Notifications | నోటిఫికేషన్స్
నిమ్ సెట్-2022
– దేశంలోని ప్రతిష్ఠాత్మక సాంకేతిక సంస్థలుగా పేరుగాంచిన ఎన్‌ఐటీలల్లో ఎంసీఏ చేయడానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్ సెట్) నోటిఫికేషన్ విడుదలైంది.
నిమ్ సెట్
– నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష. ఈసారి ఎంట్రన్స్ టెస్ట్ బాధ్యతలను జంషెడ్పూర్ ఎన్ఐటీ పర్యవేక్షిస్తుంది.
ప్రవేశం కల్పించే సంస్థలు
– ఎన్ఐటీ- వరంగల్, జంషెడ్పూర్, రాయ్‌పూర్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కురుక్షేత్ర, సూరత్కల్, తిరుచిరాపల్లి (తిరుచ్చి).
ఎన్ఐటీ సీట్ల సంఖ్య
అగర్తలా 30
అలహాబాద్ 116
భోపాల్ 115
జంషెడ్పూర్ 115
కురుక్షేత్ర 64
కురుక్షేత్ర 32
రాయ్‌పూర్ 110
సూరత్కల్ 58
తిరుచిరాపల్లి 115
వరంగల్ 58
ఎవరు అర్హులు ?
– కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ (మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి)/బీసీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఏ బ్రాంచీలోనైనా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
– మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు
– మ్యాథ్స్ నుంచి 50, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 40, కంప్యూటర్ అవేర్నెస్ -10, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు ఇస్తారు.
– నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.
ముఖ్య తేదీలు
– దరఖాస్తు: ఆన్లైన్లో
– చివరితేదీ: మే 4
– పరీక్ష తేదీ: జూన్ 20
– రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్
-వెబ్సైట్: https://www.nimcet.in/
నాటా-2022
– నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) నోటిఫికేషన్ విడుదలైంది.
– ప్రవేశాలు కల్పించే కోర్సు: ఐదేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)
– అర్హతలు: ఇంటర్ (ఎంపీసీ)/ డిప్లొమా (10+3) ఉత్తీర్ణత. డిప్లొమాలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
– ఎంపిక: రాత పరీక్ష ద్వారా
– పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మల్టిపుల్ చాయిస్, పీసీక్యూ, ఎన్ఏక్యూ రూపంలో ప్రశ్నలు ఇస్తారు.
– నోట్: నాటా పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. ఏప్రిల్‌లో మొదటిసారి, రెండోసారి జూన్‌లో నిర్వహిస్తారు.
– దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: మే 23
-పరీక్ష తేదీ: జూన్ 12
– వెబ్సైట్: https://www.nata.in
ఎడ్‌సెట్-2022
– రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్)-2022 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.
-పరీక్ష పేరు: తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్)-2022
– ప్రవేశం కల్పించే కోర్సు: బీఈడీ
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
– వయస్సు: 2022, జూలై 1 నాటికి 19 ఏండ్లు నిండి ఉండాలి.
-నోట్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
ముఖ్య తేదీలు
– దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: జూన్ 15
-పరీక్ష తేదీలు: జూన్ 26, 27
– వెబ్సైట్: https://edcet.ts.ac.in
సీయూ ఈటీ-2022
– దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూ సెట్) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
– కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూ ఈటీ యూజీ)-2022
– 2022-23 నుంచి దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానాన్ని కేంద్ర విద్యా శాఖ ప్రవేశ పెట్టింది.
– అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణత.
– ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా
-ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.
– మొదటి సెక్షన్లో సంబంధిత లాంగ్వేజ్, రెండో సెక్షన్లో ఇంటర్ సిలబస్‌కు సంబంధించి, మూడో సెక్షన్లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్సైట్: https://cuet.samarth.ac.in
నైసర్‌లో…
-భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్)కి చెందిన స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్‌లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
– కోర్సులు: ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్-స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్
– అర్హతలు: ఫిజికల్ సైన్సెస్‌లో డిగ్రీ లేదా ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఫిజిక్స్. ఫైనల్ ఇయర్ పరీక్షలకు హజరవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: జామ్-2022 లేదా జెస్ట్-2022లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులకు పరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
– దరఖాస్తు: ఆన్లైన్లో
– చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్సైట్: https://www.niser.ac.in
ఐసర్‌లో బీఎస్, ఎంఎస్ ప్రవేశాలు
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో 2022 విద్యా సంవత్సరానికి గాను బీఎస్, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
-ఐఐఎస్ఈఆర్: సైన్స్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ రంగాలను మిళితం చేసి అత్యున్నత విద్యను అందించడానికి కేంద్రం ఐఐఎస్‌ఈఆర్‌లను ఏర్పాటు చేసింది. మొదట 2006లో కోల్‌కతా, పుణెల్లో ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఏడు ఐసర్లు ఉన్నాయి.
-ఐసర్ క్యాంపస్‌లు: భోపాల్, బెర్హంపూర్, కోల్‌కతా, మొహాలి, పుణె, తిరువనంతపురం, తిరుపతిల్లో ఈ సంస్థ క్యాంపస్‌లు ఉన్నాయి.
– ఆఫర్ చేస్తున్న కోర్సులు: బీఎస్, బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ.
-బీఎస్ డిగ్రీ- ఇంజినీరింగ్ సైన్సెస్, ఎకనామిక్స్ కోర్సులను కేవలం భోపాల్ క్యాంపస్ మాత్రమే అందిస్తుంది. ఇది నాలుగేండ్ల కోర్సు.
-బీఎస్-ఎంఎస్ డిగ్రీ ఐదేండ్ల కోర్సు.
– ఈ కోర్సులు పూర్తి రెసిడెన్షియల్ ఫుల్‌టైం కోర్సులు.
ప్రవేశ విధానం
– మూడు విధానాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్, స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డుల చానెల్ ద్వారా.
– 1. కేవీపీవై ఫెలోషిప్ పొందనున్నవారికి
– 2. ఐఐటీ -జేఈఈ (అడ్వాన్స్డ్)లో 10 వేల ర్యాంక్ లోపు వచ్చినవారికి
– 3. స్టేట్, సెంట్రల్ బోర్డుల్లో ఐఐఎస్ఈఆర్ ప్రకటించిన కటాఫ్ మార్కులు సాధించినవారు సంస్థ నిర్వహించే ఐఐఎస్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐఏటీ) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
నోట్: ఈసారి పరీక్ష విధానంలో మార్పులు చేశారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో ఏప్రిల్ 25 నుంచి
చివరితేదీ: మే 20
ఐఐఎస్ఈఆర్ అడ్మిషన్ టెస్ట్- జూన్ 12
వెబ్సైట్: http://iiseradmission.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?