Economy | వస్తు సేవల పద్ధతి.. వ్యవస్థీకరించుకునే విధానం
ఆర్థిక వ్యవస్థ- రంగాలు
- ఒక దేశంలో/సమాజంలో వస్తు సేవల ఉత్పత్తి కోసం లభ్యమయ్యే వనరులను సమర్థంగా కేటాయించి వస్తు సేవలను ఉత్పత్తి చేసి పంపిణీ చేసే పద్ధతిని ఆర్థిక వ్యవస్థ అంటారు.
- ప్రజలు తమ కోరికలను తృప్తి పరుచుకోవటానికి తమను తాము ఏ విధంగా వ్యవస్థీకరించుకుంటారో ఆ విధానాన్ని ఆర్థిక వ్యవస్థ అంటారు.
- దేశంలో వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీలను ఎవరు నిర్వహించాలో నిర్ణయించే పద్ధతినే ఆర్థిక వ్యవస్థ అంటారు.
- ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, వాటిని ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనే విధానపరమైనటువంటి నిర్ణయాల సారాంశమే ఆర్థిక వ్యవస్థ.
ఆర్థిక వ్యవస్థ- రంగాలు - సాధారణంగా ప్రపంచంలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా స్థూలంగా మూడు రకాల రంగాలతో పని చేస్తుంది.
1. ప్రాథమిక రంగం
2. ద్వితీయ రంగం
3. తృతీయ రంగం
1. ప్రాథమిక రంగం
- ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు, కుటుంబాలు, ప్రభుత్వ సంస్థలు, సహజవనరుల సేకరణ కోసం చేసే ఆర్థిక కార్యక్రలాపాలను అన్నింటిని కలిపి ప్రాథమిక రంగం అంటారు.
- ఈ ప్రాథమిక రంగంలో ప్రధానంగా నాలుగు ఉప రంగాలు కూడా ఉన్నాయి.
ఎ. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అనుబంధ రంగాలు అంటే కోళ్ల పెంపకం, తోటల పెంపకం, పశువుల పెంపకం
బి. అటవీ ఉత్పత్తులు (అడవులు, పండ్ల తోటలు, పూల తోటలు)
సి. మత్స్య పరిశ్రమ (చేపల పెంపకం, రొయ్యల పెంపకం)
డి. మైన్స్, క్వారీస్ - ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం అని కూడా అంటారు.
- ప్రాథమిక రంగం నుంచి మైన్స్, క్వారీస్లను మినహాయించి మిగిలిన మూడు ఉప రంగాలను కలిపి వ్యవసాయ రంగం అంటారు.
- ప్రాథమిక రంగంలో ప్రధాన భాగమైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రాధాన్యం కలిగి ఉంది.
- వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే ఇతర రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఉదా: వ్యవసాయ రంగం ఇతర రంగాలకు అవసరమైన ఉత్పాదితాలను మౌలిక అవసరాలను/సౌకర్యాలను అందిస్తుంది. ఉదా: ముడి పదార్థాలు.
- వ్యవసాయ రంగం ఇతర రంగాల్లోని వస్తు సేవల ఉత్పత్తి కొనుగోలులోను వ్యాపారంలోను, ఎగుమతి, దిగుమతి వస్తువుల్లో కూడా వ్యవసాయమే ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగం అని కూడా అంటారు.
- ప్రాథమిక కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులను వృద్ధి స్వభావం కారణంగా రెడ్ కాలర్ ఉద్యోగులుగా సూచిస్తారు.
- అంతేకాకుండా జాతీయాదాయంలో 50% లేదా అంతకంటే ఎక్కువ వాటా వ్యవసాయ రంగం నుంచే లభిస్తుంది. కాబట్టి దీన్ని వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ అంటారు.
2.ద్వితీయ రంగం
- ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తువుల ఉత్పత్తి, తయారీతో సంబంధం కలిగిన రంగాన్ని ద్వితీయ రంగం అంటారు.
- ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు, కుటుంబాలు, ప్రభుత్వం, సంస్థలు మొదలైనవి ప్రాథమిక రంగం నుంచి సేకరించిన సహజ వనరులను ముడి పదార్థాలుగా ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం చేసే వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలను కలిపి ద్వితీయ రంగం అంటారు.
- ద్వితీయ రంగంలో ప్రధానంగా మూడు ఉప రంగాలు ఉంటాయి.
