ఆర్మీలో 1793 ఖాళీలు
దేశసేవ చేసుకునే భాగ్యం. కేవలం పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి అవకాశం. మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువులు. వీటన్నింటి సమాహారం దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ విడుదల చేసిన ప్రకటన. ఆ నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా…
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్‌కు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 1793
- పోస్టులు: ట్రేడ్స్‌మ్యాన్ మేట్- 1249, ఫైర్‌మ్యాన్-544 ఖాళీలు ఉన్నాయి.
- పేస్కేల్: ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు లెవల్-1 కింద రూ. 18,000-56,900/-
- ఫైర్‌మ్యాన్ పోస్టులకు లెవల్-2 కింద రూ.19,900-63,200/-
- అర్హతలు: ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు పదోతరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. ఏదైనా ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండటం అభిలషణీయం.
రాతపరీక్ష
- 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
- పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్-25, జనరల్ ఇంగ్లిష్-25, జనరల్ అవేర్నెస్-50 ప్రశ్నలు ఇస్తారు.
- ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
- నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
- వెబ్సైట్: https://www. aocrecruitment. gov.in/Home.html
ఫైర్‌మ్యాన్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత.
- వయస్సు: పై రెండు పోస్టులకు 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: స్టేజ్-1 (ఫిజికల్ ఎండ్యూరెన్స్/స్కిల్ టెస్ట్), రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా
- ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో పురుషులు 1.5 కి.మీ దూరాన్ని 6 నిమిషాల్లో పరుగెత్తాలి. 100 సెకండ్లలో 50 కేజీల బరువును 200 మీటర్ల దూరం మోయాలి. మహిళలు 1.5 కి.మీ దూరాన్ని 8 నిమిషాల 26 సెకండ్లలో పరుగెత్తాలి.
- అదేవిధంగా 225 సెకండ్లలో 50 కేజీల బరువుతో 200 మీటర్ల దూరం వెళ్లాలి.
- అదేవిధంగా ఫైర్‌మ్యాన్ పోస్టులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు, పీఈటీ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని స్టేజ్-2 రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
- Tags
- army jobs
- Job Vacancies
Previous article
ప్రణాళికలకు నాంది.. అభివృద్ధికి పునాది
Next article
వ్యవసాయాభివృద్ధిలో ‘రైతుబంధు’పాత్రను చర్చించండి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు