India Post Recruitment | పోస్టల్ శాఖలో 12,828 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
India Post Office Recruitment 2023 | దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న.. గ్రామీణ డాక్ సేవక్స్-బ్రాంచి పోస్ట్ మాస్టర్ (బీపీఎం)/అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో తప్పనిసరిగా పదోతరగతిలో చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 12,828. వీటిలో తెలంగాణ- 96, ఏపీలో -118
పోస్టులు: గ్రామీణ డాక్ సేవక్స్-బ్రాంచి పోస్ట్ మాస్టర్ (బీపీఎం)/అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)
పేస్కేల్: బీపీఎం పోస్టుకు రూ.12,000- 29,380/-, ఏబీపీఎం పోస్టుకు రూ.10,000-24,470/-
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో తప్పనిసరిగా పదోతరగతిలో చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయస్సు: 2023, జూన్ 11 నాటికి 18- 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 11
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు