Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.. రేపే చివరితేదీ
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.SDSC SHAR Recruitment | షార్ శ్రీహరికోటలో 94 పోస్టులు
ISRO SDSC SHAR Recruitment 2023 | సినిమాటోగ్రఫీ, ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కెమికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్ తదితర విభాగాలలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 94
పోస్టులు : టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్
విభాగాలు: సినిమాటోగ్రఫీ, ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: పోస్టులను బట్టి రూ.600, రూ.1000
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 16
వెబ్సైట్ : www.shar.gov.in
2. FACT Recruitment | ఫ్యాక్ట్‌లో 74 పోస్టులు
FACT Recruitment 2023 | సేల్స్, ప్రాసెస్, హ్యూమర్ రిసోర్స్, సివిల్, ఫిట్టర్ కమ్ మెకానిక్ తదితర విభాగాలలో ఆఫీసర్, సీనియర్ మేనేజర్(Senior Managers), మేనేజ్మెంట్ ట్రెయినీ (Management Trainees), టెక్నీషియన్, క్రాప్ట్స్మ్యాన్, సానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (The Fertilisers And Chemicals Travancore Limited) (ఫ్యాక్ట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 74
పోస్టులు : సీనియర్ మేనేజర్, ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రెయినీ, టెక్నీషియన్, క్రాప్ట్స్మ్యాన్, సానిటరీ ఇన్స్పెక్టర్ తదితరాలు.
విభాగాలు: సేల్స్, ప్రాసెస్, హ్యూమర్ రిసోర్స్, సివిల్, ఫిట్టర్ కమ్ మెకానిక్, ఎలక్ట్రికల్, మార్కెటింగ్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 26 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.19500 నుంచి రూ.2లక్షలు
ఎంపిక : పోస్టులను బట్టి సీబీటీ, ప్రాక్టికల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1180
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: మే 16
వెబ్సైట్ : http://fact.co.in/
3. UPSC CAPF ACs Recruitment | సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 322 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
UPSC CAPF ACs Recruitment 2023 | బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ తదితర దళాలలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2023 నోటిఫీకేషన్‌ను న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 322
పోస్టులు : బీఎస్ఎఫ్- 86, సీఆర్పీఎఫ్- 55, సీఐఎస్ఎఫ్- 91, ఐటీబీపీ- 60, ఎస్ఎస్బీ- 30
అర్హతలు : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు : 20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 16
దరఖాస్తు సవరణ తేదీలు: మే 17 నుంచి మే 23 వరకు.
వెబ్సైట్ : https://upsconline.nic.in/upsc/OTRP/
4.NIT Patna Recruitment | పట్నా నిట్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
NIT Patna Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన బీహార్ పట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITP) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్, డిస్క్రిప్టివ్, షార్ట్ ఆన్సర్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 19
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం : నెలకు రూ.9,300 నుంచి రూ.34,800.
దరఖాస్తు ఫీజు : రూ.400. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్, డిస్క్రిప్టివ్, షార్ట్ ఆన్సర్ టెస్ట్ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 16
వెబ్సైట్ : https://www.nitp.ac.in/
5. TISS Recruitment 2023 | టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
Tata Institute of Social Sciences Recruitment 2023 | సోషల్ సైన్సెస్, సైకాలజీ, ఆర్థిక శాస్త్రం, భూగోళశాస్త్రం, సామాజిక శాస్త్రం, పొలిటికల్ సైన్సెస్, లాంగ్వేజెస్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, స్లెట్, నెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి. పని అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 16 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 19
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు
విభాగాలు: సోషల్ సైన్సెస్, సైకాలజీ, ఆర్థిక శాస్త్రం, భూగోళశాస్త్రం, సామాజిక శాస్త్రం, పొలిటికల్ సైన్సెస్, లాంగ్వేజెస్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ తదితరాలు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, స్లెట్, నెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.2000
ఎంపిక : పని అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: మే 16
వెబ్సైట్ : https://tiss.edu/
అడ్రస్ : 2WV6+VXH, VN Purav Marg, Deonar, Chembur, Mumbai, Maharashtra 400088
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?