అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు
అచ్చంపేట: 1962లో ఏర్పడింది. తొలి ఎమ్మెల్యేగా కే నాగయ్య గెలిచారు. ఈ నియోజకవర్గంలో పుట్టపావ్ మహేంద్రనాథ్ 4 సార్లు పోటీచేసి విజయం సాధించారు. ఆయన పీవీ, జలగం, ఎన్టీఆర్ క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. పీ రాములు చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు.
నాగర్‌కర్నూల్: 1952లో ఏర్పడింది. 1952, 1957 ఎన్నికల్లో ఇది ద్విసభ్య నియోజక వర్గం. మహబూబ్‌నగర్ జిల్లాలో అందరికంటే ఎక్కువసార్లు గెలిచిన ఘనత మహేంద్రనాథ్ది. తర్వాత నాగం జనార్దన్‌రెడ్డి 4 సార్లు, వీఎస్ గౌడ్ 3 సార్లు గెలిచారు. 1994, 99లలో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. తొలి ఎన్నికల్లో ద్విసభ్యులుగా బ్రహ్మారెడ్డి, రామస్వామి గెలుపొందారు.
కల్వకుర్తి: 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. ఎస్ జైపాల్‌రెడ్డి నాలుగు సార్లు ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. ప్రథమ ఎన్నికల్లో ద్విసభ్యులుగా ఎంఎన్ రావు, కేఆర్ వీరాస్వామి గెలిచారు. ఎన్టీఆర్ 1989లో సీఎం హోదాలో ఓడిపోయారు. జే చిత్తరంజన్‌దాస్ గెలిచి మర్రిచెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
షాద్‌నగర్: 1952లో ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు తొలి ఎమ్మెల్యే. పీ శంకర్రావు ఇక్కడి నుంచి నాలుగుసార్లు (1983, 89, 99, 2004) గెలిచారు. 1993లో కోట్ల మంత్రివర్గంలో పనిచేశారు.
జడ్చర్ల: 1952లో ఏర్పడింది. 1996 ఉప ఎన్నికలతో సహా 11 సార్లు ఎన్నికలు (2008 వరకు) జరిగాయి. ప్రథమ ఎన్నికల్లో కేజే రెడ్డిపై కేశవులు గెలిచారు.
మహబూబ్‌నగర్: 1952లో ఏర్పడింది. 2008 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఎస్ రావుపై పీ హన్మంతరావు గెలిచారు. ఇక్కడి నుంచి ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. ఇబ్రహీం అలీ అన్సారీ.. కాసు, పీవీ, జలగం మంత్రివర్గాల్లో పనిచేయగా.. పీ చంద్రశేఖర్ 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో, పులి వీరన్న 1993లో కోట్ల మంత్రివర్గంలో పనిచేశారు.
వనపర్తి: 1952లో ఏర్పడింది. సురవరం ప్రతాపరెడ్డి తొలి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. 1994లో గెలిచిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేశారు.
కొల్లాపూర్: 1952లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో శాంతాబాయిపై రామచంద్రారెడ్డి గెలుపొందారు. కొత్తా వెంకటేశ్వర్రావు మూడు సార్లు (1978, 83, 85), జూపల్లి కృష్ణారావు రెండు సార్లు (1999, 2004) గెలిచారు.
అలంపూర్: 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. తొలి ఎన్నికల్లో నాగన్న, పీపీ రెడ్డి గెలిచారు. ఇక్కడి నుంచి రావుల రవీంద్రనాథ్ రెడ్డి మూడు సార్లు (1985, 89, 99), టీ చంద్రశేఖర్‌రెడ్డి రెండు సార్లు (1967, 72) గెలుపొందారు. 2004లో చల్లా వెంకట్రామిరెడ్డి (నీలం సంజీవరెడ్డి మనుమడు) గెలిచారు.
గద్వాల: 1957లో ఏర్పడింది. డీకే సమరసింహారెడ్డి మూడు సార్లు (1980, 83, 89) గెలిచారు. ఈయన చెన్నారెడ్డి, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాల్లో పనిచేశారు. 1957 ఎన్నికల్లో పీ పుల్లారెడ్డిపై డీకే సత్యారెడ్డి గెలుపొందారు.
