ప్రణాళికలకు నాంది.. అభివృద్ధికి పునాది
ప్రణాళికలు – పరిచయం
- ప్రణాళిక అనే భావనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, భారత ఆర్థిక వ్యవస్థలో స్థూలంగా ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాధాన్యం ఉంది.
- ప్రణాళిక అనేది అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కార్యకలాపాల గురించి ఆలోచించే ప్రక్రియ.
- ప్రణాళిక అనేది తెలివైన ప్రవర్తన యొక్క ప్రాథమిక ఆస్తి
- ప్రపంచంలో ప్రణాళిక అనే భావన మొదట రష్యాలో 1914లో వచ్చింది.
- ప్రణాళికలకు సంబంధించి స్పష్టమైన సమగ్రమైన ప్రణాళికలను రష్యా అవలంభించింది.
- ప్రపంచంలో మొదట రష్యా ప్రణాళికబద్ధమైన ఆర్థికవ్యవస్థ అనే విధానాన్ని (Planned Economy for Russia) 1917లో ప్రవేశ పెట్టింది.
- 1916లో అమెరికాలో ప్రాంతీయ ప్రణాళిక లను అమలు చేసి విజయవంతమైనది.
- కానీ ప్రపంచంలో మొదట జాతీయ ప్రణాళికలను 1928లో ప్రవేశపెట్టిన దేశం రష్యా
- ప్రపంచంలో అమలవుతున్న ప్రణాళికలను పరిశీలిస్తే రెండు రకాలు
1) ప్రాంతీయ ప్రణాళికలు
2) జాతీయ ప్రణాళికలు - రష్యాలో ప్రణాళికలకు రూపకల్పన చేసింది లెనిన్ (1924)
- రష్యాలో ప్రణాళికలను ప్రవేశపెట్టి అమలు చేసింది స్టాలిన్ (1928)
- రష్యాలో ప్రణాళికలను అభివృద్ధి చేసింది ట్రాట్స్కీ.
- రష్యా 1928-32 సంవత్సరాల మధ్య Kol Khoz Collective Farming చేపట్టింది.
- రష్యా ప్రణాళిక సంఘాన్ని/ కమిటీని ఏర్పాటు చేసింది. దీన్నే GASPLAN అంటారు.
- రష్యాలో GASPLAN ప్రణాళికల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
- యూఎస్ఎస్ఆర్ మొదటి పంచవర్ష ప్రణాళిక కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన జోసెఫ్ స్టాలిన్ తన సోషలిజం విధానం ఆధారంగా 1928 నుంచి 1932 వరకు అమలు చేశారు.
- రష్యాలో అమలు చేసిన ప్రణాళిక ‘పై నుంచి విప్లవం’గా స్టాలిన్ ప్రారంభించారు.
- రష్యాలో ప్రణాళికలను ప్రవేశపెట్టి అమలు చేసిన తరువాత త్వరితగతిన అంటే కేవలం 20 సం.ల కాలంలోనే అప్పటి వరకు ఉన్నత స్థానంలో ఉన్న అమెరికాకు దాదాపు సమానస్థాయి ప్రగతిని సాధించింది.
- 1929లో ప్రపంచంలో మొదటిసారిగా యూఎస్ఏలో వాల్స్ట్రీట్లో ఆర్థిక మాంద్యం సంభవించి ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించింది. కానీ రష్యా ప్రణా ళికలను అమలు చేయడం వల్ల ఆర్థిక మాంద్యం నుంచి అధిగమించడం జరిగింది.
- ప్రపంచంలో ఆర్థిక మాంద్యానికి గురికాని ఏకైక దేశం రష్యా.
- రష్యాలో ప్రణాళికలు అమలు చేయడం వల్ల తద్వారా ఆర్థికమాంద్యం నుంచి అదిగమించడం వల్ల ప్రపంచంలో ఇతర దేశాల దృష్టి ఆర్థిక ప్రణాళికల వైపు మళ్లింది. అదే విధంగా భారతదేశం కూడా రష్యా ప్రణాళికలతో ప్రేరణ పొందింది.
