బ్యాంకు కొలువు.. ఇలా గెలువు
ఐబీపీఎస్ పీవో-XII-2022
ఐబీపీఎస్ ద్వారా నిర్వహించే బ్యాంకు పరీక్షలకు వరుస నోటిఫికేషన్లు వెలువడుతు న్నాయి. ఇదివరకే ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకు, క్లరికల్ పరీక్షలకు ప్రకటన విడుదల చేసింది ఐబీపీఎస్ సంస్థ. తాజాగా బ్యాంకు పీవో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 6,932 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఐబీపీఎస్ వెబ్సైట్ ibps.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకుల్లో పీవో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల ఎంపికకు ఐబీపీఎస్, కామన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తుంది. బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలనే అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. ఈ పరీక్షలో బ్యాంకు ఉద్యోగానికి కావలసిన అర్హతలు, వయస్సు, ఫీజు, ఎంపిక ప్రక్రియతో పాటు ప్రిపరేషన్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా బ్యాంకు పరీక్షలు రెండు లేదా మూడు అంచెల్లో ఉంటుంది. ప్రొబేషనరీ ఆఫీసర్ల పరీక్ష మూడంచెల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూగా ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని మెయిన్స్‌కు అర్హులుగా నిర్ధారిస్తారు. ఈ రెండు దశలు అక్టోబర్ – డిసెంబర్ 2022లో ఉంటుంది. చివరి దశ అయిన ఇంటర్వ్యూ జనవరి/ ఫిబ్రవరి 2023లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు నిర్వహిస్తారు.
మొత్తం 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐబీపీఎస్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. 2022లో కేవలం 6 బ్యాంకుల్లో 6932 ఖాళీలను ప్రకటించారు. ఇంకా 5 బ్యాంకులు తమ ఖాళీలను రెండు నెలల్లోగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఖాళీల సంఖ్య 10,000 పైగా ఉండనుంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే పీవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించాలి.
ప్రిపరేషన్ ప్లాన్
-బ్యాంకు ఉద్యోగ అభ్యర్థులు తాము అప్లె చేసిన పరీక్షకు అనుగుణంగా సిలబస్, సెక్షన్ల వారీగా ముఖ్యమైన అంశాలు, పరీక్షా సరళి వంటి వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. బ్యాంకు పరీక్షలకు వందశాతం కచ్చితత్వాన్ని అవలంబించాలి. ప్రిలిమ్స్/మెయిన్స్‌లో ముఖ్యమైన అంశాలను బాగా అవపోసన చేయాలి. సమయానికి అనుగుణంగా మనకు అనుకూలమైన ఎక్కువ మార్కులు కలిగిన అంశాలపై ఫోకస్ పెట్టి చదవాలి. సంప్రదాయ పద్ధతులతో పాటు స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్లను అమలు చేయాలి.
అంశాల వారీగా ఇలా ప్లాన్ చేసుకోండి
1. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఇందులో అర్థమెటిక్, న్యూమరికల్ ఎబలిటీస్, ఆప్టిట్యూడ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు దశల్లో ఈ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో చాప్టర్ వారీ మోడల్ పేపర్లు, బిట్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. బ్యాంకు పరీక్షలో విజయం సాధించాలంటే ముందుగా అర్థమేటిక్, రీజనింగ్‌లో పట్టు సాధించాలి. అయితే ఒక ప్రణాళిక ప్రకారం సాధన చేస్తే అభ్యర్థులకు సిలబస్, ముఖ్యమైన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. సాధారణంగా మనకు కావలసిన 80 శాతం మార్కుల అంశాలు 5-6 చాప్టర్లలోనే ఉంటాయి. వాటిని గుర్తించి చదివితే సరిపోతుంది. ఇక్కడ నూరు శాతం కచ్చితత్వ పాలసీని పాటించాలి. 5-6 చాప్టర్లు ప్రధాన భాగాన్ని కవర్ చేస్తాయి.
# అవి. డేటా ఇంటర్‌ప్రిటేషన్- 15 నుంచి 20 ప్రశ్నలు
# క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్- 4 నుంచి 5 ప్రశ్నలు
#సింప్లిఫికేషన్- 4 నుంచి 5 ప్రశ్నలు
# అర్థమెటిక్స్- 10 నుంచి 15 ప్రశ్నలు
-ఒక చాప్టర్ నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అంశాలపై ఫోకస్ చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించ వచ్చు. అర్థమెటిక్స్ అంశాలు- రేషియో, ప్రపోర్షన్స్, శాతాలు, సరాసరి, వడ్డీలు, వయస్సు, ప్రాబబులిటీ వంటి కూడా ప్రాక్టీస్ చేయాలి.
2. రీజనింగ్ విభాగం: ఈ విభాగం కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ కామన్‌గా వెలువడే విభాగం. బ్యాంక్ పీవో మెయిన్స్‌లో ఈ విభాగాన్ని కంప్యూటర్ విభాగంతో జోడించి 45 ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగం పరిష్కరించడానికి అభ్యుర్థులకు 60 నిమిషాల మిశ్రమ సమయాన్ని కేటాయిస్తారు. రీజనింగ్ విభాగం అభ్యర్థుల సమస్య పరిష్కార- నైపుణ్యాలను అభ్యసించడం వంటి వాటిపై ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్ నుంచి కూడా కామన్ టాపిక్స్‌ను గుర్తించి చదవాలి. పజిల్స్/సీటింగ్ అరెంజ్ మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ టెస్ట్, ర్యాంకింగ్, ఆల్ఫాబెట్ లెటర్, సిరీస్ మొదలైన అంశాలు ప్రాక్టీస్ చేయాలి. ప్రశ్నలు, మార్కులను బట్టి అంశాలను ఎంచుకొని మెరిట్ మార్కులు సాధించేలా ప్రణాళిక వేసుకోవాలి.
ముఖ్యమైన రీజనింగ్ ఎబిలిటీ అంశాలు
1. పజిల్స్/సీటింగ్ అరెంజ్మెంట్స్ (లేనియర్, సర్క్యులర్, స్కేల్, పైచార్టు)- 12 నుంచి 18 ప్రశ్నలు
2. ఇన్పుట్-అవుట్‌పుట్ – 5 నుంచి 6 ప్రశ్నలు
3. కోడింగ్-డీకోడింగ్ – 5 నుంచి 6 ప్రశ్నలు
4. సిరీస్ – 5 నుంచి 10 ప్రశ్నలు
5. సిలజిజం- 4 నుంచి 5 ప్రశ్నలు
6. రక్త సంబంధాలు- 3-5 ప్రశ్నలు
బ్యాంకు పీవో లెవల్ రీజనింగ్ కఠినంగా ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేస్త్తే ఈ విభాగం నుంచి స్కోరింగ్‌కు ఉపయోగపడుతుంది. మీ బలాలు, బలహీనతలను అంచనా వేసి, సమయం అనుగుణంగా వ్యూహం ప్రకారం సాధన చేయాలి. ఇవి మీరు పరీక్ష సమయం లో క్రమశిక్షణానుసారంగా ప్రశ్నలను సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
-రీజనింగ్‌లో మంచి మార్కులు సాధించడం కోసం టాపిక్ వారీగా అంశాలను, మోడల్స్‌ను గుర్తించడం.
-రీజనింగ్ పూర్వ ప్రశ్న పత్రాలను బాగా చదవాలి.
-రీజనింగ్ క్విజ్లు, మాక్‌టెస్టులు, ఆన్లైన్లో నే ప్రాక్టీస్ చేయాలి.
– ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడిగా సాధన చేయాలి.
-మెయిన్స్‌లో హెచ్చుస్థాయి ప్రశ్నలు అధికం కాబట్టి కాలనిర్నిత ప్రాక్టీస్ టెస్ట్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
– రీజనింగ్‌లో రీడింగ్, కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల సమయ పాలన పాటించండి.
– నిరంతరం ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందవచ్చు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
– బ్యాంక్ పరీక్షలు ఇంగ్లిష్‌లో ఉంటాయి. అన్ని విభాగాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. ఇంగ్లిష్ విభాగం బ్యాంక్ పీవో పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. ఇందులో కూడా ఉత్తీర్ణత మార్కులకు ఉపయోగపడే టాపిక్స్‌ను ఎంచుకొని చదవాలి. ప్రిలిమ్స్/ మెయిన్స్‌కు కామన్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ విభాగాన్ని కూడా ఎక్కువ మార్కులు పొందడానికి ఉపయోగించుకోవాలి.
ఇంగ్లిష్ విభాగాన్ని గ్రామర్/ నాన్-గ్రామర్ పార్ట్‌గా వేరుచేసుకొని చదవాలి. 70శాతం ప్రశ్నలు నాన్ గ్రామర్ నుంచి వస్తాయి. వాటిని గుర్తించి ప్రాక్టీస్ చేయాలి. అవి.
