2910 కొత్త పోస్టులు
– ఆర్థికశాఖ అనుమతి.. 11 జీవోలు జారీ
– అతి త్వరలో నోటిఫికేషన్లు.. నిరుద్యోగులకు ప్రభుత్వం పండుగ కానుక
వినాయక చవితి పర్వదినం వేళ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పండుగ కానుక అందించింది. టీఎస్పీఎస్సీ ద్వారా మరో 2,910 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన 11 జీవోలను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు అనుమతి ఇచ్చిన పోస్టుల సంఖ్య 52,460కి పెరిగింది. తాజాగా అనుమతించిన 2,910 పోస్టుల్లో గ్రూప్-2 విభాగంలో 663, గ్రూప్-3 విభాగంలో 1,373 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికమంది పోటీపడే పోస్టులు ఇవే కావటంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
65 శాతం పోస్టుల భర్తీకి అనుమతి
రాష్ట్రంలో 91,142 ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ మార్చి 9వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేస్తామని, 11,103 పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఆ వెంట నే మార్చి 23వ తేదీ నుంచే వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వటం మొదలుపెట్టింది. మొదటి విడుతలోనే ఏకంగా 30 వేలకుపైగా పోస్టులకు అనుమతి ఇచ్చింది. వీటిలో గ్రూప్ -1కు సంబంధించి 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. సుమారు 17వేల పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు పరీక్షలు కూడా నిర్వహించారు. ఇప్పటి వర కు ఏడు విడుతల్లో 52,460 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసింది. ప్రకటించిన మొత్తం ఖాళీల్లో ఇవి 65 శాతం.
పోటాపోటీ
రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-3 కోసం విపరీతమైన పోటీ ఉన్నది. లక్షల మంది ఉద్యోగార్థులు ఏండ్లుగా ఈ పోస్టుల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుతున్నారు. ఎంతోమంది కోచింగ్ తీసుకొంటూ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. గ్రూప్-1 పోస్టులకు పోటీ పడలేని వారంతా గ్రూప్-2, గ్రూప్-3 కోసం వందశాతం శక్తియుక్తులను ఉపయోగించి కష్టపడుతుంటారు.
గ్రూప్ 2 : 663
గ్రూప్ 3 : 1,373
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?