Social Method | సోషల్ మెథడ్ గ్రాండ్ టెస్ట్
1) కింది వాటిలో ప్రశంస, సున్నితత్వం అనే అంశానికి సంబంధించింది?
1) స్లోగన్లు, పోస్టర్లు, పాంప్లెట్లు తయారు చేయడం
2) సభలు, సమావేశాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం
3) ప్రేమ, దయ, మానవ విలువలు అభివృద్ధి చేయడం
4) విద్యార్థి చిత్రాన్ని పరిశీలించి చర్చించడం
2. విద్యా ప్రమాణాల్లో చివరిది?
1) ప్రశంస, సున్నితత్వం
2) విషయ అవగాహన
3) సమాచార సేకరణ నైపుణ్యాలు
4) పట నైపుణ్యాలు
3. అండర్సన్ వర్గీకరణలో జ్ఞానం అనే అంశానికి సంబంధం లేనిది?
1) జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం
2) జ్ఞాన పరిమాణం
3) విశ్లేషణాత్మక జ్ఞానం 4) పైవన్నీ
4. ఎలిజబెత్ సింప్సన్ ఏ సంవత్సరంలో మానసిక చలనాత్మక రంగాన్ని పరిశోధించారు?
1) 1964 2) 1965 3) 1966 4) 1967
5. A Taxonomy of Learning, Teaching and Assessing అనే పుస్తకం రాసిన సంవత్సరం?
1) 2000 2) 2001 3) 2002 4) 2003
6. విమర్శలు, సిఫారసులు, నివేదికలు తయారు చేయగలుగుతారు అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) సృజించడం 2) విశ్లేషణ
3) మూల్యాంకనం చేయడం 4) సంశ్లేషణ
7. జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితంలో అనుసంధానం చేయడం అనేది చెప్పింది?
1) ఎన్సీఎఫ్-2005 2) ఆర్టీఈ-2009
3) ఎన్సీఎఫ్-2000 4) ఎన్సీఎఫ్టీఈ-2005
8. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు?
1) 1975 2) 1976 3) 1977 4) 1978
9. శిశువుకు ఏయే అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ విద్యాప్రణాళికగా ఏర్పడుతాయని నిర్వచించింది?
1) క్రోథక్రొ 2) ముర్రే
3) సెకండరీ విద్యాకమిషన్ 3) కొఠారి కమిషన్
10. విద్యాప్రణాళిక నిర్మాణంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు మూడు. అవి ప్రధానంగా..
1) విద్యార్థి స్వభావం 2) విషయ స్వభావం
3) సమాజ స్వభావం 4) పైవన్నీ
11. విద్యాప్రణాళిక సరళంగా గతిశీలంగా ఉండాలి. మారుతున్న సమాజానికి విద్యార్థుల అవసరాలకు తగిన విధంగా మార్పులు, చేర్పులు చేయడానికి వీలుగా ఉండాలని చెప్పే విద్యాప్రణాళిక సూత్రాలు?
1) పరిణామ నిత్యత్వ సూత్రం 2) సరళతా సూత్రం
3) పరిరక్షణ సూత్రం 4) కృత్య కేంద్రీకృత సూత్రం
12. ఉపయోగకరమైన ఇంటి పనులు, ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, పటాలు, చార్టులు తయారు చేయడం వంటివి విద్యార్థులతో చేయించాలని చెప్పే విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రం?
1) సరళతా సూత్రం 2) పరిణామ నిత్యత్వ సూత్రం
3) విరామకాల సద్వినియోగ సూత్రం
4) వైవిధ్యత సామ్యతా సూత్రం
13. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలన్నింటి కంటే ముఖ్యమైనది?
