Telangana History | సూర్యాపేటలో అర్జున పుస్తక భాండాగారాన్ని స్థాపించిందెవరు?
గతవారం తరువాయి..
305. గణపతిదేవుడు యాదవుల బందీగా ఉన్నప్పుడు కాకతీయ రాజ్య వ్యవహారాలను సమర్థంగా నిర్వహించి విధేయత చాటుకున్నది ఎవరు?
a) రేచర్ల ప్రసాదిత్యుడు b) రేచర్ల రుద్రుడు
c) బేతాళ నాయకుడు d) గోన గన్నారెడ్డి
జవాబు: (b)
వివరణ: అందుకే రేచర్ల రుద్రుడికి ‘కాకతీయ రాజ్య స్థాపనాచార్య’ అనే బిరుదు ఉంది.
306. గణపతిదేవుడి కాలంలో అశ్విక దళాధిపతి- అశ్వసాహిణిగా ఎవరు ఉన్నారు?
a) సాహిణి మారన b) జాయప సేనాని
c) రేచర్ల రుద్రుడు
d) కాయస్థ గంగయ సాహిణి
జవాబు: (d)
307. గణపతిదేవుడి కాలంలో జాయప సేనాని నిర్వహించిన పదవి ఏమిటి?
a) సర్వ సైన్యాధిపతి
b) బాహత్తర నియోగాధిపతి
c) గజ సాహిణి d) అశ్వ సాహిణి
జవాబు: (c)
308. కాకతీయుల కాలంలో సైన్యాధికారులకు భూములను ఇచ్చే విధానానికి ఏమని పేరు?
a) అమర నాయంకర విధానం
b) నాయంకర విధానం
c) జాగీర్దారీ విధానం
d) ఇఖ్తాదారీ విధానం జవాబు: (b)
వివరణ: ఈ విధానం గురించి స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. కాగా, ఈ విధానం తర్వాత విజయనగర రాయల కాలంలో అమర నాయంకర విధానంగా పరివర్తన చెందింది. నాయకులు అంటే సామంతులు. రెండో ప్రతాపరుద్రుడి కాలంలో వీరి సంఖ్య 72గా ఉండేది.
309. కాకతీయుల కాలంలో రాజ్య వ్యవహారాలను ఎవరు పర్యవేక్షించేవారు?
a) నియోగాధిపతులు b) మంత్రులు
c) అమాత్యులు d) ప్రాడ్వివాకులు
జవాబు: (a)
వివరణ: కాకతీయుల కాలంలో మొత్తం 72 పరిపాలనా విభాగాలు ఉండేవి. వీటన్నింటి మీద ‘బాహత్తర నియోగాధిపతి (బహత్తర్= 72)’కి తుది పర్యవేక్షణ అధికారం ఉండేది. నియోగాల ప్రస్తావన శివదేవయ్య రచించిన ‘పురుషార్థసారం’లో ఉంది.
310. అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలకు, కాకతీయులకు మధ్య 1303లో జరిగిన ఉప్పరిపల్లి యుద్ధంలో కాకతీయుల విజయానికి కారకులు ఎవరు?
a) రేచర్ల రుద్రుడు, మల్యాల చౌండరాయలు
b) మల్యాల చౌండరాయలు, పడిదము బొప్పదేవుడు
c) పోతుగంటి మైలి, రేచర్ల వెన్నమ నాయకుడు
d) గోన గన్నారెడ్డి, నాగయ గన్న మంత్రి
జవాబు: (c)
వివరణ: ఈ వివరాలు ‘వెలుగోటి వారి వంశావళి’ నుంచి తెలుస్తున్నాయి. ఢిల్లీ సేనలకు మాలిక్ ఫక్రుద్దీన్ జునా, జునాఖాన్ నాయకత్వం వహించారు.
311. కాకతీయ సామ్రాజ్యంపై 1309లో జరిగిన రెండో దండయాత్రలో ఢిల్లీ సుల్తాన్ సైన్యాలకు నాయకుడు ఎవరు?
a) అల్లావుద్దీన్ ఖిల్జీ b) జఫర్ ఖాన్
c) గియాజుద్దీన్ తుగ్లక్
d) మాలిక్ కాఫర్ ‘హజార్ దీనారి’
జవాబు: (d)
వివరణ: ఈ యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. ఢిల్లీ సుల్తానుకు అపారమైన ధనాన్ని, ఏనుగులు, గుర్రాలను భరణంగా ఇచ్చాడు. ప్రతి ఏడాది కప్పం కట్టడానికి అంగీకరించాడు.
