Indian History | విప్లవాత్మక ఉద్యమాలు
భారత్‌లో విప్లవాత్మక ఉద్యమాలకు నాంది పలికిన వాసుదేవ్ బలవంత్ ఫాడ్కేను విప్లవాత్మక ఉద్యమాల పితామహుడు అంటారు.
వీరికి స్ఫూర్తినిచ్చిన అంశాలు
- బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడటం ఐరిష్ ఉగ్రవాదుల పంథా.
- రష్యాను జార్ చక్రవర్తుల పాలన నుంచి విముక్తి చేయడానికి పోరాడుతున్న నిహిలిస్ట్ ఉద్యమం
- రష్యాపై జపాన్ సాధించిన విజయం
- బోయర్ యుద్ధాలు (1899-1902)
- ఇటలీలోని కార్బోనరీ ఉద్యమం
- ఈజిప్ట్, టర్కీ, పర్షియా, చైనాలోని జాతీయవాద ఉద్యమాలు
బెంగాల్ విప్లవ కార్యక్రమాలు
అనుశీలన్ సమితి
- ఇది బెంగాల్లో మొదటి రహస్య సంఘం
- 1902, మార్చి 24న కలకత్తా కేంద్రంగా ప్రమథనాథ్ మిత్ర సహకారంతో సతీష్‌చంద్ర బసు స్థాపించారు.
- విప్లవ కార్యక్రమాలను నిర్వహించి విప్లవ జాతీయవాదాన్ని ప్రచారం చేయడం దీని లక్ష్యం.
- భారతదేశంలో ఎక్కువ శాఖలను కలిగిన రహస్య సంఘంగా గుర్తింపు పొందింది.
- దీని స్థాపనలో ముఖ్య పాత్ర వహించినవారు బరీంద్రకుమార్ ఘోష్, ప్రమోద్ మిట్టల్, భూపేంద్రనాథ్ దత్త.
- దీనికి ఉపాధ్యక్షులు- అరబిందో ఘోష్, సీఆర్ దాస్
- దీని గ్రంథం- భవానీ మందిర్
- పత్రికలు- సంధ్య, యుగాంతర్
- యుగాంతర్ పత్రికలో బరీంద్రకుమార్ ఘోష్ ‘నీ జీవితాన్ని ఇస్తూ మరొక జీవితాన్ని ముందుకు తీసుకెళ్లు’ అనే నినాదం ఇచ్చారు.
డక్కా (ఢాకా) అనుశీలన్ సమితి - దీన్ని పులిన్ బిహారి దాస్ 1902లో అనుశీలన్ సమితికి అనుబంధంగా ఢాకాలో స్థాపించారు.
- ఇతనికి సంబంధం గల కేసు డక్కా కుట్ర కేసు- 1910
- ఇతను 1928లో ‘బంగీయ బ్యయం సమితి’ని స్థాపించి యువకులకు కర్ర సాము, కుస్తీ వంటి వాటిలో శిక్షణ ఇచ్చారు.
యుగాంతర్ సమితి - దీన్ని కలకత్తా కేంద్రంగా 1906లో బరీంద్ర కుమార్ ఘోష్ స్థాపించగా, దీనిలో ఇతర నాయకులుగా అరబిందో ఘోష్, రాజా సుబోధ్ మాలిక్, భూపేంద్ర నాథ్ దత్త ఉండేవారు.
- అలీపూర్ కుట్ర కేసు తర్వాత 1910లో జతిన్ ముఖర్జీ యుగాంతర్ సమితికి నాయకత్వం వహించి 1914 నాటికి బలమైన సంస్థగా నిర్మించారు.
- 1938, సెప్టెంబర్ 9న యుగాంతర్ సమితి జాతీయ కాంగ్రెస్‌లో విలీనమైంది.
ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ
- దీన్ని చిట్టగాంగ్ కేంద్రంగా 1930లో సూర్యసేన్ స్థాపించారు. దీనికి ముఖ్య నాయకులు కల్పనా దత్త, ప్రీతిలత వడ్డేకర్.
- బెంగాల్లో బీనాదాస్ అనే విద్యార్థి తన డిగ్రీ పట్టాను అందుకున్నప్పుడే గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌పై కాల్పులకు పాల్పడ్డారు.
- అదేవిధంగా శాంతిఘోష్, సునీతి చౌధరి తిప్పెర జిల్లా మేజిస్ట్రేట్ అయిన స్టీవెన్‌ను కాల్చి చంపారు.
