రాతపత్రంతో రాజ్‌భవన్‌కు..
భారత రాజ్యాంగంలోని VI వ భాగంలో ఆర్టికల్ 152 నుంచి 237 వరకు రాష్ట్రప్రభుత్వం (గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, రాష్ట్రశాసన సభ) గురించి పేర్కొనబడింది. ఆర్టికల్ 152 నుంచి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి ఉంది. ఆర్టికల్ 166-67 ప్రభుత్వ కార్యకలాపాల నిర్వాహణను తెలుపుతుంది. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థలో గవర్నర్ (153-162), ముఖ్యమంత్రి, మంత్రి మండలి (163-164), అడ్వకేట్ జనరల్ 165లో భాగంగా ఉంటారు.
రాష్ట్ర గవర్నర్ (Governor) :
కేంద్రంలోను, రాష్ట్రంలోనూ పరిపాలన పార్లమెంటరీ పద్ధతిలో ఉంటుంది. రాష్ట్ర పరిపాలన కేంద్ర పరిపాలనను పోలి ఉంటుంది. కేంద్రంలో రాష్ట్రపతి లాగా రాష్ట్రంలో రాజ్యాంగ రీత్యా గవర్నర్ కార్యనిర్వహణ అధిపతి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఇతని పేరుమీదనే జరుగుతాయి. గవర్నర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటాడు.
నియామకం
# గవర్నర్‌ను నియమించే పద్ధతిని కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
# 155 వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రపతి తన అధికార ముద్ర ‘వారెంట్’ (రాతపత్రం) ద్వారా నియమిస్తాడు. గవర్నర్లను నియమించే అధికారం, హక్కు, స్వేచ్ఛ ఈ ఆర్టికల్ ద్వారా కేంద్రప్రభుత్వానికి వర్తిస్తుంది.
అర్హతలు
# ఆర్టికల్ 157 ప్రకారం గవర్నర్‌గా నియమించే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి.
# 35 సంవత్సరాలు నిండినవాడై ఉండాలి. అయితే గరిష్ఠ వయోపరిమితి లేదు.
# ఎలాంటి నేరారోపణలు రుజువై ఉండకూడదు.
# ఇతర ఆదాయం వచ్చే లాభదాయక ఉద్యోగం చేయకూడదు. వ్యాపారం చేయరాదు.
# న్యాయస్థానంలో దివాళాకోరుగా ప్రకటించబడి ఉండకూడదు
ప్రమాణ స్వీకారం
# ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్ లేదా గవర్నర్ విధులను నిర్వర్తించే వ్యక్తి తన అధికార బాధ్యతలను స్వీకరించే ముందు, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రధాన న్యాయమూర్తి లేకపోతే సీనియర్ న్యాయమూర్తి ఎదుట ప్రమాణ స్వీకారం చేయాలి.
జీతభత్యాలు
ఆర్టికల్ 158 (3) ప్రకారం గవర్నర్‌కు ఒక ఉచిత అధికార నివాసం ఇస్తారు. గవర్నర్ల జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను పార్లమెంటు ఒక శాసనం ద్వారా నిర్ణయిస్తుంది. పార్లమెంటు శాసనం చేసేవరకు 2వ షెడ్యూల్లోని ఉన్న విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒక వ్యక్తి రెండు లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించినప్పుడు జీతభత్యాలను ఆయా రాష్ట్రాలు కలిసి చెల్లించాలి. అయితే ఆ జీతభత్యాలను ఏ నిష్పత్తిలో చెల్లించాలో రాష్ట్రపతి నిర్దేశిస్తాడు. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ (1956) ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
# గవర్నర్ నెల వేతనం రూ.3,50,000 (2016 నుంచి) దీన్ని రాష్ట్ర సంఘటిత నిధి (Consolidated Fund) నుంచి చెల్లిస్తారు. గవర్నర్ నివాస స్థలాన్ని రాజ్‌భవన్ అంటారు.
పదవీ కాలం
# ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్ల కాలపరిమితి 5 సంవత్సరాలు కానీ వాస్తవంగా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలం మాత్రమే పదవిలో ఉంటారు.
ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నరసింహన్ 10 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. భారత్‌లో అత్యధిక పదవీకాలం గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా నరసింహన్ రికార్డు సాధించారు (12 సంవత్సరాలు). 2007 నుంచి 2009 వరకు ఛత్తీస్‌గఢ్, 2009-2019 వరకు ఉమ్మడి ఏపీ, తెలంగాణ గవర్నర్‌గా పనిచేశారు.