అమరచింత: 1967లో ఏర్పడింది. అంతకుముందు ఆత్మకూరు నియోజవర్గంలో ఉండేది. 1967, 72లో ఎస్ భూపాల్ గెలిచారు.
మక్తల్: 1952లో ఏర్పడింది. 1952, 57లో ద్విసభ్య నియోజకవర్గం. బసప్ప రెండు సార్లు (1952, 57), కళ్యాణి రామచంద్రరావు మూడు సార్లు (1962, 67, 72), జీ నర్సింహులు నాయుడు రెండు సార్లు (1978, 83), చిట్టెం నర్సిరెడ్డి (1985, 89, 2004), వై ఎల్లారెడ్డి రెండు సార్లు (1994, 99) గెలుపొందారు.
కొడంగల్: 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. కే గురునాథరెడ్డి ఐదు సార్లు (1978, 1983, 89, 99, 2004), ఎన్.వెంకటయ్య మూడు సార్లు (1972, 85, 94), కే అచ్యుతరెడ్డి రెండు సార్లు (1957, 67) గెలిచారు. తొలి ఎన్నికల్లో వీరస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీ జాన్గోపాల్పై అనంతరెడ్డి గెలిచారు.
తాండూరు: 1952లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో సిద్దప్పపై జేకే ప్రాణేచ్ఛారి గెలిచారు. ఎం మాణిక్యరావు నాలుగు సార్లు (1969, 1972, 78, 83), 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి 1962, 67లో ఇక్కడ విజయం సాధించారు. ఎం చంద్రశేఖర్ రెండుసార్లు (1985, 89), పీ మహేందర్‌రెడ్డి రెండుసార్లు (1994, 99) గెలిచారు. చెన్నారెడ్డి నీలం, కాసు మంత్రివర్గాల్లో మంత్రిగానే కాకుండా, 1978లో, 1989లో సీఎంగా పనిచేశారు.
వికారాబాద్: 1952లో ఏర్పడింది. 1952, 57లో ద్విసభ్య నియోజకవర్గం. మర్రి చెన్నారెడ్డి 1952, 57లలో ఇక్కడి నుంచే గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లో మరో ఎమ్మెల్యేగా అరిగె రామస్వామి విజయం సాధించారు. అరిగె రామస్వామి కాసు మంత్రివర్గంలో పనిచేశారు. ఏ చంద్రశేఖర్ 5 సార్లు (1985, 89, 94, 99, 2004) గెలిచారు. చంద్రబాబు, వైఎస్సార్ క్యాబినెట్లలో పనిచేశారు.
పరిగి: 1952లో ఏర్పడింది. ప్రథమ ఎన్నికల్లో ఎస్జే బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమతం రామిరెడ్డి మూడు సార్లు (1967, 72, 89), అహ్మద్ షరీఫ్ రెండు సార్లు (1978, 83), కే హరీశ్వర్‌రెడ్డి నాలుగు సార్లు (1985, 94, 99, 2004) గెలిచారు. అహ్మద్ షరీఫ్ 1978లో మర్రి, అంజయ్య మంత్రివర్గాల్లో, కమతం రామిరెడ్డి.. జలగం, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాల్లో పనిచేశారు. హరీశ్వర్‌రెడ్డి 2001లో డిప్యూటీ స్పీకర్ అయ్యారు.
చేవెళ్ల: 1962లో ఏర్పడింది. ఎస్సీ రిజర్వ్డ్. తొలి ఎన్నికల్లో వీ రామారావు గెలిచారు. పీ ఇంద్రారెడ్డి నాలుగు సార్లు (1985, 89, 94, 99) గెలుపొందారు. పీ ఇంద్రారెడ్డి 1999లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన భార్య సబిత విజయం సాధించారు. 2004లో కూడా ఆమె గెలిచారు. పీ ఇంద్రారెడ్డి 1985, 1994లో ఎన్టీఆర్ క్యాబినెట్లో, సబిత 2004 నుంచి వైఎస్సార్ క్యాబినెట్లో పనిచేశారు.
