గ్రూప్-1కు బీఆర్‌ఏవోయూ స్టడీ మెటీరియల్

# ప్రత్యేకంగా 8 సెట్లను సిద్ధం చేస్తున్న వర్సిటీ
# వారం పదిరోజుల్లో అందుబాటులోకి
గ్రూప్-1కు సిద్ధ్ధమవుతున్న అభ్యర్థులకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) కొత్త స్టడీ మెటీరియల్‌ను రూపొందిస్తున్నది. బీఏ, ఎంఏ పుస్తకాలను కూర్పుచేసి జాగ్రఫీ, పొలిటికల్‌సైన్స్, భారత రాజ్యాంగం, ఇతర పాఠ్యాంశాలతో మొత్తంగా 8 సెట్ల మెటీరియల్‌ను తయారు చేస్తున్నది. ఇటీవల గ్రూప్-1 నోటిఫికేషన్లో వెల్లడించిన సిలబస్ ప్రకారమే అధికారులు ఈ స్టడీ మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు. వారం, పది రోజుల్లో ఈ మెటీరియల్ అందుబాటులోకి రానున్నది.
సివిల్స్‌కు తగ్గట్టుగా సిలబస్
బీఆర్‌ఏవోయూ రూపొందించిన బీఏ, ఎంఏ పుస్తకాలకు అధిక డిమాండ్ ఉంటుంది. పోటీ పరీక్షలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ పుస్తకాలను మార్కెట్లో విక్రయించరు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే అందజేస్తారు. వీటి సిలబస్ సివిల్స్‌కు తగినట్టు ఉంటుంది. సివిల్స్‌కు పోటీపడే విద్యార్థుల్లో కొందరు ఈ పుస్తకాల కోసమే బీఆర్‌ఏవోయూ బీఏ కోర్సులో చేరుతుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి ఇటీవలే బీఆర్‌ఏవోయూ వీసీతో మాట్లాడి.. గ్రూప్-1 ఉద్యోగార్థుల కోసం ప్రత్యేకంగా మెటీరియల్ తయారుచేస్తే బాగుంటుందని సూచించారు. దీనికి అయ్యే నిధులను సమకూర్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ముందుకు రావడంతో వర్సిటీ అధికారులు మెటీరియల్ తయారీలో నిమగ్నమయ్యారు.
వీటిని చదువుకుంటే సరిపోతుంది..
గ్రూప్-1 సిలబస్‌ను అనుసరించి స్టడీ మెటీరియల్‌ను తయారుచేస్తున్నాం. ఇది గ్రూప్-2 పరీక్షలకు సైతం ఉపయోగపడుతుంది. ఉద్యోగార్థులు వీటిని చదువుకుంటే సరిపోతుంది. రాష్ట్రంలోని గ్రంథాలయాలు, వర్సిటీలు సహా ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న కోచింగ్ కేంద్రాలకు వీటిని అందజేస్తాం.
– ప్రొఫెసర్ కుసుంబ సీతారామారావు, వైస్ చాన్స్‌లర్
- Tags
- BRAOU
- competitive exams
- TSPSC
Latest Updates
‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
Write GRE to fly abroad
ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
After 10th What Next: మీ పిల్లలు ఇంటర్లో చేరుతున్నారా?.. అయితే ఈ వీడియో చూడండి
‘అనుపమ్’ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసిందెవరు?
ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, బెంగళూరు
ఉర్దూ చాజర్గా కీర్తించిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
వినూత్న ఆలోచనలు.. సంయుక్త వ్యూహాలు గ్లోబల్ సౌత్ సమ్మిట్
ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన హక్కు ఏది?