# 156(2) ప్రకారం తనకు తానుగా గవర్నర్ తన పదవికి రాజీనామా చేయవచ్చు. ఆ రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించాలి.
అధికారాలు
# కార్యనిర్వాహక అధికారాలు
# శాసన అధికారాలు
# న్యాయాధికారాలు
# ఆర్థికాధికారాలు
# విచక్షణాధికారాలు
# ఇతర అధికారాలు
నోట్: గవర్నర్‌కు రాష్ట్రపతికి ఉన్నటువంటి దౌత్య, మిలిటరీ అధికారలు ఉండవు.
గవర్నర్ తొలగింపు
# కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా గవర్నర్లు మారుతూ ఉన్నారు.
# ఆర్టికల్ 156 (1) ప్రకారం గవర్నర్ పదవికి భద్రత లేదు. ఈ పదవి కాలపరిమితి పూర్తిగా రాష్ట్రపతి ఆమోద్య యోగ్యతపై (Validity of the Order) )ఆధారపడి ఉంది.
నోట్: గవర్నర్లపై అవిశ్వాస తీర్మానం (No Confidence Motion), అభిశంసన తీర్మానం (Censure Motion) పెట్టడానికి అవకాశం లేదు.
# 1892లో సుప్రీంకోర్టు సూర్యనారాయణ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఆమోదయోగ్యత అనేది న్యాయస్థానాల్లో సవాల్ చేయరానిది.
2. రాజ్యాంగంలో గవర్నర్‌ను తొలగించేందుకు ఎలాంటి నిబంధనలు, కారణాలు గాని పేర్కొనలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం రాష్ట్రపతి ద్వారా గవర్నర్లను తొలగిస్తుంది.
ఉదా: 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం 17 రాష్ట్రాల గవర్నర్లను తొలగించింది.
# 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం 14 రాష్ట్రాల్లో గవర్నర్లను ఒకేసారి తొలగించింది.
# 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం 13 మంది గవర్నర్లను తొలగించింది.
# 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 12 మంది గవర్నర్లను తొలగించింది.
ఉమ్మడి ఏపీ గవర్నర్లు
పేరు కాలం
చందూలాల్ మాధవ త్రివేది 1953-57
భీమ్సేన్ సచార్ 1957-62
ఎస్ఎమ్ శ్రీగణేష్ 1962-64
పీఏ థాను పిళ్లె 1964-68
ఖండూభాయ్ కసాంజి దేశాయ్ 1968-75
జస్టిస్ ఎస్ ఓబుల్ రెడ్డి 1975-76
మోహన్‌లాల్ సుఖాడియా 1946-76
ఆర్బీ భండారి 1976-77
బీజే దివాన్ 1977-78
శారదా ముఖర్జీ 1977-78
కేసీ అబ్రహం 1978-83
ఠాకూర్ రామ్‌లాల్ 1983-84
శంకర్ దయాళ్‌శర్మ 1984-85
కుముద్‌బెన్ జోషి 1985-90
కృష్ణకాంత్ 1990-97
గోపాల రామానుజన్ 1997-97
సి. రంగరాజన్ 1997-2003
సుర్జీత్ సింగ్ బర్నాలా 2003-04
సుశీల్ కుమార్ షిండే 2004-06
రామేశ్వర్ ఠాకూర్ 2006-07
ఎన్డీ తివారీ 2007-09
ఈఎస్ఎల్ నరసింహన్ 2009-19
తెలంగాణ
ఈఎస్ఎల్ నరసింహన్ 2009-19
తమిళిసైసౌందరరాజన్ 2019 నుంచి… ప్రస్తుతం
ప్రాక్టీస్ బిట్స్
1. గవర్నర్‌ను నియమించే పద్ధతిని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
1) బ్రిటన్ 2) కెనడా
3) ఆస్ట్రేలియా 4) రష్యా
2. ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రపతి రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తాడు?
1) ఆర్టికల్ 155 2) ఆర్టికల్ 154
3) ఆర్టికల్ 159 4) ఏదీకాదు
3. రాష్ట్ర గవర్నర్‌కు సంబంధించి కింది వాటిలో సరైనది?
1) గవర్నర్ నామమాత్ర కార్యనిర్వహణాధికారి
2) రాష్ట్రపతి ఇష్టం ఉన్నంతవరకే గవర్నర్ పదవిలో ఉంటాడు
3) గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు
4) పైవన్నీ
4. గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరైనది?
