సింగరేణిలో 177 పోస్టులకు నోటిఫికేషన్
– జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ
– 20 నుంచి జూలై 10 వరకు దరఖాస్తులు
-95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
రాష్ట్రం లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. సింగరేణి సంస్థ 177 క్లర్క్ (జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2) పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల కోసం ఈ నెల 20 నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బుధవారమే 1,326 వైద్య పోస్టులకు నోటిఫికేషన్ రాగా, అంతకుముందే 503 గ్రూప్-1 పోస్టులు, పోలీసుశాఖలో 17,291 పోస్టులు, టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1,271 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సింగరేణిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో డైరెక్టర్ ఎన్ బలరాం సారథ్యంలో 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) ఖాళీలను గుర్తించారు. వాటి భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇటీవల ఇంటర్నల్ అభ్యర్థుల కోసం ప్రకటించిన పోస్టులకు ఇవి అదనం.
అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఇవే..
క్లర్క్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్/ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు లేదా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికెట్ కోర్సు చేసినవారు అర్హులు. గరిష్ఠ వయస్సు 30 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు మినహాయింపు ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను లోకల్ అభ్యర్థులతో అనగా.. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలవారితో భర్తీ చేస్తారు. మిగిలిన ఐదు శాతం పోస్టులను అన్ రిజర్వ్ డ్ కోటా కింద తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని డైరెక్టర్ ఎన్ బలరాం తెలిపారు. వివరాలకు www.scclmines.com చూడాలని సూచించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?