ఎ. పరిశ్రమలు (భారీ, మధ్య తరహా, చిన్న తరహా, కుటీర, లఘు పరిశ్రమలు)
బి. తయారీ రంగం, నిర్మాణ రంగం. తయారీ రంగంలో (వస్తువులు) రిజిస్టర్ చేసిన తయారీ రంగం, రిజిస్టర్ కాని తయారీ రంగం అని రెండు రంగాలుంటాయి. నిర్మాణ రంగంలో (కట్టడాలు) గ్రామీణ నిర్మాణ రంగం, పట్టణ నిర్మాణ రంగం అని రెండు రంగాలుంటాయి.
సి. విద్యుత్, గ్యాస్, నీటి పారుదల/సరఫరా సౌకర్యాలు - ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగం అని కూడా అంటారు. ద్వితీయ రంగంలో ప్రస్తావించిన అంశాల్లో పరిశ్రమలు ప్రధానమైనవి. కాబట్టి దీన్ని పారిశ్రామిక రంగం అంటారు.
- ప్రాథమిక రంగంలోని మైన్స్, క్వారీస్లను ద్వితీయ రంగానికి కలుపగా వచ్చే రంగాన్ని పారిశ్రామిక రంగం అంటారు.
- వ్యవసాయ రంగం సహకారంతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందినప్పటికీ తిరిగి వ్యవసాయ రంగానికి అవసరమైన ఆధునిక ఉత్పాదకాలను పారిశ్రామిక రంగం అందిస్తుంది. అంటే వ్యవసాయ అభివృద్ధికి పారిశ్రామిక రంగం ఇంజిన్ లాగా పని చేస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం పరస్పర ఆధారితమైనవి.
- ద్వితీయ రంగ కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ‘బ్లూ కాలర్ ఉద్యోగులు’గా పేర్కొంటారు.
- జాతీయాదాయంలో 50% లేదా అంతకంటే ఎక్కువ వాటా పారిశ్రామిక రంగం నుంచి వస్తే దాన్ని ‘ఇండస్ట్రియల్ ఎకానమీ’ అంటారు.
తృతీయ రంగం
- ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు, కుటుంబాలు, ప్రభుత్వం, సంస్థలు సేవలను ఉత్పత్తి చేయడానికి చేసే అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలను కలిపి తృతీయ రంగం అంటారు.
- ప్రపంచంలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా ప్రత్యక్షంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
- తృతీయ రంగంలో ప్రధానంగా కింది ఉప రంగాలు ఉంటాయి.
- ఎ. రవాణా, బ్యాంకింగ్, బీమా, సమాచారం, రక్షణ, పరిపాలన
- బి. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యాపారం
- సి. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, స్థిరాస్తి వ్యాపారం, హోటళ్లు, సినిమాలు
- తృతీయ రంగాన్ని సేవారంగం అని కూడా అంటారు.
- సేవా రంగంలో ప్రస్తావించిన అంశాలన్నీ సేవా దృక్పథం కలిగి ఉన్నాయి. కాబట్టి దీన్ని సేవా రంగం అంటారు.
- సేవా రంగాన్ని గౌణ రంగం అని కూడా అంటారు. జాతీయాదాయంలో 50% లేదా అంతకంటే ఎక్కువ సేవారంగం నుంచి వస్తే దాన్ని ‘సెర్విస్ ఎకానమీ’ అంటారు.
- తృతీయ రంగ కార్యకలాపాల్లో వారిని ‘వైట్ కాలర్ ఉద్యోగులు’ అంటారు.
ఇతర రంగాలు - చతుర్భుజి రంగం: విద్య, నైపుణ్యం, పరిశోధన, అభివృద్ధి మొదలగు అంశాలకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాలను అన్నింటిని కలిపి Quaternary Sector అంటారు. దీన్నే Knowledge Sector అని కూడా అంటారు.
- మానవ వనరుల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర వహిస్తుంది.
- Quinary Sector : ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ పరమైన అత్యున్నతమైన నిర్ణయాలను తీసుకునే ఆర్థిక కార్యకలాపాలన్నింటిని కలిపి Quinary Sector అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. దేశంలో వస్తుసేవల ఉత్పత్తి పంపిణీలను ఎవరు నిర్వహించాలో నిర్ణయించే పద్ధతిని ఏమంటారు?
ఎ. ఆర్థిక వ్యవస్థ బి. ఆర్థిక రంగం
సి. ఆర్థిక సంస్థ డి. ఆర్థిక పరిశ్రమ
2. ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఎన్ని రంగాలు ఉంటాయి?
ఎ. 2 బి. 3 సి. 4 డి. 5
3. ప్రాథమిక రంగానికి మరొక పేరు?
ఎ. గౌణ రంగం బి. వ్యవసాయ రంగం
సి. తృతీయ రంగం డి. సేవా రంగం
4. అటవీ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ ఏ రంగం కిందకు వస్తాయి?