1) సామాజిక జీవితాంత సంబంధ సూత్రం
2) ప్రయోజన సూత్రం
3) పరిరక్షణ సూత్రం
4) కృత్య సూత్రం
14. విద్యార్థి ఇంతకు ముందు తెలిపిన జ్ఞానంపై ప్రతిస్పందించడం ద్వారా కొత్తగా నేర్చుకున్న జ్ఞాన ఫలితంగా ఎల్లప్పుడూ జ్ఞానాన్ని నిర్మించుకుంటూ, పునర్నిర్మించుకుంటూ ఉంటాడని తెలిపేది?
1) భావవాదం 2) వ్యవహారికవాదం
3) నిర్మాణాత్మకవాదం 4) ప్రాకృతికవాదం
15. ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం సరిగా అవగాహన చేసుకోవడం సాధ్యంకాదో ఆ అంశాన్ని మొదట చేర్చి దాని జ్ఞానం ఆధారంగా నేర్చుకోదగిన అంశాన్ని తర్వాత అమర్చడం ఏమవుతుంది?
1) ఏకకేంద్ర ఉపగమం 2) తార్కిక ఉపగమం
3) సమైక్య ఉపగమం 4) యూనిట్ ఉపగమం
16. కార్యకారణ సంబంధాన్ని, విషయంలో కాఠిన్యతను విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్యప్రణాళికను వ్యవస్థీకరించడాన్ని ఏమంటారు?
1) తార్కిక ఉపగమం 2) ఏకకేంద్ర ఉపగమం
3) సమైక్య ఉపగమం 4) యూనిట్ ఉపగమం
17. ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించిన అన్ని విషయాలను ఒక తరగతికి చెందిన విద్యాప్రణాళికలో పొందుపరుస్తారు అనేది ఏ ఉపగమం?
1) కాలక్రియ ఉపగమం 2) అంశరీతి ఉపగమం
3) సమైక్య ఉపగమం 4) సహసంబంధ ఉపగమం
18. ఆఫ్రికాఖండం అనే అంశానికి సంబంధించిన అన్ని విషయాలను ఒక టాపిక్‌లో ఉంచి దానిని ఎనిమిదో తరగతిలో ప్రవేశపెట్టారు. ఇది కింది ఏ ఉపగమనానికి చెందింది?
1) సహసంబంధ ఉపగమం 2) ఏకకేంద్ర ఉపగమం
3) అంశరీతి ఉపగమం 4) వర్తులాకార ఉపగమం
19. బల్లార్డ్ చెప్పినట్లుగా దీనివల్ల నిజజీవిత భాగాన్ని తరగతి గదిలోకి దిగుమతి చేసుకున్నట్లుంది. అనేది కింది ఏ రకమైన యూనిట్‌కు సంబంధించింది?
1) విషయ విజ్ఞాన యూనిట్ 2) అనుభవ సాకల్య యూనిట్
3) నిర్మాణాత్మక యూనిట్ 4) వనరుల యూనిట్
20. విద్యార్థుల్లో వైయుక్తిక భేదాలు గుర్తించడానికి, సవరణాత్మక బోధనకు ఎంతో ఉపయోగపడే సోపానం?
1) అన్వేషణ 2) సాంశీకరణ
3) ప్రదర్శన 4) వ్యవస్థీకరణ
21. నమూనాలు తయారుచేయడం, ప్రపంచ పటాలు గీయడం, క్షేత్ర పర్యటనలు చేయడం ద్వారా వచ్చేవి?
1) పరోక్ష అనుభవాలు 2) ప్రత్యక్ష అనుభవాలు
3) కల్పిత అనుభవాలు 4) ప్రతినిధిత్వ అనుభవాలు
22. దృశ్య సంకేతాలు అనేది ఎడ్గర్‌డేల్ అనుభవాల శంఖువులో పై నుంచి ఎన్నోది?
1) మొదటిది 2) నాలుగోది 3) రెండోది 4) ఐదోది
23. గ్రామఫోన్ అనేది ఎలాంటి బోధనోపకరణం?
1) త్రిమితీయ 2) గ్రాఫిక్ 3) శ్రవణ 4) దృశ్య శ్రవణ
24. కింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధం లేని నెల?
1) జూలై 2) ఆగస్టు 3) మార్చి 4) ఫిబ్రవరి
25. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా లఘుపరీక్ష నిర్వహణకు సంబంధించి సరికానిది?
1) దీనికి ముందస్తు సమాచారం ఇవ్వకూడదు
2) నిర్దిష్ట సమయం అవసరం లేదు. ఎప్పుడైనా నిర్వహించవచ్చు
3) ఈ పరీక్షకు ప్రత్యేకంగా నోటుపుస్తకం పెట్టాలి
4) 20 మార్కుల పరీక్ష ఒక్కసారే నిర్వహించాలి
26. కింది వాటిలో నిర్మాణాత్మక అంశం కానిది?
1) ప్రాజెక్టు పనులు చేయించడం
2) లఘు పరీక్ష నిర్వహించడం
3) పిల్లలు రాసిన అంశాలు చూడటం
4) విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం
27. సీసీఐ అనే విధానాన్ని విద్యావిధానంలో ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించినవి?
1) ఎన్సీఎఫ్-2005 2) ఆర్టీఈ-2009
3) ఏపీఎస్సీఎఫ్-2011 4) పైవన్నీ
28. వివిధ విషయాల్లో పిల్లల విద్యాప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా వేయడానికి నిర్వహించే మూల్యాంకనం?
1) నిర్మాణాత్మక 2) లోపనిదాన
3) సంకలన 4) ప్రాగుక్తీకరణ
29. స్థానికకాలం, ప్రామాణికకాలం అంటే ఏమిటి? వీటి మధ్యగల తేడాలను వివరించండి అనేది ఏ విద్యాప్రమాణం?
1) విషయ అవగాహన
2) ప్రశంస, సున్నితత్వం
3) సమాచార నైపుణ్యాలు
4) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
30. ప్రకృతి వైపరీత్యాలు అని వేటిని అంటారు? వాటికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి? అనేది ఏ విద్యాప్రమాణం?
1) ప్రశంస, సున్నితత్వం
2) చదివి వ్యాఖ్యానించడం
3) విషయ అవగాహన
4) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
31. 130వ పేజీలోని విషయాన్ని చదవండి? ప్రత్యక్ష పన్నుల గురించి మీరు గ్రహించిన ఐదు ముఖ్యమైన విషయాలు రాయండి? ఇలాంటి ప్రశ్న ఏ విద్యాప్రమాణానికి సరిపోతుంది?
1) 1 2) 2 3) 4 4) 5
32. మీ ప్రాంతంలో ఏయే ఖనిజాలు ఎక్కడెక్కడ లభిస్తాయో వివరాలు సేకరించండి? ఇక్కడ ఏయే పరిశ్రమలు స్థాపించవచ్చో ఒక పట్టిక రూపంలో రాసి ప్రదర్శించండి అనేది?
1) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
2) విషయ అవగాహన
3) పట నైపుణ్యాలు
4) సమాచార సేకరణ నైపుణ్యాలు
33. సముద్రాలు మానవ జీవనంలో నిర్వహించే పాత్రను వివరించండి? అనే ప్రశ్న ….
1) జ్ఞానం 2) అవగాహన
3) నైపుణ్యం 4) వైఖరి
34. పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదానికి మధ్యగల తేడాలను తెలుపండి? అనే ప్రశ్న?
1) వినియోగం 2) అవగాహన
3) జ్ఞానం 4) అభిరుచి
35. ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పోరాడటానికి గల అంశాలను ఊహించండి? అనేది?
1) నైపుణ్యం 2) అవగాహన
3) వినియోగం 4) జ్ఞానం
36. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడంలో ఆంగ్‌సాన్ సూకి చేసిన పోరాటాన్ని నీవు ఎలా అభినందిస్తావు అనేది?