ఇబ్రహీంపట్నం: 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. 1972 వరకు జనరల్ నియోజకవర్గం. 1978 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. తొలి ఎన్నికల్లో కేకే మానేపై ఎంబీ గీతం, బీఎస్ రావుపై పాపిరెడ్డి గెలిచారు. ఎంఎస్ లక్ష్మీనర్సయ్య మూడు సార్లు (1957, 62, 1967), ఏజీ కృష్ణ రెండు సార్లు (1981, 83), కొండిగారి రాములు రెండు సార్లు (1989, 1994) గెలిచారు. ఇద్దరు మహిళలు సుమిత్రాదేవి 1978లో, కొండ్రు పుష్పలీల 1999లో గెలిచారు. పుష్పలీల చంద్రబాబు క్యాబినెట్లో, ఎంఎస్ లక్ష్మీనర్సయ్య.. నీలం, కాసు మంత్రివర్గాల్లో పనిచేశారు.
మేడ్చల్: 1952లో ఏర్పడింది. 1957లో లేదు. మళ్లీ 1962 నుంచి కొనసాగింది. 1978లో ఇక్కడి నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యారు. 1967, 72లలో ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు సుమిత్రాదేవి గెలిచారు. ఆమె మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యే (జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఈస్ట్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి) అయ్యారు. టీ దేవేందర్‌గౌడ్ మూడు సార్లు (1994, 99, 2004) గెలిచారు.
సిద్దిపేట: 1952లో ఏర్పడింది. ఇక్కడి నుంచి కేసీఆర్ ఆరుసార్లు (1985, 89, 94, 99, 2004) గెలిచారు. 1999లో చంద్రబాబు క్యాబినెట్లో, ఆ తర్వాత కొంతకాలం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఈ నియోజకవర్గం నుంచి మొదటగా ఏ గురువారెడ్డి గెలిచారు. ఏ మదన్మోహన్ తెలంగాణ ప్రజా సమితి తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థిగా మూడుసార్లు (1970, 72, 78) గెలిచారు. ఈయన పీవీ, చెన్నారెడ్డి, అంజయ్య, భవనం, కోట్ల మంత్రివర్గాల్లో పనిచేశారు. ప్రథమ ఎన్నికల్లో ఓడిన పీవీ రాజేశ్వరరావు 1957లో గెలిచారు. 2004లో ఉప ఎన్నికలు జరుగగా టీ హరీష్‌రావు గెలిచారు.
దొమ్మాట: 1957లో ఏర్పడింది. అప్పుడు అనంతరెడ్డి గెలిచారు. ఇక్కడి నుంచి చెరుకు ముత్యంరెడ్డి మూడుసార్లు (1989, 94, 99) గెలిచారు. ఏ లింగయ్య రెండుసార్లు (1978, 83) గెలిచారు.
రాజగోపాల్ పేట: 1952లో నియోజకవర్గంగా ఉండేది. కేవీ నారాయణరెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఈయన కమలాపూర్ నుంచి గెలిచి కాసు బ్రహ్మానందారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.
గజ్వేల్: 1952లో ఏర్పడింది. పీ వాసుదేవ గెలిచారు. జీ సైదయ్య నాలుగుసార్లు (1962, 67, 72, 78) గెలిచారు. ఆర్ నర్సింహారెడ్డి 1957, 58లలో, జే గీతారెడ్డి 1989, 2004లలో, బీ సంజీవరావు 1985, 89లలో గెలిచారు. జే గీతారెడ్డి మర్రి, కోట్ల, వైఎస్ మంత్రివర్గాల్లో పనిచేశారు.
నర్సాపూర్: 1952లో ఏర్పడింది. సీహెచ్ విఠల్‌రెడ్డి ఇక్కడి నుంచి 11 సార్లు పోటీ చేసి ఐదుసార్లు (1962, 78, 85, 89, 94) గెలిచారు. సీ జగన్నాథరావు మూడుసార్లు (1967, 72, 83), సునీతా లకా్ష్మరెడ్డి రెండుసార్లు (1999, 2004) గెలిచారు. సీ జగన్నాథం అంజయ్య, కోట్ల, భవనం మంత్రివర్గాల్లో మంత్రిగా, డిస్యూటీ స్పీకర్‌గా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు.
