EPFO Recruitment | ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు
EPFO SSA Recruitment 2023 | న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి జాతీయ పరీక్షల సంస్థ (National Testing Agency) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్, హిందీలో కంప్యూటర్ టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 2674 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27 ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 2674
పోస్టులు : సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్. (ఏపీలో 39, తెలంగాణలో 116 ఖాళీలు)
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్, హిందీలో కంప్యూటర్ టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు 10-15 ఏండ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3-8 ఏండ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం : నెలకు రూ.29,200 నుంచి రూ.92,300.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పరీక్ష విధానం : ఆబ్జెక్టివ్ పరీక్ష 600 మార్కులకు ఉంటుంది. 2 గంటల్లో పూర్తిచేయాలి. పరీక్షలో జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్, కంప్యూటర్ లిటరసీపై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు : రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరితేదీ : ఏప్రిల్ 26
వెబ్సైట్: http://recruitment.nta.nic.in & www.epfindia.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?