Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.THDC Recruitment | టీహెచ్‌డీసీలో 90 పోస్టులు
THDC India Limited Recruitment 2023 | ఇంజినీర్ ట్రెయినీ(Engineer Trainee) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ & హై వోల్టేజ్, పవర్ మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 04 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 90
పోస్టులు : ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainee)
విభాగాలు : ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ & హై వోల్టేజ్, పవర్ మెకానికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు
జీతం : నెలకు రూ.50000
ఎంపిక : గేట్ 2022 స్కోర్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : మే 04
వెబ్సైట్ : https://www.thdc.co.in
2.NFDB Recruitment | హైదరాబాద్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో కన్సల్టెంట్ పోస్టులు
NFDB Hyderabad Recruitment 2023 | టెక్నికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందీ, ఐటీ విభాగాల్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఫిషరీస్ సైన్స్, అక్వాకల్చర్, మారికల్చర్, మరైన్ బయాలజీ, జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. మే 04 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : కన్సల్టెంట్
విభాగాలు: టెక్నికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందీ, ఐటీ.
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, ఫిషరీస్ సైన్స్, అక్వాకల్చర్, మారికల్చర్, మరైన్ బయాలజీ, జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఎన్ఎఫ్డీబీ, ఫిష్ బిల్డింగ్, పిల్లర్ నెం.235, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఎస్వీఎన్పీఏ పోస్టు, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 04
వెబ్సైట్ : https://nfdb.gov.in/
3.Chennai IMU Recruitment | ఇండియన్ మారిటైం యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
Indian Maritime University Recruitment 2023 | అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చెన్నైలోని ఇండియన్ మారిటైం యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెరైన్ ఇంజినీరింగ్, నాటికల్ సైన్స్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 26
పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: మెరైన్ ఇంజినీరింగ్, నాటికల్ సైన్స్.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 50 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.57700 నుంచి రూ.182400.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 04
వెబ్సైట్ : https://www.imu.edu.in
హార్డ్ కాపీ ఇవ్వడానికి చివరి తేదీ: మే 09
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