సంగారెడ్డి: ఈ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. ఇక్కడ పీ రామచంద్రారెడ్డి ఐదుసార్లు (1962, 1972, 83, 85, 89) గెలిచారు. నరసింహారెడ్డి 1967, 78ల్లో గెలిచారు. రామచంద్రారెడ్డి 1989 ఎన్నికల తర్వాత శాసనభ స్పీకర్‌గా, ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్లో పనిచేశారు.
జహీరాబాద్: 1957లో ఏర్పడింది. ఎం బాగారెడ్డి ఐడుసార్లు వరుసగా 1957-85 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. మర్రిచెన్నారెడ్డి, టీ అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 1999, 2004ల్లో ఫరీదుద్దీన్ విజయం సాధించారు.
నారాయణఖేడ్: ఇది 1952లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో అప్పారావు షేట్కర్ విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన తర్వాత శివరామి షేట్కర్ మూడుసార్లు గెలిచారు. పీ కృష్ణారెడ్డి 1989, 99లలో విజయం సాధించారు.
మెదక్: ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తొలి, రెండో ఎన్నికల్లో వెంకటేశ్వరరావు గెలుపొందారు. కరణం రామచంద్రారావు ఐదుసార్లు (1972, 83, 85, 94, 99) విజయం సాధించారు. ఎన్టీ రామారావు తొలి మంత్రివర్గంలో, 1999లో చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 2002 ఉప ఎన్నికల్లో ఆయన భార్య ఉమాదేవి గెలిచారు.
రామాయంపేట: 1952లో ఏర్పడింది. 1957లో ఈ నియోజకవర్గాన్ని రద్దు చేశారు. 1962లో తిరిగి ఏర్పడింది. రెడ్డిగారి రత్తమ్మ రెండుసార్లు (1962, 67), ఏ విఠల్‌రెడ్డి రెండుసార్లు (1989, 99) గెలుపొందారు. టంగుటూరి అంజయ్య 1980లో ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పీవీ నరసింహారావు, జలగం వెంగల్రావు మంత్రివర్గాల్లో పనిచేశారు.
ఆందోలు: 1952లో ఏర్పడింది. ఇది ద్వి సభ్య నియోజకవర్గం. లక్ష్మణ కుమార్, వీఆర్ జోషిలు గెలుపొందారు. సీ రాజనరసింహ మూడుసార్లు (1967, 72, 78) విజయంసాధించారు. ఎం రాజయ్య 1985, 1994ల్లో, బాబూ మోహన్ మూడుసార్లు 1998, 1999, 2014లలో, సీ దామోదరం రాజనరసింహ (1989, 2004) రెండుసార్లు గెలుపొందారు. రాజనరసింహ కాసు బ్రహ్మానందారెడ్డి, పీవీ నరసింహారావు, అంజయ్య, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు.
బాల్కొండ: ఇది 1952లో ఏర్పడింది. మొదటి ఎన్నికల్లో అనంతరెడ్డి గెలుపొందారు. జీ రాజారామ్ నాలుగుసార్లు (1962, 67, 72, 78), జీ మధుసూదన్‌రెడ్డి 1983, 85లలో, కేఆర్ సురేష్‌రెడ్డి నాలుగుసార్లు (1989-2004) విజయం సాధించారు. సురేష్‌రెడ్డి స్పీకర్‌గా పనిచేశారు.
ఆర్మూర్: 1952లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో జీ రాజారామ్ విజయసాధించారు. తుమ్మల రంగారెడ్డి 1962, 67, 72 ఎన్నికల్లో విజయం సాధించారు. శనిగరం సంతోష్‌రెడ్డి నాలుగుసార్లు (1978, 83, 89, 2004), ఏ మహిపాల్‌రెడ్డి 1985లో గెలుపొందారు. 1991-94లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్లో సంతోష్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. మహిపాల్‌రెడ్డి ఎన్టీఆర్ కేబినెట్లో పనిచేశారు.
కామారెడ్డి: 1952లో ఏర్పడింది. మొదటి రెండు ఎన్నికల్లో ఇది ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. 1952, 62లో వీ వెంకట్రామిరెడ్డి గెలుపొందారు. 1957లో టీఎస్ సదాలక్ష్మి గెలుపొంది నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 2004లో షబ్బీర్ అలీ గెలుపొందారు.