1) ప్రశంస, సున్నితత్వం
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
3) విషయ అవగాహన
4) చదివి వ్యాఖ్యానించడం
37. యూరప్ పటంలో నల్లసముద్రం గుర్తించండి అనేది?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం
38. రిజర్వుబ్యాంకు చిహ్నాన్ని గీయండి అనేది?
1) పట నైపుణ్యాలు
2) సమాచార నైపుణ్యాలు
3) హస్తలాఘవ నైపుణ్యాలు
4) పరిశీలనా నైపుణ్యాలు
39. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి తెలియజేస్తూ ఒక కరపత్రం తయారుచేయండి? అనేది?
1) పటనైపుణ్యాలు
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
3) ప్రశంస, సున్నితత్వం
4) విషయ అవగాహన
40. పటంలో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది?
1) సరిహద్దులు 2) ఖనిజ వనరులు
3) రాష్ర్టాలు 4) రాజధానులు
41. ఇటీవల మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? వీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో మీ అభిప్రాయాలు తెలుపండి అనే ప్రశ్న?
1) విషయ అవగాహన
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
3) పట నైపుణ్యాలు 4) సమాచార నైపుణ్యాలు
42. 71- 90 మార్కులకు ఇవ్వాల్సిన గ్రేడు?
1) A 2) A+ 3) C 4) B+
43. 0-40 మార్కులకు ఇవ్వాల్సిన గ్రేడు?
1) B+ 2) B 3) C 4) D
44. A+ అనే గ్రేడుకు కింది ఏ మార్కులు సరిపోతాయి?
1) 90-100 2) 95-100
3) 91- 100 4) 89 -99
45. ఒక విద్యార్థికి సాంఘికశాస్త్రం పరీక్షలో 75 మార్కులు వస్తే అతనికి కేటాయించిన గ్రేడు?
1) A 2) B 3) C 4) D
46. విషయ అవగాహనకు కేటాయించాల్సిన మార్కుల శాతం?
1) 10 2) 15 3) 20 4) 40
47. పట నైపుణ్యాలు అనే విద్యాప్రణాళికకు ప్రశ్నపత్రంలో ఇవ్వాల్సిన వెయిటేజీ?
1) 15 శాతం 2) 10 శాతం
3) 40 శాతం 4) 25 శాతం
48. కింది వాటిలో సంగ్రహణ మూల్యాంకణానికి సంబంధించింది?
1) విద్యాప్రమాణాల ఆధారంగా ప్రశ్నపత్రం ఉండాలి
2) భారత్వాన్ని తప్పక పాటించాలి
3) ప్రాజెక్టు పనులను కూడా ఇవ్వాలి
4) సమాధానం సొంతంగా రాసేలా ఉండాలి
49. విద్యార్థులకు ఏదైనా అంశం ఇచ్చి ఆలోచింపజేసి వారి నుంచి నచ్చిన ఆలోచనలను క్రోడీకరించి ముగింపు ఇవ్వడం?
1) కాన్సెప్ట్ మ్యాపింగ్ 2) మైండ్ మ్యాపింగ్
3) 1, 2 4) స్కూల్ మ్యాపింగ్
50. సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాలు ఎన్ని ఇతివృత్తాల ఆధారంగా రూపొందించారు?
1) 5 2) 6 3) 4 4) 7
51. పటంలో గుంపులు గుంపులుగా ఉన్న చతురస్రాలు దేనిని సూచిస్తాయి ….
1) ఇండ్లు 2) పట్టణం 3) గ్రామం 4) జిల్లా
52. ఆకురాల్చే అడవులు, నల్లమల అడవులు వంటి అంశాలను పటంలో సూచించడానికి వాడాల్సిన రంగు?
1) లేత నీలం 2) ముదురు నీలం
3) లేత ఆకుపచ్చ 4) ముదురు ఆకుపచ్చ
53. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు? అనే దానిపై సమర్థవంతమైన ఫీడ్‌బ్యాక్ అందించే మూల్యాంకనం ….?