312. ప్రతాపరుద్రుడి దగ్గరి నుంచి మాలిక్ కాఫర్ వసూలు చేసిన సంపదను వేయి ఒంటెల మీద ఢిల్లీకి తరలించారని పేర్కొన్న సమకాలీన రచయిత ఎవరు?
a) జియావుద్దీన్ బరానీ
b) అమీర్ ఖుస్రూ దెహ్లవీ
c) మిన్హాజుస్ సిరాజ్
d) అబ్దుల్ మాలిక్ ఇసామీ జవాబు: (b)
313. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో ‘రైతు గ్రంథాలయం’ను ఎవరు స్థాపించారు?
a) కొండా వెంకట రంగారెడ్డి
b) రావి నారాయణ రెడ్డి
c) సురవరం ప్రతాపరెడ్డి
d) బద్దం ఎల్లారెడ్డి జవాబు: (b)
314. సూర్యాపేటలో ‘అర్జున పుస్తక భాండాగారం’ను ఎవరు స్థాపించారు?
a) టీకే బాలయ్య
b) రావి నారాయణ రెడ్డి c) ధర్మభిక్షం
d) దేవులపల్లి వెంకటేశ్వరరావు
జవాబు: (c)
వివరణ: ధర్మభిక్షం, కన్నయ్య తదితరులు రహస్యంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ, సాహిత్య చర్చలకు కేంద్రంగా, వామపక్ష భావజాల వేదికగా పనిచేసింది.
315. కుతుబ్‌షాహీల పాలనకు సంబంధించి దాద్ మహల్, అమన్ మహల్ వేటిని సూచిస్తాయి?
a) రాజుల నివాస భవనాలు
b) న్యాయస్థానాలు c) మసీదులు
d) సరాయీలు జవాబు: (b)
వివరణ: దాద్ మహల్‌ను మహమ్మద్ కులీ కుతుబ్‌షా, అమన్ మహల్‌ను అబ్దుల్లా కుతుబ్‌షా ఏర్పాటు చేశారు.
316. కుతుబ్‌షాహీల రాజ్యంలో అత్యధిక, అత్యల్ప పరగణాలు కలిగిన సర్కారులు ఏవి?
a) సికాకోల్, మొలంగూరు
b) మహమ్మద్ నగర్, మెదక్
c) ఖమ్మంమెట్టు, దేవరకొండ
d) మచిలీపట్నం, రాజమండ్రి
జవాబు: (a)
వివరణ: కుతుబ్‌షాహీ రాజ్యాన్ని తరఫ్‌లు, సర్కార్లు, పరగణాలు, గ్రామాలుగా విభజించారు. సికాకోల్ (ఇప్పటి శ్రీకాకుళం) సర్కారులో అత్యధికంగా 115, మొలంగూరు సర్కారులో అత్యల్పంగా 3 పరగణాలు ఉండేవి.
317. కుతుబ్‌షాహీల కాలంలో రేవు పట్టణాల ఉన్నతాధికారిని ఏమని పిలిచేవారు?
a) దివాన్ ఎ బందగాన్
b) మజుందార్ c) షా బందర్
d) ముస్తజీర్ జవాబు: (c)
318. 1938 వందేమాతరం ఉద్యమం సమయంలో విద్యార్థులు ఒక యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడు ఎవరు?
a) కే అచ్యుత రెడ్డి
b) పీవీ నరసింహారావు
c) పీజీ పురాణిక్
d) నరేంద్ర దత్తా జవాబు: (a)
వివరణ: కే అచ్యుతరెడ్డి అధ్యక్షుడు. మిగిలిన వారంతా సభ్యులు.
319. కుతుబ్‌షాహీల పాలనకు సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. మీర్ జుమ్లా: ఆర్థికమంత్రి
2. ఐనుల్ ముల్క్: సైనిక వ్యవహారాలు
3. నజీర్: న్యాయ వ్యవహారాలు
4. మజుందార్: ఫర్మానాలు పంపించడం
పై జతల్లో సరైనవి?
a) 1 b) 1, 2
c) 3, 4 d) అన్నీ సరైనవే
జవాబు: (b)
వివరణ: నజీర్ సామ్రాజ్య ప్రజల్లో నీతి, నియమాలను, సుల్తాన్ పట్ల విధేయతను, చట్టం పట్ల గౌరవాన్ని కలిగి ఉండేలా చూసేవాడు. మజుందార్ రాజ్య ఆదాయ వ్యయాలను తనిఖీ చేసే మంత్రి.
