– గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం, నీటిపారుదల సౌకర్యం, తాగునీటి సౌకర్యం, రహదారుల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, టెలిఫోన్ సౌకర్యాలను కల్పిస్తారు.
– ఇదే పథకం కింద కనీసం 1000 మంది జనాభా కలిగిన నివాస ప్రాంతాలన్నింటికీ రోడ్డు మార్గం కల్పిస్తారు.
సామాజిక అభివృద్ధి పథకం (CDP)
– గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధి కోసం సీడీపీని 1952లో ప్రారంభించారు.
– దేశాన్ని బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాకులో 100 గ్రామాల్లో దీన్ని అమలుచేశారు.
– వ్యవసాయం, పశుపోషణ, విద్య, మహిళలు, శిశు సంక్షేమం, సాంస్కృతిక అంశాలను సాధనాలుగా ఎంచుకున్నారు.
జాతీయ విస్తరణ సేవా పథకం (NESS)
– దీన్ని 1953లో ప్రారంభించారు. సీడీపీని మరింత విస్తరించి ఎన్ఈఎస్ఎస్గా అమలుచేశారు.
ప్రజా పనుల కార్యక్రమం
– దీన్ని 1971లో ప్రారంభించారు. రహదారులు, పాఠశాల, వైద్యశాలల భవనాల నిర్మాణం చేస్తూ వేతన ఉపాధి అందించడానికి ఆరంభించారు.
– కరువు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం (డీపీఏపీ)
– కరువు ప్రభావాన్ని తగ్గించడానికి 1973లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
– భూసార పరీక్ష, నీటివనరులు, ఇతర సహజ వనరుల పరిరక్షణ కోసం కార్యకలాపాలు చేపడుతారు.
– 1998-99 వరకు ఈ పథకం కింద అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ర్టాలు 50:50 నిష్పత్తిలో భరించగా, 1999-2000 నుంచి 75:25కు మారింది.
ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం (డీడీపీ)
– ఈ పథకాన్ని 1977లో ప్రారంభించారు.
– 1995 నుంచి 75:25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయాన్ని భరిస్తున్నాయి.
సమగ్ర వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమం (IWDP)
– ఈ పథకాన్ని 1989-90లో ప్రారంభించారు.
– డీపీఏపీ, డీడీపీ అమల్లో లేని ప్రాంతాల్లో 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఎంపీ ల్యాడ్స్
– మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం (ఎంపీ ల్యాడ్స్) ప్రారంభంలో పార్లమెంటు సభ్యునికి ప్రతి ఏడాది స్థానిక ప్రాంత అభివృద్ధికి రూ.కోటి ఇచ్చారు. తర్వాత దాన్ని రెండు కోట్లకు, ప్రస్తుతం రూ.5 కోట్లకు పెంచారు.
అన్నపూర్ణ పథకం
– దీన్ని 2000-01లో ప్రారంభించారు.
– ఈ పథకం కింద వృద్ధులకు 10 కిలోల ఆహార ధాన్యాలను ప్రతి నెల ఉచితంగా అందిస్తారు.
– వృద్ధాప్య పింఛను తీసుకోనివారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
అంత్యోదయ అన్న యోజన
– దీన్ని 2000-01లో ప్రారంభించారు.
– పేదరికంలో ఉన్న కుటుంబాలకు ప్రతి నెల 35 కిలోల బియ్యం లేదా గోధుమలు అందిస్తారు.
– బియ్యం కిలో రూ.3, గోధుమలు కిలో రూ. 2కు అందిస్తారు. ఈ పథకాన్ని అమలుచేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
– ఈ పథకాన్ని 2000లో ప్రారంభించారు.
– కనీసం 5000 జనాభా కలిగిన మైదాన ప్రాంతాల నివాస స్థలాలకు, కనీసం 250 జనాభా కలిగిన కొండ ప్రాంతాల నివాస స్థలాలకు ఈ పథకం కింద రహదారుల నిర్మాణం చేపడతారు.
– భారత్ నిర్మాణ్‌లో భాగంగా దీన్ని అమలుచేస్తున్నారు.
ప్రధానమంత్రి గ్రామోదయ యోజన
– ఈ పథకాన్ని 2000లో ప్రారంభించారు.
