SSB Recruitment | సశస్త్ర సీమా బల్లో 1638 పోస్టులు
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
చక్కటి దేహ దారుఢ్యం మీ సొంతమా? దేశసేవ చేయాడానికి రక్షణ దళాల్లో చేరాలనుకుంటున్నారా? పదోతరగతి, ఐటీఐ, పారా మెడికల్, డిగ్రీ ఇలా రకరకాల అర్హతలు ఉన్నవారికి చక్కటి అవకాశం. ఇటీవల సశస్త్ర సీమాబల్‌లో విడుదలైన పలు పోస్టుల వివరాలు, అర్హతలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
సశస్త్ర సీమా బల్
- 1962లో చైనాతో జరిగిన యుద్ధం తర్వాత సాయుధ సరిహద్దు దళంగా దీన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని స్పెషల్ సర్వీస్ బ్యూరోగా పిలిచేవారు. తదనంతర కాలంలో అనేక మార్పుల తర్వాత ప్రస్తుతం కేంద్రం హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. మొదట్లో దేశ సరిహద్దు రక్షణకే పరిమితమైన ఈ దళం ప్రస్తుతం దేశ అంతర్గత భద్రతలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని పీపుల్స్ ఫోర్స్‌గా కూడా పిలుస్తారు.
మొత్తం ఖాళీలు: 1656
పోస్టుల వారీగా ఖాళీలు, అర్హతలు
కానిస్టేబుల్- 543
- విభాగాలు: కార్పెంటర్, బ్లాక్‌స్మిత్, డ్రైవర్, టైలర్, గార్డెనర్, కాబ్లర్, వెటర్నరీ, పెయింటర్, వాషర్మన్, బార్బర్, సఫాయివాలా, కుక్, వాటర్ క్యారియర్
- వయస్సు: 18-23 ఏండ్ల మధ్య ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 27, వాషర్మెన్, బార్బర్ తదితర పోస్టులకు 23 ఏండ్లు మించరాదు.
- అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
హెడ్‌కానిస్టేబుల్- 914
- విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానిక్, స్టీవార్డ్, వెటర్నరీ, కమ్యూనికేషన్
- అర్హతలు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్ టెస్ట్‌లో అర్హత, అనుభవం ఉండాలి.
సబ్ ఇన్స్పెక్టర్- 111
- విభాగాలు: పయనీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, కమ్యూనికేషన్, స్టాఫ్ నర్స్ ఫిమేల్
- అర్హతలు: 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఉత్తీర్ణత. స్టాఫ్ నర్స్ పోస్టుకు ఇంటర్‌తోపాటు జనరల్ నర్సింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. కమ్యూనికేషన్ పోస్టుకు డిగ్రీలో ఐటీ/సీఎస్ లేదా ఈసీఈ లేదా ఎంపీసీ ఉత్తీర్ణత.
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్)- 40
- అర్హతలు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌తోపాటు స్టెనో సంబంధించిన డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ సామర్థ్యం ఉండాలి.
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (పారా మెడికల్)- 30
- విభాగాలు: ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్
- అర్హతలు: 20-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌తోపాటు సంబంధిత అంశంలో డిప్లొమా ఉత్తీర్ణత.
అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ)- 18
- అర్హతలు: 23-35 ఏండ్ల మధ్య ఉండాలి. బీవీఎస్సీ ఉత్తీర్ణత.
- నోట్: అన్ని పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్‌టెస్ట్/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా చేస్తారు.
ముఖ్యతేదీలు
- చివరితేదీ: జూన్ 18
- ఎంప్లాయ్మెంట్ న్యూస్ (మే 20-26)లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లో చేసుకోవాలి.
- వెబ్సైట్: www.ssbrectt.gov.in
Previous article
IIT Jammu Recruitment | జమ్మూ ఐఐఎంలో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?