- 1944-45లో ఫ్రాన్స్ మొదటి సారిగా జాతీయ స్థాయి ప్రణాళికను, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ప్రణాళిక నిర్వచనాలు
- నిర్ణీత కాలంలో ముందుగా నిర్ణయించిన లక్ష్యాలు, వాటి సాధన మార్గాల ద్వారా దేశ ఆర్థికాభివృద్ధి పెంపొందించుటకు ప్రభుత్వం చేసే కృషిని ప్రణాళిక అంటారు.
- కొన్ని ఎన్నుకున్న ద్యేయాలను లేదా లక్ష్యాలను సాధించేందుకు ఉద్దేశపూరకంగా చేసే ప్రయత్నాన్నే ప్రణాళిక అంటారు.
- ప్రణాళికకు అర్థాన్ని వివరించిన వారిలో ముఖ్యులు ఆచార్య ఉకెన్.
- ముందుగా నిర్ణయించిన లక్ష్యాలను ఒక నిర్ణీత కాల వ్యవధిలో సాధించుటకు ఆర్థిక కార్యకలాపాలను ఆలోచించి, ప్రవేశపెట్టి వాటిని ప్రభుత్వం నియంత్రణ చేయుట ను ‘ప్రణాళిక’ అంటారు.
- ఒక దేశం కొన్ని నిర్ణీత లక్ష్యాలను ఒక నిర్ణీత కాలానికి సంబంధించి లక్ష్యాలను సాధించడానికి రూపొందించి అమలు చేసేవే ప్రణాళికలు.
- ప్రభుత్వం ఆలోచనాత్మకంగా ఉద్దేశ పూర్వకంగా, సుదీర్ఘ ఆలోచనలతో కొన్ని ఆర్థిక ప్రాధాన్యతలను ఎంపిక చేసుకొని వాటిని సాధించడానికి రూపొందించినవే ప్రణాళి కలు అని బార్బారా పూటన్ నిర్వచించారు.
- లభ్యమయ్యే వనరులను కొన్ని నిర్ధిష్ట లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం సమర్థవంతంగా ఉద్దేశ పూర్వకంగా స్పష్టమైన ఆలోచనలతో కేటాయింపులు చేసి లక్ష్యాలను సాధించడానికి రూపొందించే ప్రక్రియనే ప్రణాళిక అని ప్రణాళిక సంఘం నిర్వచించింది.
- “ఉత్పత్తి కార్యకలాపాలను ఒక కేంద్ర అధికార సంస్థ నడుపుటయే ప్రణాళిక” -హెయక్
- ప్రణాళికకు అర్థాన్ని వివరించిన వారిలో ముఖ్యులు ఆచార్య డికెన్సన్. ఆయన ప్రకారం మనం చేరాలనుకున్న పరిస్థితికి/ లక్ష్యానికి మధ్య ఉండే అంతరానికి వంతెన కట్టడమే ప్రణాళిక అని చెప్పారు.
- ప్రొ. డికెన్సన్ ప్రకారం ఎంత వస్తు పరిమాణాన్ని ఉత్పత్తి చేయాలి. ఏ విధంగా ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేసిన వస్తువులను ఏ విధంగా కేటాయించాలి. అనే ముఖ్యాంశాలను ఆర్థిక వ్యవస్థ పరిశీలించాక నిర్ధేశించే ఒక పద్ధతి. ఈ పద్ధతి కేంద్ర అధికార సంస్థ ఉద్ధేశపూర్వకంగా నిర్ణయించే విధానాన్నే ప్రణాళికగా చెప్పవచ్చు.
- నిర్ణీత కాలంలో, నిర్ణీత లక్ష్యాలను, ఒక ప్రాధాన్యత క్రమంలో, ఒక వ్యూహం ప్రకారం సాధించడానికి రూప కల్పన చేసిన పథకమే ప్రణాళిక అంటారు.
భారత దేశ స్వాతంత్య్రానికి పూర్వం- ప్రణాళికల కోసం చేసిన కృషి :
- ప్రపంచంలో మొదట రష్యా ప్రణాళికలను అమలు చేసి త్వరితగతిన అభివృద్ధి దశకు చేరడమే కాక ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే సమస్యలను సులభంగా అధిగమించడం వల్ల ప్రపంచ దేశాల దృష్టి ప్రణాళికల వైపు మళ్లింది. అదే విధంగా భారతదేశం కూడా రష్యా ప్రణాళికల నుంచి ప్రేరణ పొందింది.