320. కుతుబ్‌షాహీల కాలంలో మంత్రిమండలిని ఏమని పిలిచేవారు?
a) దివాన్ ఎ ఆమ్
b) మజ్లిస్ ఎ దివాన్‌దరి
c) దివాన్ ఎ విజారత్
d) దివాన్ ఎ ఖాస్ జవాబు: (b)
వివరణ: ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో దీన్ని మజ్లిస్ ఎ కింగాష్ అని పిలిచేవారు.
321. కుతుబ్‌షాహీల కాలంలో ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు?
a) వజీర్ b) దబీర్
c) పీష్వా d) మీర్ జుమ్లా
జవాబు: (c)
వివరణ: తానీషా కాలంలో పీష్వాను దివాన్ అని పిలిచేవారు.
322. కుతుబ్‌షాహీల కాలానికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
A. దబీర్ 1. సుల్తాన్ తరఫున ఫర్మానాలు పంపడం
B. కొత్వాల్ 2. రాజధానిలో ముఖ్య రెవెన్యూ అధికారి
C. హవల్దార్ 3. నగరంలో శాంతిభద్రతల నిర్వహణ
D. సర్ఖేల్ 4. ప్రభుత్వ భాండాగారం, గుర్రాలు, ఏనుగుల శాలల నిర్వహణ
a) A-1, B-2, C-3, D-4
b) A-2, B-3, C-4, D-1
c) A-3, B-4, C-2, D-1
d) A-1, B-3, C-4, D-2
జవాబు: (d)
323. కుతుబ్‌షాహీల పాలనా విభాగాలకు సంబంధించి సరైన అవరోహణ క్రమం ఏది?
a) సర్కార్, తరఫ్, పరగణా, గ్రామం
b) తరఫ్, పరగణా, సర్కార్, గ్రామం
c) తరఫ్, సర్కార్, పరగణా, గ్రామం
d) పరగణా, సర్కార్, తరఫ్, గ్రామం
జవాబు: (c)
వివరణ: తరఫ్ అంటే రాష్ట్రం, సర్కార్- జిల్లా,
పరగణా- తాలూకా/ మండలం, గ్రామంగా పరిగణించవచ్చు.
324. కుతుబ్‌షాహీలకు సంబంధించి సిఫాసాలార్ లేదా సర్ లష్కర్ పదాలు దేన్ని సూచిస్తాయి?
a) సైనిక సంబంధం
b) ఆర్థిక సంబంధం
c) రెవెన్యూ సంబంధం
d) తరఫ్లలో ఒక అధికారి జవాబు: (a)
వివరణ: సిఫాసాలార్ లేదా సర్ లష్కర్ అంటే సైన్యాధ్యక్షుడు. యుద్ధంలో సైన్యాన్ని నడిపించేది ఇతనే. అయితే సైనిక శాఖకు అధిపతి మాత్రం ఐనుల్‌ముల్క్. నియామకాలు, జీతభత్యాలు ఇతని ఆధీనంలో ఉండేవి.
325. కుతుబ్‌షాహీ వాస్తుశిల్పానికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. బాద్షాహీ ఆషుర్ఖానాను మహమ్మద్ కులీ కుతుబ్‌షా నిర్మించాడు
2. మక్కా మసీదు నిర్మాణం మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో మొదలైంది
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2 సరైనవి
d) 1, 2 సరైనవి కాదు జవాబు: (a)
వివరణ: మక్కా మసీదు నిర్మాణం మహమ్మద్ కుతుబ్‌షా కాలంలో 1613/ 14లో మొదలైంది. 1687లో గోల్కొండ ఆక్రమణ అనంతరం ఔరంగజేబు ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాడు.
326. మక్కా మసీదు నిర్మాణానికి ఇంజినీర్ (వాస్తుశిల్పి)గా ఎవరు వ్యవహరించారు?
a) మీర్ మోమిన్ అస్ర్తాబాది
b) మీర్ ఫైజుల్లా బేగ్
c) ఉస్తాద్ ఈసా
d) మహిజబుద్దీన్ అహ్మద్ జవాబు: (b)
327. కుతుబ్‌షాహీ రాజుల్లో ‘మాని’ అనే కలం పేరుతో రచనలు చేసింది ఎవరు?
a) ఇబ్రహీం కుతుబ్‌షా
b) మహమ్మద్ కుతుబ్‌షా
c)అబ్దుల్లా కుతుబ్‌షా
d) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
జవాబు: (d)
327. 1565లో విజయనగర రాజ్యం, దక్కన్ సుల్తానుల మధ్య తళ్లికోట యుద్ధం జరిగినప్పుడు గోల్కొండ పాలకుడిగా ఎవరు ఉన్నారు?
a) మహ్మద్ కులీకుతుబ్‌షా
b) జంషీద్ కులీకుతుబ్‌షా
c) సుభాన్ కులీకుతుబ్‌షా
d) ఇబ్రహీం కులీకుతుబ్‌షా జవాబు: (d)
వివరణ: ఈ యుద్ధంలో అళియ రామరాయల నేతృత్వంలోని విజయనగర సైన్యాలు ఓడిపోయాయి.