ఎల్లారెడ్డి: 1962లో ఏర్పడింది. మొదటి ఎన్నికల్లో టీఎస్ సదాలక్ష్మి గెలుపొందారు. ప్రముఖ దళిత నాయకురాలు జే ఈశ్వరీబాయి 1967, 72లో గెలుపొందారు. 1978లో బాలా గౌడ్, 1984, 94, 99ల్లో నేరెళ్ల ఆంజనేయులు విజయంసాధించారు. ఆంజనేయులు ప్రభుత్వ విప్‌గా, చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
జుక్కల్: ఈ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో మాధవరావు, 1967, 72 ఎన్నికల్లో ఎస్.విఠల్‌రెడ్డి గెలుపొందారు. 1978, 83, 89, 2004లో జరిగిన ఎన్నికల్లో గంగారామ్ గెలుపొందారు.
బాన్సువాడ: 1952లో ఏర్పడింది. మొదటి ఎన్నికల్లో లక్ష్మీబాయి, 1957లో సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1994, 99లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.
బోధన్: 1952లో ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఎస్ఎల్ శాస్త్రి గెలుపొందారు. 1957లో శ్రీనివాసరావు, 1989, 94లో బషీరుద్దీన్ బాబూఖాన్, 1999, 2004లో సుదర్శన్‌రెడ్డి విజయం సాధించారు.
నిజామాబాద్: 1952లో ఏర్పడగా ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎండీ హుస్సేన్ (1957లో కూడా) విజయం సాధించారు. 1983, 85లో డీ సత్యనారాయణ విజయం సాధించారు. 1989, 99, 2004ల్లో డీ శ్రీనివాస్ గెలుపొందారు. ఆయన మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.
డిచ్పల్లి: 1952లో ఏర్పడింది. మొదటి ఎమ్మెల్యే శ్రీనివాసరావు. మండవ వెంకటేశ్వర్రావు 1985, 89, 94, 99లో గెలుపొందారు.
ముధోల్: 1957లో ఏర్పడింది. మొదటి, రెండో ఎన్నికల్లో గోపిడి గంగారెడ్డి విజయం సాధించారు. జీ గడ్డెన్న ఆరు సార్లు (1967, 72, 78, 83, 89, 99) గెలుపొందారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1994, 2004 ఎన్నికల్లో నారాయణరావు పటేల్ విజయం సాధించారు.
నిర్మల్: ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది ద్విసభ్య నియోజకవర్గం. 1962 నుంచి మూడు సార్లు పీ నర్సారెడ్డి (1962, 67, 72) విజయం సాధించారు. ఆయన పీవీ నరసింహారావు, జలగం వెంగల్రావ్ మంత్రివర్గంలో పనిచేశారు. 1983లో గెలుపొందిన భీం రెడ్డి ఉపసభాసతిగా పనిచేశారు. 1985, 89, 94లో ఎస్.వేణుగోపాలాచారి విజయం సాధించారు. ఆయన 1995లో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు.
ముషీరాబాద్: 1952లో ఏర్పడింది. కూలీగా జీవితం ప్రారంభించిన మాజీ సీఎం టంగుటూరి అంజయ్య మూడు సార్లు (1962, 67, 72) ఇక్కడి నుంచే గెలిచారు. నాయిని నరసింహారెడ్డి మూడు సార్లు (1978, 1985, 2004), ఎం కోదండరెడ్డి రెండు సార్లు (1989, 94) గెలిచారు. టీ అంజయ్య ముఖ్యమంత్రి కాకముందు పీవీ, జలగం మంత్రివర్గాల్లో పనిచేశారు.
హిమాయత్‌నగర్: 1978లో ఏర్పడింది. అంతకుముందు గగన్‌మహల్ నియోజకవర్గంలో ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి ఏ నరేంద్ర మూడుసార్లు గెలిచారు. 1989లో గెలిచిన వీ హన్మంతరావు చెన్నారెడ్డి కేబినెట్లో పనిచేశారు. 1994, 99లలో గెలిచిన పీ కృష్ణయాదవ్ చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 2003లో స్టాంపుల కుంభకోణం కేసులో అరెస్టయ్యారు.
