మే 9 నుంచి పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: పాలిసెట్ (POLYCET)దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ దరఖాస్తులు మే 9 (సోమవారం) నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటాయని పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ వెల్లడించారు. జూన్ 5 వరకు రూ.100 ఆలస్య రుసుముతో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. అదేనెల 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పరీక్ష ముగిసిన 12 రోజులకు ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు.
పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సులు, బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ (బీటెక్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతి పూర్తి చేసిన, ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న వారంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వెబ్సైట్: www.polycet.sbtet.telangana.gov.in, www.polycetts.nic.in
- Tags
- CET
- Job notifications
- Poly CET
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?