ఉండే లోహ మూలకం – Mn
3) శరీర బరువులో ఖనిజ లవణాల శాతం – 4 శాతం
4) రక్తంలో ఉండే మూలకం – Fe
45. కింది వాటిని జతపర్చండి.
1. గాయిటర్ ఎ. ఐరన్
2. రక్తహీనత బి. కాల్షియం
3. ఆస్టియో మలేషియా సి. అయోడిన్
4. డీహైడ్రేషన్ డి. క్లోరిన్
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
46. కింది వాక్యాలను పరిశీలించి సరైనది ఏదో గుర్తించండి.
వాక్యం-ఎ: కణాంతర భాగాల్లో ఎక్కువగా ఉండే కాటయాన్ – K+
వాక్యం-బి: కణబాహ్య ద్రవాల్లో ఎక్కువగా ఉండే కాటయాన్ – Na+
1) ఎ సత్యం, బి అసత్యం
2) ఎ సత్యం, బి సత్యం
3) ఎ అసత్యం, బి అసత్యం
4) ఎ అసత్యం, బి సత్యం
47. స్త్రీలలో గర్భస్రావం జరుగకుండా తోడ్పడే విటమిన్?
1) విటమిన్-కె 2) విటమిన్-సి
3) విటమిన్-ఇ 4) విటమిన్-ఎ
1.1 2.4 3.4 4.2 5.4 6.4 7.3 8.1 9.1 10.3 11.1 12.4 13.1 14.3 15.2 16.4 17.3 18.2 19.1 20.1
21.3 22.4 23.2 24.1 25.4 26.3 27.3 28.2 29.4 30.2 31.1 32.3 33.2 34.1 35.2 36.2
37.4 38.3 39.4 40.2 41.1 42.2 43.4 44.2 45.1 46.2 47.3
శ్రీకాంత్
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు