CUET PG Notification 2023 | సీయూఈటీ -2023
CUET PG Notification 2023 | దేశవ్యాప్తంగా పేరుగాంచిన సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు పలు ప్రైవేట్ విద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు సంక్షిప్తంగా….
పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాలు
142 యూనివర్సిటీలు.. వందకు పైగా కోర్సులు
పరీక్ష పేరు: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2023
- కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంపీఏ, ఎంబీఏ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంకాం, శిక్షా శాస్త్రి (బీఈడీ), డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఆంత్రోపాలజీ, ఎంఐఎల్ఎస్సీ, ఎంటెక్, ఎంఎఫ్ఏ, ఎంవీఏ, ఎంఏ (జాగ్రఫీ, జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్), ఎంటెక్ (ఐవోటీ, వీఎల్ఎస్ఐ తదితరాలు), ఎమ్మెస్సీ (సాయిల్ సైన్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్) తదితరాలు
- ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు: దేశవ్యాప్తంగా 142 విద్యాసంస్థలు ఈ పరీక్ష ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. వాటిలో కొన్ని… బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ, బీహెచ్‌యూ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ (ఏపీ, గుజరాత్, హర్యానా, జమ్ము, జార్ఖండ్, కర్ణాటక, కశ్మీర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు), ఐజీఎన్‌టీయూ, హేమవతి నందన్ బహుగుణ గర్వాల్, జేఎన్‌యూ, మణిపూర్ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, సిక్కిం యూనివర్సిటీ, డా.బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ, గతిశక్తి విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, డీటీయూ, నిక్మార్, మేవార్, ఐఐఎంటీ గ్లోబల్ యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీ, అస్సాం యూనివర్సిటీ, ఐఐఐటీ లక్నో, ఐఐటీటీఎం (నోయిడా, భువనేశ్వర్, నెల్లూరు, గోవా), బీఎంఎల్ ముంజల్ యూనివర్సిటీ, నిట్ తిరుచిరాపల్లి తదితరాలు
- అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులు. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు/రాసినవారు అర్హులు. కొన్ని కోర్సులకు సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత. మిగిలి అన్ని కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆన్లైన్లో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్ ద్వారా.
- పరీక్షలో 100 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
- పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 19 (సాయంత్రం 5 వరకు)
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
- వెబ్సైట్: https://cuet.nta.nic.in
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
Previous article
Arthamatic Reasoning | 2:3,3:5,6:7 సంకీర్ణ నిష్పత్తి ఎంత?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?