- భారతదేశం సుమారు 200 సం.లు బ్రిటిష్ వలస పాలన కింద ఉండి పూర్తిగా వెనుకబడిన దేశంగా మారింది.
విశ్వేశ్వరయ్య ప్రణాళిక
- బ్రిటిష్ పాలనా కాలంలో ప్రభుత్వ పరంగా ప్రణాళిక బద్ధమైన కృషి ఏ మాత్రం జరగలేదు.
- భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అవసరం అని మొదట సూచిం చింది మైసూరు మహరాజు దగ్గర పనిచేసిన, వృత్తి రీత్యా ఇంజినీర్ అయిన ప్రముఖ ఆర్థిక విషయ నిపుణులు, రాజనీతిజ్ఞుడు అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ‘The Planned Economy For India అనే గ్రంథంలో 10 సంవత్సరాల కాలవ్యవధి గల ప్రణాళికలను రూపొందించారు.
- సుమారు రూ. 1000 కోట్ల పెట్టుబడితో వ్యవసారంగంపై ఒత్తిడి తగ్గించి పారిశ్రామిక రంగంలో ఉపాధిని పెంచడం లక్ష్యంగా రూపొందించారు.
- భారతదేశం ప్రణాళికాబద్ధమైన ఆర్ధికాభివృద్ధిని సాధించాలని సూచించారు.
- మనదేశ ఆర్థికాభివృద్ధి కోసం జరిగిన ప్రయత్నాల్లో విశ్వేశ్వరయ్య రూపొందించిన ప్రణాళిక మొదటిది అని చెప్పవచ్చు.
- దీన్ని విశ్వేశ్వరయ్య ప్రణాళిక అని కూడా అంటారు.
- మోక్షగుండం విశ్వేశ్వరయ్యను భారత ప్రణాళికల పితామహుడు అని కూడా అంటారు.
- ఇదేకాలంలో పీఎస్ లోకనాథన్ రాసిన ప్రిన్సిపుల్స్ ఆఫ్ ప్లానింగ్, కేఎన్ సేన్ రాసిన ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ మొదలైన గ్రంథాలు ప్రచురితమయ్యాయి.
బాంబే ప్రణాళిక (Bombay Plan) 1943
- రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారత ఆర్థికాభివృద్ధికి తీసుకున్న ప్రతిపాదనల సమాహారాన్నే బాంబే ప్లాన్ అంటారు.
- 1943లో ముంబాయి నగరానికి చెందిన 8 మంది ప్రసిద్ధ భారత పారిశ్రామిక వేత్తలు భారతదేశ ఆర్థికాభివృద్ధిపై ప్రణాళిక ‘ఏ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా’ను రూపొందించి, 1944లో ముద్రించారు.
- బాంబేకు చెందిన 8 మంది పారిశ్రామిక వేత్తలు జేఆర్డీ టాటా, జీడీ బిర్లా, అర్థేశిర్ దలాల్, లాల్ శ్రీరామ్, కస్తూర్బాయ్ లాల్భాయ్, అర్థేశీర్ దరబ్షా ష్రాఫ్, పురుషోత్తందాస్ ఠాగూర్దాస్, జాన్మత్తాయ్.
- బాంబే ప్రణాళికను 15 సంత్సరాల కాల వ్యవధితో రూ.10,000 కోట్ల పెట్టుబడితో రూపొందించారు.
- ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం మౌలిక పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా రూపొందించారు. అంటే ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్, రసాయనాలు మొదలైన మౌళిక పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.
- అంటే పెట్టుబడిదారీ విధానాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
- బాంబే ప్రణాళికను టాటా -బిర్లా ప్రణాళిక అని పారిశ్రామిక ప్రణాళిక అని కూడా అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కార్యకలాపాల గురించి సూచించే ప్రక్రియ ఏది?
ఎ) మార్గం బి) ప్రణాళిక
సి) రూపకల్పన డి) ఆలోచన
2. ప్రణాళిక అనే భావన మొదట ఎప్పుడు ఎక్కడ ప్రతిపాదించబడింది.
ఎ) 1914 రష్యా
బి) 1914 అమెరికా
సి) 1910 ఇంగ్లండ్
డి) 1916 అమెరికా
3. ‘రష్యా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ’ అనే విధానాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టింది?
