Indian Scientists- Services | భారత శాస్త్రవేత్తలు- సేవలు
సర్ సీవీ రామన్
-1888లో తమిళనాడులో జన్మించిన గొప్ప భాతిక శాస్త్రవేత్త
-1928లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశాడు
-1930లో రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు
-1954లో భారతరత్న అవార్డు వచ్చింది
శ్రీనివాస రామానుజన్
-గొప్ప గణిత శాస్త్రవేత్త
-తమిళనాడు ప్రభుత్వం ఇతని విజయాలకు గుర్తుగా ఇతని జన్మదినమైన డిసెంబర్ 22న రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది
-భారత ప్రభుత్వం 1962లో ఇతని 75వ జన్మదినం నాడు సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన కృషికి స్మారక తపాళబిళ్లను విడుదల చేసింది.
జగదీష్ చంద్రబోస్
-ఇతను ఒక జీవ , భౌతిక శాస్త్రవేత్త
-ఇతను మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం-క్రెస్కోగ్రాఫ్ కనుగొన్నాడు.
-ఇతను మైక్రోవేవ్ కమ్యూనికేషన్లో అధికంగా పరిశోధన చేశాడు.
-ఇతని ప్రధాన విద్యార్థులు- సత్యేంద్రనాథ్బోస్, మేఘనాథ్ సాహ
-ఇతని జ్ఞాపకార్థం చంద్రునిపై ఉండే ఒక అగ్నిపర్వత ముఖం (Crator)కు బోస్ అని పేరు పెట్టారు.
శాంతి స్వరూప్ భట్నాగర్
-భారత పరిశోధనశాలల పితామహుడు.
-Council of Scientific & Industrial Research (CSIR) మొదటి వ్యవస్థాపక డైరెక్టర్
-స్వాతంత్య్రం తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధలనకు పునాది వేశారు.
-ఈయన శాస్త్రీయ పరిశోధనలకు 1941లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ అను బిరుదును ప్రధానం చేసింది
-భారతప్రభుత్వం ఇతని జ్ఞాపకార్థం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం ప్రారంభించింది.
హోమీ జహింగీర్ బాబా (ముంబై)
-బారత అణుశక్తి పితామహుడు.
-ఇతను ప్రారంభించిన సంస్థలు. Tata Institute of Fundamental Research (TIFR), Trombay Atomic Energy (TAE)
-1955లో జెనీవా , స్విట్జర్లాండ్‌లో అణుశక్తి శాంతియుతమైన ఉపయోగాల మీద జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో అధ్యక్షుడిగా ఉన్నారు.
-ఈయన కృషి ద్వారా భారత్ 1974 మే 18న తొలి సారిగా అణ్వస్ర్తాన్ని విజయవంతంగా పరీక్షించింది.
-ఇతనికి ఆడమ్స్ ప్రైజ్ వచ్చింది.
వెంకటరామన్ రామకృష్ణన్
-ఇతను జీవ రసాయన శాస్త్రం, జీవ భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేశాడు.
-రైబోజోములు ఏ విధంగా ప్రొటీన్లను నిర్మిస్తాయి అనే అంశాన్ని వివరించినందుకు 2009లో నోబెల్ బహుమతి లభించింది.
-భారత ప్రభుత్వం 2010లో పద్మవిభూషణ్‌తో సత్కరించినది.
సీఎన్ఆర్ రావు (కర్ణాటక)
-ఇతని పూర్తి పేరు- చింతామణి నాగేశ రామచంద్రరావు, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త
-2004లో భారత ప్రభుత్వ నుంచి ఇండియన్ సైన్స్ అవార్డ్ పొందిన మొదటి వ్యక్తి.
-జవహర్లాల్ నెహ్రు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్‌ను స్థాపించాడు.
-సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ రంగాల్లో పరిశోధనలు చేశాడు.
-అవార్డులు-భారత రత్న (2013), శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైజ్ (1998)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?