PNB SO Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 240 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
PNB SO Recruitment 2023 | క్రెడిట్, ఇండస్ట్రీ, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్ తదితర విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officers), మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఆర్క్, సీఏ, సీఎంఏ, ఐడీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 240
పోస్టులు : స్పెషలిస్ట్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఆర్క్, సీఏ, సీఎంఏ, ఐడీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: కనీసం 21-38 ఏ్ండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 11
వెబ్సైట్ : pnbindia.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