ఎ) 1914 బి) 1916
సి) 1917 డి) 1938
4. ప్రాంతీయ ప్రణాళికలను అమలు చేసి విజయవంతమైన దేశం ఏది?
ఎ) జపాన్ బి) రష్యా
సి) అమెరికా డి) ఫ్రాన్స్
5. ప్రపంచంలో మొట్ట మొదట జాతీయ ప్రణాళికలను అమలు చేసిన దేశం ఏది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) ఫ్రాన్స్ డి) జపాన్
6. రష్యాలో ప్రణాళికలకు రూపకల్పన చేసినది ఎవరు?
ఎ) లెనిన్ బి) స్టాలిన్
సి) ట్రాట్స్కీ డి) పై అందరూ
7. రష్యాలో ప్రణాళికలను అభివృద్ధి చేసినది ఎవరు?
ఎ) లెనిన్ బి) స్టాలిన్
సి) ట్రాట్స్కీ డి) పై అందరూ
8. రష్యాలో ప్రణాళికలను రూపొందించే సంఘాన్ని / కమిటీని ఏమని పిలుస్తారు?
ఎ) The Gasplan
బి) The Gestation
సి) Planning committee
డి) Russia Planning
9. రష్యాలో మొదట ప్రణాళికలను ప్రవేశపెట్టి, అమలు చేసినది ఎవరు?
ఎ) లెనిన్ బి) స్టాలిన్
సి) ట్రాట్స్కీ డి) పై అందరూ
10. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం మొదట ఏ దేశంలో సంభవించింది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) ఇంగ్లండ్ డి) ఫ్రాన్స్
11. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురికాని దేశం ఏది?
ఎ) బ్రిటన్ బి) జపాన్
సి) రష్యా డి) అమెరికా
12. రష్యాలో ప్రణాళికలను ఎప్పుడు ప్రవేశపెట్టి అమలు చేశారు?
ఎ) 1914 బి) 1917
సి) 1928 డి) 1938
13. ఫ్రాన్స్లో జాతీయ ప్రణాళికలను ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1944-45 బి) 1945-46
సి) 1934-35 డి) 1954-55
14. ఉత్పత్తి కార్యకలాపాలను ఒక కేంద్ర అధికార సంస్థ నడపటమే ప్రణాళిక అని నిర్వచించినది ఎవరు?
ఎ) భారత ప్రణాళిక సంఘం
బి) బార్బార్ పుటాన్
సి) హెయక్ డి) కీన్స్
15. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను నిర్ణిత కాలంలో సాధించుకోవడానికి రూపొందించి అమలు చేసేవి ఏవి?
ఎ) ప్రక్రియలు బి) ప్రణాళికలు
సి) రూపకల్పనలు డి) సూచికలు
16. బ్రిటిష్పాలన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ?
ఎ) వృద్ధి చెందింది బి) స్థిరంగా ఉంది
సి) కుంటుపడింది డి) ఏదీకాదు
17. ప్రపంచంలోని వివిధ దేశాలు ఏ దేశ ఆర్థికవ్యవస్థకు ప్రేరేపితమైనవి?
ఎ) అమెరికా బి) రష్యా
సి) బ్రిటన్ డి) ఫ్రాన్స్
18. భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అవసరం అని మొదట సూచించినది ఎవరు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ
బి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సి) జవహర్లాల్ నెహ్రు
డి) నేతాజీ సుభాష్ చంద్రబోస్
19. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశానికి ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి గల ప్రణాళికలను రూపొందించారు?
ఎ) 5 బి) 10 సి) 15 డి) 20
20. ప్రిన్స్పల్ ఆఫ్ ప్లానింగ్ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) లోక్నాథన్ బి) సుబ్బారావు
సి) ఎన్ సేన్ డి) విశ్వేశ్వరయ్య
21. బాంబే ప్రణాళిక ఎంతమంది పారిశ్రామిక వేత్తల సమక్షంలో రూపొందింది?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
సమాధానాలు
1-బి 2-ఎ 3-సి 4-సి
5-బి 6-ఎ 7-సి 8-ఎ
9-బి 10-ఎ 11-సి 12-సి
13-ఎ 14-సి 15-బి 16-సి
17-బి 18-బి 19-బి 20-ఎ
21-డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?