ఎ. ప్రాథమిక రంగం బి. ద్వితీయ రంగం
సి. తృతీయ రంగం డి. పైవన్నీ
5. ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తువుల తయారీతో సంబంధం ఉన్న రంగం ఏది?
ఎ. ప్రాథమిక రంగం బి. ద్వితీయ రంగం
సి. తృతీయ రంగం డి. సేవా రంగం
6. తృతీయ రంగానికి మరొక పేరు?
ఎ. సేవా రంగం బి. టెరిటరీ రంగం
సి. గౌణ రంగం డి. పైవన్నీ
7. విద్యుత్, గ్యాస్ ఏ రంగానికి సంబంధించినవి?
ఎ. వ్యవసాయ రంగం
బి. పారిశ్రామిక రంగం
సి. సేవా రంగం డి. పైవన్నీ
8. ప్రాజెక్టుల నిర్మాణం ఏ రంగానికి చెందినది?
ఎ. ప్రాథమిక రంగం
బి. ద్వితీయ రంగం
సి. తృతీయ రంగం డి. పైవన్నీ
9. ప్రాథమిక రంగంలోని గనులు, తవ్వకాలను ద్వితీయ రంగంలో కలుపగా ఏర్పడే రంగాన్ని ఏమంటారు?
ఎ. వ్యవసాయ రంగం
బి. పారిశ్రామిక రంగం
సి. సేవా రంగం డి. గౌణ రంగం
10. కింది వాటిలో సేవా రంగానికి చెందనిది?
ఎ. స్థిరాస్తి వ్యాపారం బి. సినిమా
సి. రక్షణ డి. గనులు
11. వ్యవసాయాభివృద్ధికి ఇంజిన్ లాంటిది ఏది?
ఎ. పారిశ్రామిక రంగం
బి. సేవా రంగం
సి. గౌణ రంగం డి. పైవేవీకాదు
12. విద్య, వైద్యం, ఆరోగ్యం ఏ రంగానికి చెందినవి?
ఎ. ప్రాథమిక రంగం
బి. పారిశ్రామిక రంగం
సి. గౌణ రంగం డి. పైవన్నీ
13. జాతీయాదాయంలో 50% లేదా అంతకంటే ఎక్కువ వాటా వ్యవసాయ రంగం నుంచి లభిస్తే దాన్ని ఏమంటారు?
ఎ. వ్యవసాయ రంగం
బి. వ్యవసాయ వ్యవస్థ
సి. వ్యవసాయ ఆధారిత వ్యవస్థ
డి. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ
14. ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరమైన నిర్ణయాలను తీసుకునే ఆర్థిక కార్యకలాపాలన్నింటిని కలిపి ఏమంటారు?
ఎ. Quaternary sector
బి. Knowledge sector
సి. Quinary sector డి. పైవన్నీ
15. చతుర్భుజి రంగానికి మరొక పేరు?
ఎ. Quinary sector
బి. Knowledge sector
సి. Quaternary sector
డి. బి, సి
16. కోళ్ల పెంపకం, చేపల పెంపకం, రొయ్యల పెంపకం, తోటల పెంపకం ఏ రంగానికి చెందినవి?
ఎ. ప్రాథమిక రంగం బి.ద్వితీయ రంగం
సి. గౌణ రంగం డి. సేవా రంగం
17. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, బీమా, సమాచారం ఏ రంగానికి చెందినవి?
ఎ. వ్యవసాయ రంగం
బి. పారిశ్రామిక రంగం
సి. తృతీయ రంగం డి. ద్వితీయ రంగం
18. వ్యవసాయ, పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడే రంగం?
ఎ. గౌణ రంగం బి. తృతీయ రంగం
సి. సేవా రంగం డి. పైవన్నీ
19. పరిపాలన, వ్యాపారం అనేవి ఏ రంగానికి చెందినవి?
ఎ. వ్యవసాయ రంగం
బి. పారిశ్రామిక రంగం
సి. సేవా రంగం డి. పైవన్నీ
20. నీటి సరఫరా ఏ రంగానికి చెందినది?
ఎ. వ్యవసాయ రంగం
బి. పారిశ్రామిక రంగం
సి. సేవా రంగం డి తృతీయ రంగం
సమాధానాలు
1. ఎ 2. బి 3. బి 4. ఎ
5. బి 6. డి 7. బి 8. బి
9. బి 10. డి 11. ఎ 12. సి
13. డి 14. సి 15. డి 16. ఎ
17. సి 18. డి 19. సి 20. బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?