సనత్‌నగర్: 1978లో ఏర్పడింది. మర్రి చెన్నారెడ్డి రెండుసార్లు సీఎం అయ్యింది ఈ నియోజకవర్గం నుంచే. ఆయన కుమారుడు మర్రి శశిధర్‌రెడ్డి మూడు సార్లు (1989, 94, 2004), శ్రీపతి రాజేశ్వర్ రెండు సార్లు (1985, 99) గెలిచారు. 1952, 57లలో ఇది ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. మర్రి శశిధర్‌రెడ్డి 1993లో కోట్ల మంత్రివర్గం, శ్రీపతి రాజేశ్వర్ 1985-89లో ఎన్టీఆర్ కేబినెట్లో పనిచేశారు. 1978లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఎస్ రాందాస్ ఎన్వీ భాస్కర్‌రావుపై గెలిచారు.
సికింద్రాబాద్: 1952లో ఏర్పడింది. ఇది ద్విసభ్య నియోజకవర్గం. జేబీ ముత్యాలరావు, వీబీ రాజు గెలిచారు. కే సత్యనారాయణ మూడుసార్లు (1957, 62, 67), ఎల్ నారాయణ రెండుసార్లు (1972, 78), శ్రీనివాసయాదవ్ రెండుసార్లు (1994, 99) గెలిచారు. ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1952లో వల్లూరి బసవరాజు గెలిచి కొంతకాలం తర్వాత రాజ్యసభ సభ్యులయ్యారు. ఆయన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందారెడ్డి క్యాబినెట్లలో పనిచేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ 1995, 2001లలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
ఖైరతాబాద్: 1967లో ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గాల్లో ఇది ఒకటి. బీవీ గురుమూర్తి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందారెడ్డి క్యాబినెట్లలో, పీ జనార్దన్‌రెడ్డి, అంజయ్య, భనవం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదుమల్లి జనార్దన్‌రెడ్డి క్యాబినెట్లలో పనిచేశారు. ఎం రామచంద్రరావు ఎన్టీఆర్, నాదెండ్ల కేబినెట్లలో, కే విజయరామారావు చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు.
సికింద్రాబాద్: 1957లో ఏర్పడింది. బీవీ గురుమూర్తి రెండుసార్లు (1957, 62), వీ అంకమ్మ రెండుసార్లు (1969, 72), జీ శాయన్న మూడుసార్లు (1994, 99, 2004) గెలిచారు. గురుమూర్తి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందారెడ్డి క్యాబినెట్లలో, ఎన్ఏ కృష్ణ 1984లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో, డీ నర్సింగరావు 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
మలక్‌పేట: 1952లో ఏర్పడింది. ఇంద్రసేనారెడ్డి మూడుసార్లు (1983, 89, 99), మీర్ అహ్మద్ అలీఖాన్ రెండుసార్లు (1957, 62), బీ సరోజినీపుల్లారెడ్డి రెండుసార్లు (1967, 72), మల్రెడ్డి రంగారెడ్డి రెండుసార్లు (1994, 2004), సరోజినీపుల్లారెడ్డి మర్రిచెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 1989లో గెలిచిన సుధీర్‌కుమార్ శివశంకర్ కుమారుడు (కేంద్రమంత్రి).
ఆసిఫ్‌నగర్: 1957లో ఏర్పడింది. ఎంఎం హషీం రెండుసార్లు (1962, 67) గెలిచారు. యూబీ రాజు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందారెడ్డి క్యాబినెట్లలో పనిచేశారు. హషీం 1978, 81లలో మర్రి చెన్నారెడ్డి, టీ అంజయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు.
మహరాజ్‌గంజ్: చిన్న నియోజకవర్గమైన ఇది 1967లో ఏర్పడింది. పీ రామస్వామి నాదెండ్ల మంత్రివర్గంలో పనిచేశారు.