బెంగాల్ వలంటీర్స్ - ఇది ప్రాథమికంగా సుభాష్ చంద్రబోస్‌తో ఒక యువజన సంఘంగా ఏర్పడి తర్వాత విప్లవ సంఘంగా రూపుదిద్దుకుంది.
- ఈ సంస్థకు చెందిన దినేష్ చంద్ర గుప్తా, బాదల్ గుప్తా, బినయ్ బసు అనే ముగ్గురు 1930, డిసెంబర్ 8న కలకత్తాలో భారత ఖైదీల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ సిమ్సన్ అనే అధికారిని హత్య చేశారు.
- వాస్తవానికి వీరు సిమ్సన్‌ను చంపాలనుకోలేదు. వీరి లక్ష్యం సెక్రటేరియట్ భవనంపై దాడి చేయడం.
- ఈ సంఘటనలో భాగంగా కాల్పుల ఫలితంగా బినయ్ మరణించగా, బాదల్ గుప్తా పొటాషియం సయనైడ్ తీసుకొని ఆత్మహత్య చేసుకోగా, దినేష్ గుప్తాను ఉరితీశారు.
ఆనంద్ మఠ్ - బెంగాల్‌లోని మిడ్నాపూర్ కేంద్రంగా 1902లో జతింద్ర నాథ్ బసు, సత్యేంద్ర నాథ్ బసు దీన్ని స్థాపించారు.
మహారాష్ట్రలోని విప్లవకారులు - మహారాష్ట్రలోని విప్లవాత్మక ఉద్యమాన్ని ప్రచారం చేసిన పత్రికగా ‘కాల్’ గుర్తింపు పొందగా, తిలక్ అందరికీ ప్రేరణగా నిలిచారు.
వాసుదేవ్ బలవంత్ ఫాడ్కే (1845-83)
ఈయనను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ మూవ్మెంట్’, ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ రెబెలియన్’ అంటారు.
- ఇతనికి మెంటార్- క్రాంతివీర్ వస్తాద్ సాల్వే
- 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత స్థానిక భిల్లులు, కోలి, థంగర్ తెగలతో రామోసి అనే సమూహాన్ని ఏర్పాటు చేసి సాయుధ తిరుగుబాటు ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన తొలి వ్యక్తి.
- స్వరాజ్యం సాధించడం వల్ల దేశ సమస్యలను పరిష్కరించవచ్చునని తెలిపారు.
- ఈయన సాయుధ పోరాటాల గురించి ఆనంద్ మఠ్‌లో వివరించి ఉంది.
- ఇతను ‘ఐక్యవర్ధిని సభ’ను స్థాపించారు.
- పూనా నేటివ్ ఇన్స్టిట్యూషన్ సంస్థను వామన్ ప్రభాకర్ భావే, లక్ష్మణ్ నర్హర్ సాయంతో స్థాపించారు.
- ఈ సంస్థే తర్వాత మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీగా రూపుదిద్దుకుంది.
- సాయుధ పోరాటంలో భాగంగా ఇతను దోపిడీ చేసిన ప్రాంతం- ధామరి (పుణె)
- ఇతన్ని హైదరాబాద్ నిజాం 1879లో అరెస్ట్ చేసి బ్రిటిష్ వారికి అప్పజెప్పగా, బ్రిటిష్ వారు తదనంతరం యెమెన్‌కు తరలించగా 1883, ఫిబ్రవరి 17న ‘ఆడెన్’ జైలులో మరణించారు.
చాపేకర్ సోదరులు - వీరిలో ముఖ్యులు దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్, వాసుదేవ్ చాపేకర్
- వీరు 1883లో హిందూ ధర్మ సంరక్షణి సభను నిర్వహించారు.
- మహారాష్ట్రలో 1896లో బ్యుటోనిక్ ప్లేగ్ వ్యాధి వ్యాప్తి చెందగా దాని నివారణకు వాల్టర్ చార్లెస్ రాండ్ కమిషన్‌గా పుణె ప్లేగు కమిషన్‌ను నియమించారు.
- ఇతనికి ఎస్కార్ట్‌గా అయెరెస్ట్ను నియమించారు. అయితే వీరు పునరావాస కార్యక్రమాలకు సరిగా స్పందించలేదు.
- దీంతో చాపేకర్ సోదరులు 1897, జూన్ 22న రాండ్, అయరెస్ట్లను పుణెలో హత్య చేశారు.
