Home
Notifications
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా జరుగుతుంది?
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా జరుగుతుంది?
IDBI JAM Recruitment | డిగ్రీ పూర్తయ్యిందా ? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? భద్రమైన కొలువు, బ్యాంకింగ్ సెక్టార్లో స్థిరపడాలనుకుంటున్నారా అయితే ఈ సమాచారం మీ కోసమే. టెస్ట్ రాసి దానిలో ప్రతిభ చూపిస్తే చాలు మీకు కొలువు సొంతం. ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
ఐడీబీఐ
- 1964లో ప్రారంభమైన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో కాలాంతరంలో అనేక మార్పులు జరిగాయి. 2004, అక్టోబర్ 1 నుంచి ఐడీబీఐ బ్యాంకింగ్ కంపెనీగా మారింది. నాటి నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
మొత్తం ఖాళీలు: 600
- వీటిలో జనరల్-243, ఎస్సీ-90, ఎస్టీ-45, ఓబీసీ-162, ఈడబ్ల్యూఎస్-60 పోస్టులు ఉన్నాయి.
పోస్టులు: (Grade ‘O’ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
ఎవరు అర్హులు ?
- ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2023, ఆగస్టు 31 నాటికి 21- 25 ఏండ్ల మధ్య ఉండాలి.
నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ఇలా
- ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు
ఆన్లైన్ టెస్ట్
- ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది
- పరీక్షలో లాజికల్ రీజనింగ్ డాటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 ప్రశ్నలు-60 మార్కులు.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్- 40 ప్రశ్నలు- 40 మార్కులు.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు- 40 మార్కులు.
- జనరల్ అవేర్నెస్/బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 60 ప్రశ్నలు- 60 మార్కులు.
- పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
- పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.
- ఆన్లైన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు
- ఇంటర్వ్యూకు 100 మార్కులు
- తుది ఎంపిక ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు
చదువు+శిక్షణ
- ఎంపికైన అభ్యర్థులకు మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు. ఈ కోర్సులో ప్రవేశాలు కల్పించి ఆరునెలలపాటు తరగతి పాఠాలు, రెండు నెలల ఇంటర్న్షిప్, నాలుగు నెలల జాబ్ ట్రెయినింగ్ ఇస్తారు.
- ఈ కోర్సు పూర్తి చేసుకున్నవారికి ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని ఇస్తారు.
- కోర్సు ఫీజు కింద రూ.మూడులక్షలు చెల్లించాలి. ఫీజుకు సంబంధించి వాయిదాల పద్ధతి, లోన్ సౌకర్యం కూడా ఐడీబీఐ కల్పిస్తుంది.
- శిక్షణ కాలంలో మొదటి ఆరునెలలు నెలకు రూ.ఐదువేలు, ఇంటర్న్షిప్ సమయంలో నెలకు పదిహేను వేలు, శిక్షణ పూర్తిచేసుకున్నవారికి వార్షిక వేతనం రూ.6.14 లక్షల నుంచి 6.50 లక్షల వరకు ఇస్తారు.
ముఖ్య తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 30
ఆన్లైన్ టెస్ట్ తేదీ: అక్టోబర్ 20
వెబ్సైట్: https://www.idbibank.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?