SBI, NCERT Recruitment | రేపే చివరి గడువు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT) విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. SBI Recruitment | ఎస్బీఐలో 217 పోస్టులు
SBI SO Recruitment 2023 | మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వీపీ, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 217 పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 217
పోస్టులు : మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వీపీ, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల
ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 19
ఆన్లైన్ పరీక్ష తేదీ: జూన్ 2023
వెబ్సైట్ : @www.sbi.co.in/careers
2. NCERT: ఎన్సీఈఆర్టీలో 347 నాన్ టీచింగ్ పోస్టులు
NCERT Recruitment 2023 | సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 347
పోస్టులు : ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.
అర్హతలు : పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 27-50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : కాంపిటేటివ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1500.
చివరి తేది: మే 19
వెబ్సైట్ : www.ncert.nic.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






