కొత్త రికార్డు దిశగా టీఎస్ఎల్పీఆర్బీ
– ఈ నెల 28న ఏకంగా 6.5 లక్షల మందికి ప్రిలిమ్స్
ఈ నెల 28 నిర్వహించనున్న కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షతో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) కొత్త రికార్డు నమోదు చేయబోతున్నది. స్వరాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగార్థులకు పోటీ పరీక్ష నిర్వహించిన ఘనతను సొంతం చేసుకోనున్నది. గతంలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా 5.80 లక్షల మంది అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అంత పెద్ద సంఖ్యలో 6.5 లక్షలు మంది అభ్యర్థులు హాజరుకానున్న పరీక్షగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రికార్డు నెలకొల్పనున్నది. ఈ పరీక్షకు 1,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ వర్గాలు తెలిపాయి. పోలీ స్ శాఖలోని
మొత్తం 15,644 కానిస్టేబుల్ పోస్టులు, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకుగాను మొత్తం 6,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. వాస్తవానికి ఈ పరీక్షను ఈ నెల 21న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ 28కి వాయిదాపడింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ విధానంలోనే హాజరు తీసుకోనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?