వర్సిటీల్లో నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు
# జూనియర్ అసిస్టెంట్లు, ఆపై ఖాళీల భర్తీకి చాన్స్
# ఓయూలో 680 పోస్టులకు అవకాశం
యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓయూ, జేఎన్టీయూహెచ్, కాకతీయ వంటి అన్ని రకాల యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,774 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అధికంగా ఓయూలో 2,075 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్ టెక్నికల్లో జూనియర్ అసిస్టెంట్లు, ఆ పై క్యాటగిరీ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో ఓయూ పరిధిలో 680 పైగా జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి చాన్స్ ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. జేఎన్టీయూహెచ్లో 115, కాకతీయలో 174 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
యూనివర్సిటీల వారీగా నాన్ టీచింగ్ పోస్టుల వివరాలు
యూనివర్సిటీ మంజూరుపోస్టులు వర్కింగ్ ఖాళీలు
ఉస్మానియా 3,209 1,134 2075
కాకతీయ 530 356 174
తెలంగాణ 18 9 9
మహాత్మాగాంధీ 15 6 9
శాతవాహన 78 20 58
పాలమూరు 16 2 14
పీఎస్టీయూ 209 125 84
బీఆర్‌ఏవోయూ 221 131 90
జేఎన్టీయూహెచ్ 474 359 115
జేఎన్‌ఏఎఫ్‌యూ 84 31 53
ఆర్జీయూకేటీ 95 2 93
మొత్తం 4,949 2,175 2,774
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?