Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. AIIMS Rishikesh | ఎయిమ్స్-రిషికేష్‌లో 35 ఫ్యాకల్టీ పోస్టులు
AIIMS Rishikesh | అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ తదితర ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ తదితర విభాగాలలో ఖాళీలను ఎయిమ్స్భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనిభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 35
పోస్టులు: అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తదితరాలు.
విభాగాలు: జనరల్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, తదితరాలు.
అర్హతలు : 1. ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు 11 నుంచి 14 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
2. అడిషనల్ ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు 7 నుంచి 10 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
3. అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 6 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
4. అసిస్టెంట్ ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 3 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 50-58 ఏండ్లు మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.101500 నుంచి రూ.220400
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.3000.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 22
చివరి తేది: ఏప్రిల్ 24
వెబ్సైట్: www.aiimsrishikesh.edu.in
2. SVNIT Recruitment | సూరత్ నిట్‌లో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
Sardar Vallabhbhai National Institute of Technology (SVNIT) | అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గుజరాత్ సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీనిట్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ హ్యుమానిటీస్ తదితర విభాగాలలో ఖాళీలను ఎస్వీనిట్ భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత రంగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు : 50
పోస్టు : అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ హ్యుమానిటీస్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత రంగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 60 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.101,500 నుంచి రూ.167,400.
ఎంపిక : రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: ఏప్రిల్ 24
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: మే 05
వెబ్సైట్ : https://www.svnit.ac.in/
3.SAIL Ranchi Recruitment | సెయిల్-ఝార్ఖండ్‌లో మేనేజర్ పోస్టులు
SAIL Ranchi Recruitment | మేనేజర్ పోస్టుల భర్తీకి ఝార్ఖండ్ రాంచి(Ranchi, Jharkhand)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 10
పోస్టు : మేనేజర్ పోస్టులు
విభాగాలు: కోల్, కోక్ అండ్ కెమికల్, సివిల్, స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్, టెక్నాలజీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 35 ఏండ్లు మించకూడదు.
జీతం: యేడాదికి సుమారు రూ.22 లక్షలు
ఎంపిక : రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.700.
దరఖాస్తు : ఆఫ్‌లైన్
అడ్రస్ : డి వై. జనరల్ మేనేజర్ (P&A) సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ RDCIS 4వ అంతస్తు ల్యాబ్ బుల్డింగ్, ఇస్పత్ భవన్ శ్యామాలి కాలనీ, డోరండా రాంచీ – 834002 (జార్ఖండ్).
చివరి తేది: ఏప్రిల్ 24
వెబ్సైట్: https://sail.co.in
4.ISRO IPRC Recruitment | తమిళనాడు ఇస్రోలో 63 ఖాళీలు
ISRO Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాప్ట్స్‌మెన్, హెవీ వెహికిల్ డ్రైవర్, లైట్ తదితర పోస్టుల భర్తీకి తమిళనాడు తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, ఎస్ఎస్ఎల్సీ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ పీఈటీ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 63
పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాప్ట్స్‌మెన్, హెవీ వెహికిల్ డ్రైవర్, లైట్ వెహికిల్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, ఎస్ఎస్ఎల్సీ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.19900 నుంచి రూ.44900
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పీఈటీ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 24
వెబ్సైట్: https://www.iprc.gov.in
5.NEEPCO Recruitment | నీప్కో మేఘాలయాలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NEEPCO Recruitment 2023-24 | మెడికల్, సెక్యూరిటీ, సేఫ్టీ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి మేఘాలయాలోని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(నీప్కో) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ పోస్టులు
విభాగాలు: మెడికల్, సెక్యూరిటీ, సేఫ్టీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 32-38 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.82320-రూ.113540
ఎంపిక : స్క్రూటినీ, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.300
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : NEEPCO, GPO వద్ద పోస్ట్ బాక్స్ నం.89, షిల్లాంగ్-793001 (మేఘాలయ)
చివరి తేది: ఏప్రిల్ 24
వెబ్సైట్ : https://neepco.co.in
6.NFDB Recruitment | హైదరాబాద్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో కన్సల్టెంట్ పోస్టులు
NFDB Hyderabad Recruitment 2023 | టెక్నికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందీ, ఐటీ విభాగాల్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఫిషరీస్ సైన్స్, అక్వాకల్చర్, మారికల్చర్, మరైన్ బయాలజీ, జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : కన్సల్టెంట్
విభాగాలు: టెక్నికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందీ, ఐటీ.
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, ఫిషరీస్ సైన్స్, అక్వాకల్చర్, మారికల్చర్, మరైన్ బయాలజీ, జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఎన్ఎఫ్డీబీ, ఫిష్ బిల్డింగ్, పిల్లర్ నెం.235, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఎస్వీఎన్పీఏ పోస్టు, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 04
వెబ్సైట్ : https://nfdb.gov.in/
7.NIB Recruitment | ఎన్ఐబీలో 59 పోస్టులు
NIB Recruitment 2023 | అడ్మిన్, ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, ఐటీ డివిజన్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసోసియేట్ (Technical Associate), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ (ఎన్ఐబీ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 59
పోస్టులు : టెక్నికల్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్
విభాగాలు : అడ్మిన్, ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, ఐటీ డివిజన్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) గ్రాడ్యుయేషన్ (సైన్స్) ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్/ హిందీ టైపింగ్, 1 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 30 నుంచి 65 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఈమెయిల్లో
ఈమెయిల్: rajdhanienterprises2007@gmail.com/ rajdhanienterprises338@gmail.com
చివరితేది: ఏప్రిల్ 24
వెబ్సైట్ : https://www.nib.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?