– గ్రామాల్లో కనీస సౌకర్యాలైన ప్రాథమిక విద్య, వైద్యం, నివాసం, రక్షిత నీరు, పౌష్టికాహారం, విద్యుత్ సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యం.
– దీన్ని భారత్ నిర్మాణలో భాగంగా అమలుచేస్తున్నారు.
పురా పథకం
– ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ (పురా) పథకాన్ని నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రకటించారు.
– పట్టణాలకు 10-15 కి.మీ.లోపు దూరంలో ఉన్న గ్రామా ల్లో పట్టణాల్లో ఉండేవిధంగా రహదారులు, విద్యుత్, నీటి సౌకర్యం, విద్య, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
జననీ సురక్ష యోజన
– ఈ పథకాన్ని 2011, జూన్ 1న హర్యానాలోని మేవట్ జిల్లా వినేరాలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు.
– గర్భిణులకు పూర్తిగా ఉచిత వైద్యసేవలు అందించడం దీని ప్రధాన లక్ష్యం.
రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై)
– కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం 2011 జూన్ 1న ఆర్‌ఏవై మొదటి దశకు ఆమోదం తెలిపింది.
– మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆవాస వసతులు, మౌలిక, పౌర-సామాజిక సేవలు అందించేందుకు, మురికి వాడలు అభివృద్ధి చేసేందుకు, ఆస్తి హక్కు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
20 అంశాల కార్యక్రమం
– ఈ పథకాన్ని 1975లో ప్రారంభించారు.
– 1982, 1986, 2006లో ఈ కార్యక్రమాన్ని పునర్ నిర్మించారు. దీనిలో అంశాలు…
1. పేదరిక నిర్మూలన
2. ప్రజలకే అధికారం
3. రైతులకు సహాయం
4. కార్మిక సంక్షేమం
5. ఆహార భద్రత
6. అందరికి నివాసం
7. అందరికి మంచినీరు
8. అందరికి వైద్యం
9. అందరికి విద్య
10. మహిళల సంక్షేమం
11. బాలల సంక్షేమం
12. యూత్ డెవలప్మెంట్
13. మురికివాడల్లోని ప్రజల అభివృద్ధి
14. సామాజిక భద్రత
15. గ్రామీణ రహదారులు
16. పర్యావరణ పరిరక్షణ, సామాజిక అడవుల పెంపకం
17. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం
18. గ్రామ ప్రాంతాల్లో శక్తి వనరులు
19. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
20. ఐటీ సహాయంతో ఈ-గవర్నెన్స్
ఆధార్
– సాంఘిక భద్రత కార్యక్రమంలో భాగంగా ఆధార్‌ను ప్రవేశపెట్టారు.
– యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను 2009 జూన్‌లో ఏర్పాటుచేశారు.
– దీని ద్వారా ప్రతి పౌరుడికి ఒక విశిష్ట సంఖ్యతో కూడిన గుర్తింపు కార్డును ఇస్తారు.
– ఈ విశిష్ట సంఖ్యగల గుర్తింపు కార్డుకి ఆధార్ అని పేరు పెట్టారు.
– మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని తెంబాలి అనే గ్రామంలో మొదటిసారిగా గ్రామస్తులందరికీ ఆధార్ కార్డును అందించి దాన్ని ఆధార్ గావ్గా పేర్కొన్నారు.
ప్రాక్టీస్ బిట్స్
1. పేదరిక నిర్మూలనకు సంబంధించి కిందివాటిలో సమగ్రమైన పథకం?
1) ఇందిరమ్మ
2) రాజీవ్ పల్లెబాట
3) ఇందిరాక్రాంతి
4) ఇందిరమ్మ మహిళా ఉపాధి
2. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. సురేష్ టెండూల్కర్
1. 29.5 శాతం
బి. రంగరాజన్
2. 21.9 శాతం
సి. మిన్వాస్
3. 41 శాతం
డి. దండేకర్ అండ్ రథ్
4. 37.1 శాతం
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
3. పేదరికానికి కారణమయ్యే అంశం?
ఎ. నిరుద్యోగం
బి. ఆదాయ అసమానతలు
సి. వెనుకబాటుతనం
డి. నిరక్షరాస్యత
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) పైవన్నీ
4. కిందివాటిలో స్వయం ఉపాధి పథకం కానిది?