కార్వాన్: 1952లో ఏర్పడింది. 1978 వరకు ఆ పేరు లేదు. 1978లో తిరిగి ఏర్పడింది. ప్రథమ ఎన్నికల్లో నరేంద్ర ఎంఏ ఖాన్‌పై గెలిచారు. బద్దం బాల్‌రెడ్డి మూడుసార్లు (1985, 89, 94) గెలిచారు. 1967, 72లలో సీతారాంబాగ్ నియోజకవర్గంలో ఉన్నది.
యాకుత్‌పుర: 1957లో ఏర్పడింది. 1989 వరకు ఎంఐఎం ఒకే పార్టీగా ఉండేది. 1994 నాటికి చీలిక వచ్చి మహ్మద్ అమానుల్లాఖాన్ నాయకత్వంలో మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) ఏర్పడింది. ఇబ్రహీంఖాన్ అబ్దుల్లా మస్కతి రెండుసార్లు (1985, 89) గెలిచారు. సలాఉద్దీన్ ఓవైసీ 1984 నుంచి 1999 వరకు 6 సార్లు హైదరాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచారు. మొదట షాబుద్దీన్ అహ్మద్‌ఖాన్ కే హసన్‌పై గెలిచారు. ముంతాజ్ అహ్మద్‌ఖాన్ మూడుసార్లు (1994, 99, 2004) గెలిచారు.
చాంద్రాయణగుట్ట: 1978లో ఏర్పడింది. 1978 నుంచి 1994 వరకు అమానుల్లాఖాన్ 5 సార్లు గెలిచారు. అక్బరుద్దీన్ ఓవైసీ రెండుసార్లు (1999, 2004) గెలిచారు.
చార్మినార్: 1967లో ఏర్పడింది. 1967, 78, 83లలో సలాఉద్దీన్ ఓవైసీ గెలిచారు. అసదొద్దీన్ ఓవైసీ రెండుసార్లు (94, 99) గెలిచారు.
బేగంబజార్: 1952లో కాశీనాథరావు వైద్య, 1957లో జేవీ నర్సింగరావు, 1962లో కే సీతయ్యగుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేవీ నర్సింగరావు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందారెడ్డి క్యాబినెట్లలో పనిచేశారు. 1969లో కాసు మంత్రివర్గంలో జేవీ నర్సింగరావు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
హైకోర్టు నియోజకవర్గం: 1957, 62లలో ఉండేది. 1957లో గోపాలరావు ఎక్బోటే, 1962లో బీ రాందేవ్ గెలిచారు.
సుల్తాన్‌బజార్: 1957, 62లలో నియోజకవర్గంగా ఉండేది. 1957, 62లో వాసుదేవ కృష్ణాజీ గెలిచారు.
చాదర్‌ఘాట్: 1952లో మాత్రమే ఉంది. గోపాలరావు ఎక్బోటే భన్వర్‌లాల్‌పై గెలిచారు.
పత్తర్‌ఘట్టి: 1957, 62లలో నియోజకవర్గంగా ఉండేది. 1957లో మాసుమాబేగం, 62లో ఎస్ సలాఉద్దీన్ ఓవైసీ గెలిచారు.
శాలిబండ: 1952లో మాసుమాబేగం గెలిచారు.
హైదరాబాద్: 1962లో సుమిత్రాదేవి ఆర్ చందర్‌పై గెలిచారు.
హైదరాబాద్ సిటీ: 1952లో సయ్యద్ హసన్ మీర్ మహ్మద్ అలీ ఖాన్‌పై గెలిచారు.
జూబ్లీహిల్స్: 1957, 60, 62లలో నియోజకవర్గంగా ఉంది. 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న ఇక్కడి నుంచి సుమిత్రాదేవి, ఎస్ మోహిద్ నవాబ్ జంగ్ గెలిచారు. 1960లో ఉప ఎన్నికలో, 62లో జరిగిన ఎన్నికల్లో రోడా హెచ్‌పీ మిస్త్రీ గెలిచారు.
సోమాజిగూడ: 1952లో కేవీ రంగారెడ్డి గెలిచారు. 1957లో (ద్విసభ్య) కేవీ రంగారెడ్డి, వీ రామారావు గెలిచారు. కేవీ రంగారెడ్డి నీలం సంజీవరెడ్డి క్యాబినెట్లో, 69లో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు