EPFO Recruitment | ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్ పోస్టులు
EPFO Stenographer Recruitment 2023| న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్(గ్రూప్ సి)(Stenographer) పోస్టుల భర్తీకి జాతీయ పరీక్షల సంస్థ (National Testing Agency) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ టైపింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఈ ప్రకటన ద్వారా మొత్తం 185 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27 ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 185
పోస్టులు : స్టెనోగ్రాఫర్(గ్రూప్ సి)
అర్హతలు : ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ టైపింగ్ అనుభవం
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు 10-15 ఏండ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3-8 ఏండ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం : నెలకు రూ.25,500 నుంచి రూ.81,000.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పరీక్ష విధానం : ఆబ్జెక్టివ్ పరీక్ష 800 మార్కులకు ఉంటుంది. 2 గంటల 10 నిమిషాల్లో పూర్తిచేయాలి. పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు : రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 27
చివరితేదీ : ఏప్రిల్ 26
వెబ్సైట్: http://recruitment.nta.nic.in & www.epfindia.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






