NIMCET 2023 | నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
NIT MCA Common Entrance Test | దేశంలోని పది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లలో ఎంసీఏ( మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ‘నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (NIMCET) -2023’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎడాది నిమ్సెట్ను జంషెడ్పూర్ నిట్ నిర్వహిస్తుండగా.. నిమ్సెట్-2023లో సాధించిన ర్యాంకుల ఆధారంగా… అగర్తలా, అలహాబాద్, భోపాల్, జంషెడ్పూర్, కురుక్షేత్ర, కాలికట్, దుర్గాపూర్, రాయ్పూర్, సూరత్కల్, వరంగల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఎస్సీ/ బీఎస్సీ/ బీసీఏ/ బీఐటీ/ బీఈ/ బీటెక్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిట్ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేండ్ల కోర్సు తర్వాత వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేండ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
పరీక్ష వివరాలు…
నిమ్సెట్ -2023
మొత్తం సీట్ల సంఖ్య: 813
సీట్ల వివరాలు: జంషెడ్పూర్ – 115, కురుక్షేత్ర – 96 (వీటిలో 32 సెల్ఫ్ ఫైనాన్స్), రాయ్పూర్- 110, సూరత్కల్-58, తిరుచురాపల్లి – 115, వరంగల్ – 58, అగర్తలా-30, అలహాబాద్-116, భోపాల్- 115.
అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఎస్సీ/ బీఎస్సీ/ బీసీఏ/ బీఐటీ/ బీఈ/ బీటెక్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీట్ల కేటాయింపు: మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.2500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250)
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : ప్రవేశ పరీక్ష ఆధారంగా
పరీక్ష విధానం: మొత్తం 1000 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. రాతపరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 40 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 05
చివరితేది: ఏప్రిల్ 10
పరీక్ష తేది: జూన్ 11
ఫలితాలు: జూన్ 16
వెబ్సైట్: https://www.nimcet.admissions.nic.in/
https://www.nimcet.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?