Railway Recruitment | రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ కొలువులు
Railway Recruitment | కేవలం పదోతరగతి, ఐటీఐ/డిప్లొమా పూర్తయ్యిందా? మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువు కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ప్రకటన మీ కోసమే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేన్ విడుదల చేసింది. ఆ వివరాలు సంక్షిప్తంగా….
మొత్తం ఖాళీలు
- దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 5696
- పోస్టులు: అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)
- కేటగిరీ వారీగా పోస్టులు: జనరల్- 2499, ఎస్సీ- 804, ఎస్టీ- 482, ఓబీసీ- 1351, ఈడబ్ల్యూఎస్- 560, ఎక్స్‌సర్వీస్‌మెన్- 572.
- పేస్కేల్: రూ.19,900-63,200/-
అర్హతలు - పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 2024, జూలై 1 నాటికి 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
- 21 ఆర్ఆర్బీల్లో ఏదో ఒక అర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- మొదటి స్టేజీ సీబీటీ-1
- రోండో స్టేజీ సీబీటీ-2
- కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
సీబీటీ-1
- ఇది కేవలం స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే. దీని ద్వారా అభ్యర్థులను సీబీటీ-2కు ఎంపిక చేస్తారు
- సీబీటీ-1 స్కోర్/మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
- మొత్తం ప్రశ్నలు- 75, మార్కులు- 75. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు
- నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కు కోత విధిస్తారు.
- పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
సీబీటీ-2
- సీబీటీ-1లో వచ్చిన స్కోర్‌ను నార్మలైజేషన్ చేసి కమ్యూనిటీ వైజ్‌గా సీబీటీ-2కు పంపిస్తారు
- ఖాళీల సంఖ్యను బట్టి 1:15 నిష్పత్తిలో సీబీటీ-2కు ఎంపిక చేస్తారు
- దీనిలో రెండు పార్టులు ఉంటాయి.
పార్ట్- ఎ, బి. - పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు
- మొత్తం ప్రశ్నలు 175
- పార్ట్-ఎ లో 100 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన సమయం 90 నిమిషాలు
- పార్ట్-బి లో 75 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన సమయం 60 నిమిషాలు
- పార్ట్-బి కేవలం క్వాలిఫయింగ్ నేచర్ పరీక్ష మాత్రమే. సంబంధిత ట్రేడుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- పార్ట్ ఎలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి
ప్రశ్నలు ఇస్తారు.
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ)
- సీబీటీ-2 స్కోర్‌తో పోస్టుల సంఖ్యకు 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను సీబీఏటీకి ఎంపిక చేస్తారు.
- దీనిలో విజన్ సర్టిఫికెట్ సమర్పించాలి. దీంతో పాటు బ్యాటరీ టెస్ట్/సెక్షన్ ఆఫ్ సీబీఏటీ వేర్వేరుగా అర్హత సాధించాలి.
నోట్: సీబీఏటీ పరీక్షకు 70 శాతం, సీబీటీ-2కు 30 వెయిటేజీ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులను పిలుస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 19
దరఖాస్తు సవరణలకు: ఫిబ్రవరి 20-29 మధ్య చేసుకోవాలి
వెబ్సైట్: https://indianrailways.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?