1) లోపనిదాన మూల్యాంకనం
2) నిర్మాణాత్మక మూల్యాంకనం
3) సంకలన మూల్యాంకనం
4) ప్రాగుక్తీకరణ మూల్యాంకనం
54. జట్లలో పరిశీలించుకోవడానికి, సహకరించుకోవడానికి అవకాశం కల్పించేది?
1) ప్రాగుక్తీకరణ మూల్యాంకనం
2) నిర్మాణాత్మక మూల్యాంకనం
3) సంకలన మూల్యాంకనం
4) లోపనిదాన మూల్యాంకనం
55. ఒక పరీక్ష రాస్తున్నామనే భావం లేకుండా సహజమైన వాతావరణంలో నిర్వహించేది?
1) లోపనిదాన మూల్యాంకనం
2) సంకలన మూల్యాంకనం
3) ప్రాగుక్తీకరణ మూల్యాంకనం
4) నిర్మాణాత్మక మూల్యాంకనం
56. ఒక పాఠ్యాంశంలో వెనుకబడిన పిల్లలకు ప్రత్యామ్నాయ బోధనకు సహకరించేది?
1) నిర్మాణాత్మక మూల్యాంకనం
2) సంకలన మూల్యాంకనం
3) ప్రాగుక్తీకరణ మూల్యాంకనం
4) లోపనిదాన మూల్యాంకనం
57. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శనలను, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపర్చడమే ….
1) సంఘటన రచనాపత్రావళి 2) పోర్ట్‌పోలియో
3) ప్రాజెక్ట్ వర్క్ 4) క్యుములేటివ్ రికార్డ్
58. విద్యార్థుల సాధనను మార్కులు, ర్యాంకులరూపంలో తెలియజేసే మూల్యాంకనం ….
1) లోపనిదాన మూల్యాంకనం
2) విశ్లేషణాత్మక మూల్యాంకనం
3) రూపణ మూల్యాంకనం
4) సంకలన మూల్యాంకనం
59. CCE విధానంలో అత్యంత కీలకమైన మూల్యాంకనం ….
1) లోపనిదాన మూల్యాంకనం
2) సమస్యా మూల్యాంకనం
3) సంకలన మూల్యాంకనం
4) నిర్మాణాత్మక మూల్యాంకనం
60. సంకలన మూల్యాంకనం జవాబుపత్రం కోసం ఉన్న సూచనలో సరికానిది?
1) జవాబు పత్రం తయారుచేసుకోవాల్సిన పని ఉంది 2) ప్రశ్నలు యథాతథంగా ఇవ్వరాదు. సొంతంగా
రాసేవిధంగా ఉండాలి
3) విద్యాప్రమాణాల నిష్పత్తి పాటించాలి
4) ప్రశ్నపత్రం ఉపాధ్యాయుడే తయారుచేసుకోవాలి
61. పుస్తకాల బరువును, విద్యార్థికి ఇంటిపని భారాన్ని తగ్గించాలని పరిసరాల విజ్ఞాన కనీస అభ్యసన స్థాయిలను పెంపొందించాలని సూచించినవారు?
1) NPE-1986
2) యశ్పాల్ కమిటీ
3) కొఠారీ కమిషన్
4) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
62. పాఠశాల అనేది సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం అని చెప్పినవారు?
1) ఠాగూర్ 2) గాంధీ 3) పటేల్ 4) నెహ్రూ
63. కింది వాటిలో విద్యలో దిశానిర్దేశం చేసేవిగా వేటిని పేర్కొంటారు?
1) లక్ష్యాలు 2) ఉద్దేశాలు 3) విలువలు 4) గమ్యం
64. విద్యార్థుల్లో సామాజిక సమర్థత పెంపొందించడం …. అవుతుంది.
1) లక్ష్యం 2) ఆశయం 3) గమ్యం 4) స్పష్టీకరణ
65. కింది వాటిలో ఉద్దేశానికి ఉన్న ఇతర పేర్లు?