(రాజకీయ హత్యల్లో ఇది మొదటిది) - దీనికి చాపేకర్ సోదరులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
సావర్కర్ సోదరులు - వీరు గణేష్ దామోదర్ సావర్కర్, వినాయక దామోదర్ సావర్కర్, నారాయణ దామోదర్ సావర్కర్.
- 1899లో మిత్రమేళాను నాసిక్ కేంద్రంగా సావర్కర్ సోదరులు స్థాపించారు.
- ఇది ఒక రహస్య విప్లవ సంఘం (భారతదేశంలో మొదటి విప్లవ సంఘం).
- ఈ సంస్థను మాజిని యంగ్ ఇటలీని స్ఫూర్తిగా తీసుకొని 1907లో అభివన భారత్ సొసైటీగా గణేష్, వినాయక్ సావర్కర్ పేరు మార్చారు.
- లండన్‌లోని భారతీయ విద్యార్థులపై నిఘా అధికారిగా నియమితులైన కర్జన్ విల్లీ గణేష్ సావర్కర్‌పై రహస్య ఆయుధాల కేసులో రాజద్రోహం నేరం వాదించమని నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన జాక్సన్‌ను కోరారు.
- కర్జన్ విల్లీని 1909, జూలై 1న మదన్‌లాల్ థింగ్రా కాల్చి చంపారు. నారాయణ సావర్కర్‌ను 1909, నవంబర్ 9న బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ మింటోపై బాంబు విసిరాడనే నెపంతో శిక్షించింది.
- 1921, డిసెంబర్ 21న అభినవ భారత్ సభ్యుడైన అనంత లక్ష్మణ్ కాన్హేరే జాక్సన్‌ను ఔరంగాబాద్‌లో కాల్చి చంపారు.
- ఈ హత్య నాసిక్ కుట్ర కేసుగా ప్రసిద్ధి.
వీడీ సావర్కర్ (1883-1966)
- ఇతనికి ప్రేరణ కలిగించిన ఇటలీ సంస్థగా యంగ్ ఇటలీని పిలవగా, ప్రేరణ కలిగించిన ఉపన్యాసాలు తిలక్ ఉపన్యాసాలు.
- 1857 సిపాయిల తిరుగుబాటును ప్రథమ భారతీయ స్వాతంత్య్ర సమరంగా వర్ణించారు.
- లండన్‌లోని ఇండియా హౌస్‌లో 1907లో 1857 స్వర్ణోత్సవం నిర్వహించారు.
- ఈయన లండన్‌లో శ్యాంజీ కృష్ణవర్మ స్థాపించిన ఇండియా హౌస్‌లో ఉంటూ విప్లవ భావాలను ప్రచారం చేశారు.
- కర్జన్ విల్లీ, జాక్సన్ హత్య కేసుతో సంబంధం ఉందని బ్రిటిష్ అనుమానించడంతో 1909లో పారిస్ వెళ్లారు.
- 1910, మార్చి 13న తిరగి లండన్ రాగా, బ్రిటిష్ ప్రభుత్వం 38 మంది అభినవ భారత్ సభ్యులతో పాటు వీడీ సావర్కర్‌పై కేసు పెట్టింది. ఈ కేసు నాసిక్ కుట్ర కేసుగా ప్రసిద్ధి.
- 1910, మార్చి 22న ద్వీపాంతర శిక్షను విధించి అండమాన్ జైలుకు, తరువాత రత్నగిరి జైలుకు పంపారు.
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉన్నప్పుడు జైలు గోడలపై భారతదేశ చరిత్రను లిఖించారు. 1921లో జైలు నుంచి విడుదలయ్యారు.
- 1938లో అఖిల భారత హిందూ మహాసభకు అధ్యక్షుడయ్యారు. హిందూ భావజాలం ప్రచారం చేసినందుకు ఇతన్ని హిందూత్వ పితామహుడు అంటారు.
- ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, బయోగ్రఫీ ఆఫ్ జోసెఫ్ మాజిని, హిజ్ పాలిటిక్స్ అనే గ్రంథాలను రాశారు.
- ది హిందుత్వ: హూ ఈజ్ హిందూ? అనే కరపత్రికను ప్రచురించారు.
మాదిరి ప్రశ్నలు
1. విప్లవోద్యమాల పితామహుడిగా పేరుపొందింది?
1) వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే
2) పులిన్ బిహారీ దాస్
3) అరబిందో ఘోష్ 4) సూర్యసేన్
2. ‘బెంగాల్ వలంటీర్స్’ సంస్థతో సంబంధం కలవారు?
1) దినేష్ చంద్రగుప్తా 2) బాదల్ గుప్తా
3) బినయ్ బసు 4) అందరూ
3. ‘ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ’ని 1930లో స్థాపించింది?
1) సుభాష్ చంద్రబోస్ 2) సూర్యసేన్
2) ప్రమోద్ మిట్టల్
4) చంద్రశేఖర్ ఆజాద్
4. ‘నీ జీవితాన్ని ఇస్తూ, మరొక జీవితాన్ని ముందుకు తీసుకెళ్లు’ అనే నినాదం ఇచ్చింది?
1) బరీంద్ర కుమార్ ఘోష్
2) అరబిందో ఘోష్
3) వాసుదేవ బల్వంత్ ఫాడ్కే
4) భగత్ సింగ్
5. ‘భవాని మందిర్’ అనేది ఏ రహస్య సంఘ పవిత్ర గ్రంథంగా భావించారు?
1) యుగాంతర్ సమితి
2) బెంగాల్ వలంటీర్స్
3) అనుశీలన్ సమితి 4) మిత్రమేళా
6. 1883లో ‘హిందూ ధర్మ సంరక్షణి సభ’ను నిర్వహించింది?
1) చాపేకర్ సోదరులు
2) సావర్కర్ సోదరులు
3) దత్తా సోదరులు 4) అందరూ
7. భారతదేశంలో మొదటి విప్లవ సంఘంగా భావించబడుతుంది?
1) అనుశీలన్ సమితి 2) మిత్రమేళా
3) అభినవ భారత్ 4) ఆనంద్ మఠ్
8. లండన్‌లో ‘ఇండియా హౌస్’ను స్థాపించి విప్లవ భావాలను ప్రచారం చేసింది ఎవరు?
1) శ్యాంజీ కృష్ణ వర్మ
2) లాలా హరదయాళ్
3) లాలా లజపతిరాయ్
4) రాంప్రసాద్ బిస్మిల్
9. కింది వాటిలో సరైనవి?
1) బెంగాల్లో మొదటి రహస్య సంఘంగా ‘అనుశీలన్ సమితి’ భావించబడుతుంది
2) కలకత్తా కేంద్రంగా ప్రమథనాథ్ మిత్ర సహకారంతో సతీష్ బసు దీన్ని స్థాపించారు
3) దీనికి అనుబంధంగా పులిన్ దాస్ ఢాకాలో అనుశీలన్ సమితిని స్థాపించారు
4) పైవన్నీ
10. ‘ది హిందుత్వ: హూ ఈజ్ హిందూ? అనే కరపత్రికను ప్రచురించింది?
1) గణేష్ సావర్కర్
2) వినాయక్ సావర్కర్
3) బాలగంగాధర్ తిలక్
4) అనీ బీసెంట్
11. బెంగాల్‌లోని మిడ్నాపూర్ కేంద్రంగా 1902 లో జతింద్రనాథ్ బసు, సత్యేంద్రనాథ్ బసు స్థాపించిన సంస్థ?
1) ఆనంద్ మఠ్
2) బెంగాల్ వలంటీర్స్
3) యుగాంతర్ సమితి
4) అనుశీలన్ సమితి
12. ఎవరి సాయుధ పోరాటాల గురించి బంకించంద్ర చటర్జీ తన ఆనంద్ మఠ్ నవలలో పేర్కొన్నారు?
1) చంద్రశేఖర్ ఆజాద్
2) భగత్ సింగ్
3) వాసుదేవ్ బలవంత్ ఫాడ్కే
4) సూర్యసేన్
13. బాలశ్రీ హరిద్వార్ ఏ ద్వయాన్ని విప్లవోద్యమానికి జంట దేవతలుగా వర్ణించారు?
1) బరీంద్ర కుమార్ ఘోష్- అరబిందో ఘోష్
2) వినాయాక దామోదర్ సావర్కర్ – లాలా హరదయాళ్
3) బాదల్ గుప్తా – బినయ్ గుప్తా
4) అందరూ
సమాధానాలు
1-1, 2-4, 3-2, 4-1,
5-3, 6-1, 7-2, 8-1,
9-4, 10-2, 11-1, 12-3,
13-2.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు