Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.AIIMS NORCET – 4 Recruitment | ఎయిమ్స్‌లో 3,055 పోస్టులు
AIIMS NORCET Recruitment 2023 | దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్సెట్) – 4 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా (జీఎన్ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవంతో పాటు స్టేట్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి. నార్సెట్- 4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 3,055
పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్
అర్హతలు : డిప్లొమా (జీఎన్ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
వయస్సు : 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు అయిదేళ్ల మినహాయింపు ఉంటుంది.
జీతం: రూ.9300 నుంచి రూ. 34800
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు
ఎంపిక : నార్సెట్-4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : మే 05 వరకు
సీబీటీ పరీక్ష తేదీ: జూన్ 06
వెబ్సైట్ : norcet4.aiimsexams.ac.in
2.NTPC recruitment 2023 | ఎన్టీపీసీలో 152 పోస్టులు
NTPC recruitment 2023 | మైనింగ్ ఓవర్‌మ్యాన్(Mining Overman), మెకానికల్ సూపర్వైజర్ (Mechanical Supervisor), ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, మైనింగ్ సర్దార్ తదితర పోస్టుల భర్తీకి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రాతిపదికన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
NTPC recruitment 2023 vacancy details
మొత్తం పోస్టులు : 152
పోస్టులు : మైన్ ఓవర్‌మ్యాన్, మెకానికల్ సూపర్వైజర్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, మైనింగ్ సర్దార్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 25 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.300(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 05
వెబ్సైట్ : careers.ntpc.co.in.
3.EPIL Recruitment: ఈపీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు
EPIL Recruitment | సీనియర్ మేనేజర్, మేనేజర్లు తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్(ఈపీఐఎల్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 03
పోస్టులు: సీనియర్ మేనేజర్, మేనేజర్లు.
అర్హతలు: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: 35-42 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.50000 నుంచి రూ.70000 వరకు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 05
వెబ్సైట్ : https://epi.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?