1) జీతభత్యాల భద్రత
2) గవర్నర్ వేతనాన్ని శాసనసభ నిర్ణయించదు
3) గవర్నర్‌ను బదిలీ చేయవచ్చు
4) పైవన్నీ
5. ఆర్డినెన్స్ జారీచేసే విషయంలో గవర్నర్ దేన్ని పాటిస్తాడు?
1) క్యాబినెట్ సలహా ప్రకారం ఆర్డినెన్సు జారీ చేస్తాడు
2) గవర్నర్ ఆర్డినెన్స్ జారీని నిలిపి ఉంచవచ్చు
3) శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్సును జారీచేస్తారు 4) పైవన్నీ
6. గవర్నర్ ఆమోదం కోసం బిల్లును పంపినప్పుడు?
1) ఆమోదముద్ర వేయవచ్చు, నిలిపి ఉంచవచ్చు
2) రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును రిజర్వ్ చేయవచ్చు
3) పునఃపరిశీలనకు పంపవచ్చు
4) పైవన్నీ
7. ద్రవ్యబిల్లులను ప్రవేశపెట్టేందుకు ఎవరి సిఫారసు అవసరం ఉంటుంది?
1) ముఖ్యమంత్రి 2) స్పీకర్
3) గవర్నర్
4) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
8. గవర్నర్ పదవికి కనీస వయస్సు ఎంత?
1) 21 ఏండ్లు 2) 25 ఏండ్లు
3) 35 ఏండ్లు 4) 40 ఏండ్లు
9. గవర్నర్ పదవికి గరిష్ఠ వయస్సు ఎంత?
1) 60 ఏండ్లు
2) గరిష్ఠ వయసు పరిమితి లేదు
3) 62 ఏండ్లు 4) 68 ఏండ్లు
10. ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్‌కు ఉచిత అధికార నివాసం కల్పిస్తారు?
1) 158 ( 3) 2) 162 (2)
3) 158 (బి) 4) 162 (4)
11. గవర్నర్ దేని ప్రకారం విధానసభకు ఒక ఆంగ్లోఇండియన్ని నామినేట్ చేస్తాడు?
1) ఆర్టికల్ 328 2) ఆర్టికల్ 333
3) ఆర్టికల్ 254 4) ఏదీకాదు
12. రాష్ట్రమంత్రి మండలిలో మంత్రులకు స్థాయి హోదాలను కేటాయించేది ఎవరు?
1) తన ఇష్టానుసారంగా గవర్నర్
2) సభ్యుల సూచనలతో గవర్నర్
3) ముఖ్యమంత్రి
4) మంత్రులతో సంప్రదించి గవర్నర్
13. రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలి?
1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి
3) రాష్ట్రపతి 4) డిప్యూటీ స్పీకర్
14. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల గవర్నర్లను తొలగించింది?
1) 22 2) 23 3) 17 4) 16
15. సరైన కారణం లేకుండా గవర్నర్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొంది?
1) బీపీ సింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
2) ఎస్ఆర్ బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా
3) జగదాంబికాపాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
4) మధ్యప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్
16. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రశాసన సభలో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు రద్దు చేశారు. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 25 జనవరి 2020
2) 30 జనవరి 2020
3) 2 ఫిబ్రవరి 2021
4) 5 మార్చి 2021
17. గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించిన సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు హేతుబద్దమైన కారణాలు లేకపోతే మాత్రమే న్యాయసమీక్ష చేయాలని, ఉంటే చేయరాదని సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పులో తెలిపింది?
1) మొహిందర్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్
2) స్టేట్ ఆఫ్ గుజరాత్ Vs ఆర్ఎ మెహత కేసు
3) జగదాంబికాపాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
4) ఎస్ఆర్ బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా
18. ఒక వ్యక్తిని ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించినప్పుడు వేతనం ఎవరు చెల్లిస్తారు?
1) మొదటగా నియమించిన రాష్ట్రం
2) ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలు
3) కేంద్ర ప్రభుత్వం
4) ఎవ్వరూ కాదు
1-2, 2-1, 3-4, 4-4, 5-4, 6-4, 7-3 , 8-3, 9-2, 10-1, 11-2, 12-3, 13-4, 14-3, 15-1, 16-1,
17-1, 18-2,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?