SSC CGL 2023 Notification | ఎస్ఎస్సీలో 7500 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరితేదీ
SSC CGL 2023 Notification | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తేలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ప్రకటన ద్వారా 7500 పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేయనున్నది.
మొత్తం పోస్టులు : 7500
పోస్టులు : అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 01.08.2023 నాటికి 18 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100
ఎంపిక : టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు )
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేది: మే 05
వెబ్సైట్ : www.ssc.nic.in
టైర్-1: జూలైలో నిర్వహిస్తారు
టైర్-2: తేదీలను తర్వాత వెల్లడిస్తారు
ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: మే 04
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: మే 05
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?