1) ఆశయం 2) విద్యాలక్ష్యం
3) సాధారణ లక్ష్యం 4) పైవన్నీ
66. ఏమి సాధించాలో తెలియజేసే ఆశయాల కంటే ఎంతవరకు సాధించామో …. ముఖ్యం.
1) లక్ష్యం 2) స్పష్టీకరణ 3) గమ్యం 4) విలువలు
67. ఉన్న విషయాన్ని నూతన విధానంలో చెప్పగలగడం, విషయాన్ని భిన్నపరిస్థితుల్లో అమర్చి నూతన ఆవిష్కరణలకు విద్యార్థి నాంది పలికితే అది ….
1) వృత్తివిలువ
2) సమస్యాపరిష్కార విలువ
3) సృజనాత్మక విలువ
4) విరామకాల సద్వినియోగ విలువ
68. విద్యార్థి మూఢనమ్మకాలను విడనాడి సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు చేయగల శక్తి పెంపొందించుకోవడం ద్వారా …. విలువ సాధిస్తారు.
1) విరామకాల విలువ
2) శాస్త్రీయవైఖరులు పెంపొందే విలువ
3) సృజనాత్మక విలువ
4) క్రమశిక్షణా విలువ
69. కింది వాటిలో విలువ కానిది?
1) సహకారం 2) అసహనం
3) శ్రమపట్ల గౌరవం 4) త్యాగనిరతి
70. తత్వం -> గమ్యాలు -> ఆశయాలు -> ….
1) స్పష్టీకరణ 2) ఉద్దేశం 3) విలువ 4) లక్ష్యం
71. కింది వాటిలో సంశ్లేషణ సోపానాల్లో లేనిది?
1) శ్రేష్టమైన విషయప్రసారాన్ని ఏర్పర్చడం
2) కార్యకారణ సముదాయాన్ని ప్రణాళిక సిద్ధపర్చడం 3) భావనాత్మక సంబంధాల సముదాయాన్ని
నిర్మించుకోవడం
4) సాదృశ్య చక్రీయ కార్యాచరణ
72. విద్యార్థి సామాజిక, ఆర్థిక, రాజకీయ పౌర సమస్యలను చర్చిస్తాడు అనేది ….
1) వైఖరి 2) అవగాహన 3) జ్ఞానం 4) అభిరుచి
73. విద్యార్థి భిన్నత్వంలో ఏకత్వాన్ని అభినందిస్తే అది ….
1) అవగాహన 2) జ్ఞానం
3) వినియోగం 4) ప్రశంస
74. తెలంగాణ పటంలో విద్యార్థి వివిధ జిల్లాల్లో అడవులు విస్తరించి ఉండే ప్రాంతాలు గుర్తిస్తాడు అనేది?
1) హస్తలాఘవ నైపుణ్యం 2) పరిశీలన నైపుణ్యం
3) చిత్రలేఖన నైపుణ్యం 4) నివేదన నైపుణ్యం
75. విద్యార్థికి విస్తృతమైన విషయ విజ్ఞానాన్ని అందించడంలో అత్యంత ఉపయోగకరమైన పద్ధతి?
1) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి 2) ప్రాజెక్టు పద్ధతి
3) మూలాధార పద్ధతి 4) ఉపన్యాస పద్ధతి
76. ఒకరి ఆలోచనల కంటే ఇద్దరి ఆలోచనలు మంచిది అనేది కింది ఏ బోధనాపద్ధతికి సరిపోయింది ….
1) ప్రాజెక్టు 2) సమస్య
3) చర్చ 4) క్రీడాపద్ధతి
77. సముద్రమట్టం నుంచి పైకి పోయేకొద్దీ ప్రతి 1000 మీటర్లకు 6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. అనే దానిని విద్యార్థులు అనేక ఉదాహరణల ద్వారా నిర్ధారిస్తే ….