328. రుద్రమదేవి మీద తిరుగుబాటు చేసిన మార్జవాడి కాయస్థ పాలకుడు ఎవరు?
a) జన్నిగదేవుడు b) అంబదేవుడు
c) త్రిపురారిదేవుడు d) మురారిదేవుడు
జవాబు: (b)
వివరణ: కాయస్థ అంబదేవుడి తిరుగుబాటు వివరాలు 1289 నాటి చందుపట్ల శాసనంలో ఉన్నాయి.
329. రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆమె సవతి సోదరులు హరిహర, మురారిదేవులను కాకతీయ సైన్యాలు ఎవరి నాయకత్వంలో అణచివేశాయి?
a) కాయస్థ అంబదేవుడు
b) కాయస్థ జన్నిగదేవుడు
c) రేచర్ల రుద్రుడు
d) రేచర్ల ప్రసాదిత్యుడు జవాబు: (d)
వివరణ: రుద్రమదేవి వారికి మరణశిక్ష విధించిందని ‘ప్రతాపరుద్ర చరిత్ర’ ద్వారా తెలుస్తున్నది.
330. గోదావరి నది ఉత్తర భాగాలను ఆక్రమించేందుకు ప్రయత్నించిన కళింగ రాజుల దండయాత్రను అడ్డుకున్నది ఎవరు?
a) గోన గన్నారెడ్డి, బుద్ధారెడ్డి
b) పోతినాయకుడు, పోలినాయకుడు
c) జన్నిగదేవుడు, ప్రసాదిత్యుడు
d) మల్యాల గుండయ, ఇందులూరి అన్నయ జవాబు: (b)
331. రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యంపై దాడిచేసిన యాదవ రాజు ఎవరు?
a) మహాదేవుడు
b) రామచంద్రదేవుడు
c) శంకరదేవుడు
d) మురారిదేవుడు జవాబు: (a)
వివరణ: మహాదేవుడు ఓరుగల్లును 15 రోజులు ముట్టడించగా, రుద్రమ అతని సైన్యాలను ఓడించినట్లు ‘ప్రతాపరుద్రచరిత్ర’ ద్వారా తెలుస్తున్నది.
332. గణపతిదేవుడి సాయం కోరిన నెల్లూరు చోడ రాజు ఎవరు?
a) నల్లసిద్ధి b) మనుమసిద్ధి
c) రక్కసగంగ
d) విజయగండ గోపాలుడు
జవాబు: (b)
వివరణ: 1248లో నెల్లూరు మండలం పాలకుడు తిక్క భూపాలుడు మరణించాడు. దాంతో అతని కొడుకులు రెండో మనుమసిద్ధి, అతని దాయాది విజయగండ గోపాలుడి మధ్య సింహాసనం కోసం యుద్ధం ప్రారంభమైంది. ఇందులో గణపతిదేవుడు రెండో మనుమసిద్ధికి సాయం చేశాడు. నెల్లూరు గద్దెమీద మనుమసిద్ధిని కూర్చోబెట్టాడు.
333. కింది వాక్యాల్లో సరైనవి?
1. మనుమసిద్ధి తరఫున ఓరుగల్లుకు కవిబ్రహ్మ తిక్కన రాయబారిగా వచ్చాడు
2. నెల్లూరులో పరిస్థితులను చక్కబెట్టడానికి వెళ్లిన కాకతీయ సేనలకు సామంత భోజుడు నాయకుడు
a) 1 b) 2 c) 1, 2 సరైనవే
d) 1, 2 సరైనవి కావు
జవాబు: (c)
334. దేవగిరి యాదవ రాజు జైత్రపాలుడి (జైతుగి)తో జరిగిన యుద్ధంలో మరణించిన కాకతీయ రాజు ఎవరు?
a) మహాదేవుడు
b) మొదటి రుద్రదేవుడు
c) గణపతిదేవుడు d) ప్రోలరాజు
జవాబు: (a)
వివరణ: ఈ సమయంలోనే గణపతిదేవుడు యాదవుల చేతికి చిక్కాడు.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?