CSIR UGC-NET | సీఎస్ఐఆర్ నెట్ నోటిఫికేషన్ విడుదల
CSIR UGC-NET | సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2022 డిసెంబర్, 2023 జూన్ మాసాల్లో నిర్వహించాల్సిన నెట్ ఎంట్రెన్స్ షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించడంతో పాటు ఏప్రిల్ 12 నుంచి 18 వరకు తప్పుల సవరణకు అవకాశమిచ్చారు.
ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) పద్ధతిలో ఈ ఏడాది జూన్ 6, 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్, ఓషియన్, ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం https ://csirnet.nta.nic. in వెబ్సైట్లో సంప్రదించాలని ఎన్టీఏ పరీక్షల విభాగం డైరెక్టర్ సాధనా పరాశర్ తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?