1) ఆగమన 2) నిగమన
3) విశ్లేషణ 4) సంశ్లేషణ
78. సాంఘికశాస్త్రంలో సమాచారం వార్తాపత్రికల్లో, పుస్తకాల్లో, మేగజీన్లలో వస్తే అది ….
1) ప్రాథమిక ఆధారం 2) గౌణ ఆధారం
3) చారిత్రక ఆధారం 4) పూర్వచారిత్రక ఆధారం
79. అంతర్జాతీయ సిమ్యులేషన్ క్రీడలు అనే త్రైమాసిక సంచిక ప్రారంభమైన ఏడాది ….
1) 1970 2) 1969
3) 1968 4) 1972
80. కోబన్ ప్రకారం వినడం ద్వారా స్మృతి ….
1) 10 శాతం 2) 20 శాతం
3) 30 శాతం 4) 40 శాతం
81. కోబన్ ప్రకారం వివరిస్తూ పనిచేయడం ద్వారా స్మృతి ….
1) 70 శాతం 2) 50 శాతం
3) 80 శాతం 4) 90 శాతం
82. చిత్రాలు అనేది కింది ఏ బోధనోపకరణం ….
1) గ్రాఫిక్ ఉపకరణం 2) దృశ్యశ్రవణ సాధనం
3) త్రిమితీయ సాధనం 4) ప్రక్షేపక సాధనం
83. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పటనైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి …. పటాలు ఉపయోగపడుతాయి.
1) రాజకీయ పటాలు 2) ఆవరణరేఖా పటాలు
3) భౌతిక పటాలు 4) ప్రత్యేక పటాలు
84. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్మాణం గురించి వివరించమంటే నీవు కింది ఏ చార్టు ఉపయోగిస్తావు?
1) ప్రవాహ చార్టు 2) కాలక్రమ చార్టు
3) టేబుల్ చార్టు 4) వర్గీకరణ చార్టు
85. బ్రిటిష్ పరిపాలనాకాలం నాటి వివిధ సంఘటనలను క్రమానుగతంగా వివరించడానికి అనుకూలం అయిన చార్టు ….
1) కాలరీతి చార్టు 2) కాలక్రమ చార్టు
3) క్రోనాలజి చార్టు 4) పైవన్నీ
86. బహుళ ఉపయోగకర బోర్డు అని ఏ బోర్డును పిలుస్తారు ….
1) ప్రకటనల బోర్డు 2) బులెటిన్ బోర్డు
3) నల్లబల్ల 4) ప్యానెల్ బోర్డు
87. వివిధ నాయకుల చిత్రాలు, ఫ్లాష్కార్డులు మొదలైనవి ఆసక్తికరంగా చూపించడానికి ఉపయోగపడే బోర్డు ….
1) ప్రకటనల బోర్డు 2) పిన్ బోర్డు
3) ప్యానెల్ బోర్డు 4) బ్లాక్ బోర్డు
88. విందాం-నేర్చుకుందాం, మీనా ప్రపంచం వంటి రేడియో ప్రసారాలు మనరాష్ట్రంలో ప్రసారం చేస్తున్నవారు?
1) CIET 2) NCERT 3) SIET 4) CTE
89. ఒక నిర్ణీత సమయానికి ఒక సంస్థలో లేదా దేశంలో జరిగిన ప్రగతి, ఇతర సమాచారాన్ని గణాంక వివరాల ఆధారం పెరుగుదల, తగ్గుదల వ్యత్యాసాలను చూపడానికి అనువైన గ్రాఫ్ ….
1) లైన్గ్రాఫ్ 2) కమ్మీగ్రాఫ్
3) ప్యానెల్ గ్రాఫ్ 4) వలయగ్రాఫ్
90. రెండు పరస్పర సంబంధాలు కలిగిన విషయాల మధ్య సంబంధం ఎలా ఉందో తెలుసుకోవడానికి …. గ్రాఫ్‌లు ఉపయోగపడుతాయి.