రీడింగ్ కాంప్రహెన్షన్స్- 10-15 ప్రశ్నలు
క్లోజ్డ్ టెస్ట్ – 5 ప్రశ్నలు
సెంటెన్స్ కరెక్షన్స్- 5 ప్రశ్నలు
రీ అరెంజ్మెంట్స్- 5 ప్రశ్నలు
నొకాబులరీ- 5 ప్రశ్నలు
– సాధారణంగా బ్యాంక్ పరీక్షల్లో ఇంగ్లిష్ విభాగం కచ్చితంగా ఉంటుంది. మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు ప్రతిరోజు రెండు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి.
– ఇంగ్లిష్ విభాగంపై పట్టు సాధించడం కోసం..
– ప్రతిరోజు ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్ చదవాలి.
– ఇంగ్లిష్ వార్తలు వినాలి.
– అనువాద డిక్షనరిని అనుసరించాలి.
-సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
– పూర్వ ప్రశ్న పత్రాలను బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా 50శాతం ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది.
కంప్యూటర్ నాలెడ్జ్
-ఈ విభాగం కేవలం మెయిన్స్‌లో మాత్రమే ఉంటుంది. రీజనింగ్‌తో కలిపి మిశ్రమ ప్రశ్నలు, మార్పులు కలిగి ఉంటాయి. ఇందులో 15-20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులకు స్కోరింగ్ విభాగంగా ఉపయోగపడుతుంది.
-బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్‌తో పాటు అధునా తన టెక్నాలజీ ఈ విభాగానికి కీలకం.
-కంప్యూటర్స్ బేసిక్స్, జనరేషన్, పరిణామక్రమం, M.S Office, డేటా బేస్, వైరస్, బ్యాంకింగ్ వ్యవస్థలో కంప్యూటర్ల వాడకం, సాఫ్ట్వేర్స్, టచ్స్క్రిన్స్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వ్యవహారాలు, బ్యాంక్ యూజర్ యాప్స్.
జనరల్ అవేర్నెస్
-ఈ విభాగం మెయిన్స్‌లో మాత్రమే వచ్చే అంశాలు. ఇందులో బ్యాంకింగ్, ఆర్థిక రంగం, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
– 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. బ్యాంకుల రుణాలు, వినియోగదారులు, వడ్డీరేట్లు, ఆర్బీఐ కీ పాలసీ రేట్లు, బ్యాంకుల విలీనాలు, విధి విధానాలు, బ్యాంకుల సదస్సులు, కమిటీలు, ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసే సిఫారసులు, జీఎస్టీ, 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, నీతి ఆయోగ్, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కరోనా వ్యాక్సిన్స్, మంకీపాక్స్ గురించి, 5 రాష్ట్రాల ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, జాతీయపార్కులు, పుస్తకాలు, రచయితలు ముఖ్యమైన రోజులు.
– క్రీడలు- (ఒలింపిక్స్ 2021-జపాన్) కామన్వెల్త్ క్రీడలు, ఐపీఎల్, ప్రపంచ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, ఖేలో ఇండియా క్రీడలు తదితరాలు.
అవార్డులు- పద్మ, దాదాసాహెబ్‌పాల్కే, నోబెల్, సాహిత్య అవార్డుల గురించి చదవాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: ఆగస్టు 22
వయస్సు: 20-30 మధ్య ఉండాలి.
అర్హతలు: డిగ్రీ (22/08/2022 వరకు పూర్తిచేసి ఉండాలి)
ఫీజు: రూ.175/, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఇతరులు: రూ.850.
వెబ్సైట్: www.ibps.in
ప్రిలిమ్స్: అక్టోబర్ 2022
మెయిన్స్: నవంబర్/డిసెంబర్ 2022
ఇంటర్వ్యూ: జనవరి/ఫిబ్రవరి 2023
బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు
– బ్యాంక్ ఆఫ్ బరోడా- ప్రకటించ లేదు
– బ్యాంక్ ఆఫ్ ఇండియా- 535
– బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర-500
– కెనరా బ్యాంక్-2500
-సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఇంకా ప్రకటించ లేదు
-ఇండియన్ బ్యాంక్ – ప్రకటించ లేదు
– ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – ప్రకటించ లేదు
– పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 500
-పంజాబ్&సింధ్ బ్యాంక్-253
– యూకో బ్యాంక్-550
-యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 2094
– వీటిలో ఎస్సీ-1071, ఎస్టీ- 520,
-ఓబీసీ-1876, ఈడబ్ల్యూఎస్-666,
జనరల్-2799.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నల్లగొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, వరంగల్.
మెయిన్ పరీక్ష కేంద్రం: హైదరాబాద్
మధు కిరణ్
డైరెక్టర్, ఫోకస్ అకాడమీ
హైదరాబాద్
9030496929
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?