1) డ్వాక్రా
2) టీఆర్‌వైఎస్ఈఎం
3) ఎస్ఐటీఆర్ఏ
4) ఎంజీఎన్ఆర్ఈజీపీ
5. పీఎం ఈజీపీ పథకంలో విలీనమైన పథకాలు?
1) పీఎంఆర్‌వై
2) ఎస్ఈపీయూపీ
3) ఆర్ఈజీపీ
4) పీఎంఆర్‌వై, ఆర్ఈజీపీ
6. పట్టణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి నిర్దేశించిన పథకం?
1) స్వర్ణ జయంతి షహరి రోజ్‌గార్ యోజన
2) జాతీయ సామాజిక సహాయ పథకం
3) నేషనల్ రెన్యువల్ ఫండ్
4) ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం
7. కిందివాటిలో సరికానిది.
ఎ. ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ ప్రకారం అత్యధిక పేదరికం గల రాష్ట్రం- ఛత్తీస్‌గఢ్
బి. దేశంలో అత్యధిక పేదరికంగల కేంద్రపాలిత ప్రాంతం- దాద్రా నగర్‌హవేలీ
సి. తక్కువ పేదరికం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం- అండమాన్ నికోబార్ దీవులు
డి. ఎన్ఎస్ఎస్ఓ 68 రౌండ్ ప్రకారం తక్కువ పేదరికంగల రాష్ట్రం- కేరళ
1) ఎ, డి
2) సి, డి
3) బి
4) డి
8. స్వచ్ఛంద నిరుద్యోగులకు ఉదాహరణ?
1) ధనవంతులు
2) అధిక విద్యావంతులు
3) బిచ్చగాళ్లు
4) పైఅందరూ
9. కిందివాటిని జతపర్చండి.
ఎ. పీ-ఇండెక్స్
1. దండేకర్, రథ్
బి. పావర్టీ గ్యాప్ ఇండెక్స్
2. అమర్త్యసేన్
సి. హెచ్‌సీఆర్
3. గౌరవ్ దత్, మార్టిన్ రావోలియన్
డి. గినీ ఇండెక్స్
4. లారెంజ్
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-4, సి-3, డి-2
10. కిందివాటిలో భిన్నమైనది?
ఎ. వాంబే
బి. జేఎన్ఎన్యూఆర్ఎం
సి. జేఆర్‌వై
డి. ఎన్ఆర్‌వై
1) ఎ, బి
2) బి, సి
3) సి
4) డి
11. ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి ఫలాలు అన్నివర్గాలకు చేరి పేదరికం తగ్గుతుందని తెలిపే సిద్ధాంతం?
1) ట్రికిల్ డౌన్ సిద్ధాంతం
2) గినీ సూచిక
3) లారెంజ్ రేఖ
4) పీ-ఇండెక్స్
12. కిందివాటిలో తప్పుగా ఉన్న ప్రవచనం?
ఎ. దేశంలో మొదట పేదరికపు రేఖను కేలరీల రూపంలో లెక్కించినవారు- దండేకర్, రథ్
బి. కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు- ప్రపంచ బ్యాంకు
సి. కనీస అవసరాలతోపాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొందలేని పరిస్థితి పేదరికం- యూఎన్ఓ
డి. కనీస అవసరాలు కూడా లేనటువంటి పరిస్థితిని సాపేక్ష పేదరికం అంటారు.
1) సి, డి
2) ఎ, బి
3) డి
4) ఎ, సి
13. పేదరిక నిర్మూలనకు 20 సూత్రాల కార్యక్రమాన్ని ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
1) ఐదు
2) ఆరు
3) ఏడు
4) నాలుగు
14. ఐదు రకాల ఆహారేతర వస్తువులపై 365 రోజుల్లో, ఇతర వస్తువులపై 30 రోజుల్లో చేసే వినియోగ వ్యయాన్ని లెక్కించే పద్ధతి?
1) పేదరికపు వ్యత్యాసం
2) వ్యయాల మదింపు పద్ధతి
3) యూనిఫాం రీకాల్ పీరియడ్
4) మిక్స్డ్ రీకాల్ పీరియడ్