1) దిమ్మగ్రాఫ్ 2) రేఖాచిత్రాల గ్రాఫ్
3) సచిత్ర గ్రాఫ్ 4) సర్కిల్ గ్రాఫ్
91. ఒక పాఠశాలలో విద్యార్థుల గ్రేడ్‌వారీ పరీక్ష ఫలితాలు శాతాల్లో చెప్పాలంటే ఏ గ్రాఫ్ అనువైనది ….
1) సర్కిల్ గ్రాఫ్ 2) స్థూపాకార గ్రాఫ్
3) లైన్గ్రాఫ్ 4) వెన్గ్రాఫ్
92. నమూనాల గురించి సమాచారం అదనంగా పొందుపరచబడినది అని చెప్పినవారు?
1) బైనింగ్ అండ్ బైనింగ్ 2) ఎస్కే కొచార్
3) వెస్లీ 4) సెకండరీ విద్యాకమిషన్
93. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, కాయధాన్యాలు, ఆటవిక ఉత్పత్తులు మొదలైనవి సాంఘిక శాస్త్రంలో ఎలా పిలువవచ్చు?
1) మాకస్ 2) కామిక్
3) మాతృక 4) మాదిరి
94. యూనిట్ పథకం అమలులో మొదటి దశ ….
1) పూర్వజ్ఞాన పరిశీలన 2) ప్రదర్శన
3) సన్నాహం లేదా ప్రేరణ 4) అభ్యసన నిర్వహణ
95. నియంత్రణ పరిస్థితుల్లో ఒక బోధనా ప్రవర్తనమీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కల్పించేదే సూక్ష్మబోధన అని చెప్పినది?
1) డ్వైట్ ఎలెన్ 2) ఎలెన్, ఈవ్
3) ఎల్సీ సింగ్ 4) ఎంఎస్ లలిత
96. కింది వాటిలో సూక్ష్మబోధనకు సంబంధించి సరికానిది?
1) సూక్ష్మబోధనా నైపుణ్యాలకు మూలబోధనానైపుణ్యాలని పేరు
2) ఇది ఒక ఎదురెదురు బోధనా వ్యూహం
3) కల్పిత పరిసరాల్లో ఇది జరుగుతుంది
4) సంక్లిష్ట భావన తీసుకొని సాధన చేస్తాడు
97. కింది వాటిలో స్థూలబోధనా అంశానికి సంబంధం లేనిది?
1) పర్యవేక్షకుని పాత్ర స్పష్టంగా ఉంటుంది
2) బోధన క్లిష్టంగా, భయాన్ని కలుగజేసేదిగా ఉంటుంది 3) బోధనా కాలపరిమితి 35-45 నిమిషాలు ఉంటుంది 4) పునర్బలనం తక్షణమే లభించదు
98. రాము అనే విద్యార్థికి సంకలన మూల్యాంకనంలో భాగంగా నిర్వహించిన పరీక్షలో 60 మార్కులు వచ్చాయి. అలా విద్యార్థి సామర్థ్యాన్ని అంకెల్లో చెబితే అది ….
1) మదింపు 2) మాపనం
3) మూల్యాంకనం 4) పైవన్నీ
99. ఒక ఉపాధ్యాయుడు తయారుచేసిన ప్రశ్నపత్రం ద్వారా ఆ తరగతిలో విద్యార్థులు సాధారణ, సాధారణం కంటే ఎక్కువ, సాధారణం కంటే తక్కువ సామర్థ్యాలుగలవారీగా విభజించడానికి అవకాశం కలిగితే అది ….
1) విశ్వసనీయత 2) ఆచరణాత్మకత
3) విచక్షణాశక్తి 4) సప్రమాణత
100. కేఎఫ్ నారాయణ్ చెప్పిన ఏబీసీడీ ఆఫ్ గుడ్ టీచర్లో డీ అనేది ….
1) డెడికేషన్
2) డెవలప్మెంట్
3) డివోషన్ టు డ్యూటీ
4) డెవలప్మెంట్ ఇన్ ప్రొఫెషన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?