గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
రాజస్థాన్
- మెర్కామ్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో సౌర శక్తి వ్యవస్థాపనల్లో 10 గిగావాట్లు చేరిన తొలి రాష్ట్రం రాజస్థాన్.
- ఇందిరాగాంధీ షహరీ రోజ్‌గార్ యోజనను రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో 100 రోజుల పని కల్పించేందుకు ఉద్దేశించింది ఇది.
- ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియం రాజస్థాన్ రాష్ట్రంలో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి ఫిబ్రవరి 5న భూమి పూజ చేశారు. భారత దేశంలో ఈ స్టేడియం రెండో అతిపెద్దది కానుంది. దీనిని జైపూర్‌లో నిర్మించనున్నారు.
హర్యానా
- కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని చండీగఢ్‌లో ప్రారంభించారు. ఇది అంతరిక్ష రంగానికి సంబంధించి పరిశోధన చేసేందుకు ఉద్దేశించింది.
- నాలుగు చక్రాల వాహనానికి సంబంధించి భారత దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్‌ను హర్యానాలో ప్రారంభించారు. గురుగ్రామ్‌లో ఇది మార్చి 3 నుంచి అందుబాటులోకి వచ్చింది.
- వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్‌ను హర్యానాలో ప్రారంభించారు. ఈ తరహా వ్యవస్థ భారత్‌లో అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం. దీనిని పవర్ గ్రిడ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది.
- భారత దేశంలో తొలి హెలి హబ్‌ను గురుగ్రామ్‌లో ప్రారంభించారు. హెలికాప్టర్లకు సంబంధించి అన్ని సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
- చారా బిజాయి యోజన పేరుతో ఒక కొత్త పథకాన్ని హర్యానాలో ప్రారంభించారు. గోశాలలకు గడ్డిని సరఫరా చేసే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించింది ఇది. గడ్డిని సాగు చేయాలి, దానిని సరఫరా చేయాలి. ఎకరాకు రూ.10,000 చొప్పున గరిష్ఠంగా పది ఎకరాలకు అందిస్తారు.
- 20 మెగావాట్ల సోలార్ కార్ పోర్ట్‌ను మానెసర్‌లో ప్రారంభించారు. ఏటా 28,000 మెగావాట్ హెర్ట్లను ఇది కల్పిస్తుంది. దీని ద్వారా 67,000 కార్లకు ఏటా సరిపడా విద్యుత్‌ను అందించొచ్చు.
ఢిల్లీ
- భారత దేశపు మొట్టమొదటి ‘ఈ-వేస్ట్ ఎకోపార్క్’ను ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 20 ఎకరాల్లో ఇది విస్తరించనుంది. ఈ-వృథాను ఇది రీసైకిల్ చేస్తుంది.
- భారత దేశంలో తొలిసారిగా ‘ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని’ మార్చి 16న ఆవిష్కరించారు. దీనిని టయోటా రూపొందించింది. దీనికి ‘మిరాయ్’ అని పేరు పెట్టారు. హైడ్రోజన్ ఆధారితమైంది. భారత రహదార్లు, వాతావరణ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుందో తెలుసుకొనేందుకు ప్రయోగాత్మకంగా దీనిని ఢిల్లీలో ఆవిష్కరించారు.
- ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంతో ఒప్పందం కుదుర్చుకుంది.
- దేశంలోనే మొట్టమొదటి ‘హనీ ప్రాసెసింగ్ వ్యాన్’ను ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న సిరోరా గ్రామంలో ప్రారంభించారు. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఎనిమిది గంటల్లో 300 కేజీల తేనెను ఇది ప్రాసెస్ చేయగలదు. తేనె నాణ్యతను పరీక్షించేందుకు అవసరమైన ప్రయోగశాల కూడా ఇందులో ఉంది.
- భారత దేశపు మొట్టమొదటి పారా-బ్యాడ్మింటన్ అకాడమీని లక్నోలో ఏర్పాటు చేశారు. అధునాతమైన క్రీడా సామగ్రి ఇందులో ఉంది. 2024లో పారిస్‌లో జరుగనున్న పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలను సాధించేందుకు క్రీడాకారులను సమాయత్తం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- ఈ ఏడాది జనవరి 26న నిర్వహించిన గణతంత్ర దినోత్సవాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శకటానికి ప్రథమ బహుమతి లభించింది. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి & కాశీ విశ్వనాథ్ ధామ్’ అనే ఇతివృత్తంతో ఈ శకటాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంపింది.
- దేశంలో తొలిసారిగా ‘వాక్యూమ్ బేస్డ్ సివర్ సిస్టమ్’ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అందుబాటులోకి తెచ్చారు.
మధ్యప్రదేశ్
- దేశంలో మొట్టమొదటి జియోలాజికల్ పార్క్‌ను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఉన్న లామ్హెట్టా గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.35 కోట్లు కేటాయించారు.
- దేశంలో తొలిసారిగా బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్‌ను మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజు 30 టన్నుల బయోమాస్ ఫీడ్ స్టాక్‌తో ఇది ఒక టన్ను హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయగలదు. వాటోమో ఎనర్జీస్ లిమిటెడ్, బీజిల్ గ్రీన్ ఎనర్జీ అనే సంస్థలు సంయుక్తంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాయి.
- మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గోబర్ ధన్ ప్లాంట్‌ను నరేంద్రమోదీ ఫిబ్రవరి 19న ప్రారంభించారు.
- ఆసియాలోనే ఇది అతి పెద్ద బయో-సీఎన్జీ ప్లాంట్. రూ.150 కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించారు. ‘వృథా నుంచి సంపద’ అనే అంశంలో భాగంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు.
- దేశంలో మొట్టమొదటి డ్రోన్ స్కూల్‌ను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రారంభించారు. దేశంలో మొత్తం అయిదు డ్రోన్ స్కూళ్లను ప్రారంభించనున్నారు. గ్వాలియర్‌తో పాటు భోపాల్, ఇండోర్, జబల్పూర్, సత్నా జిల్లాల్లో ఇవి రానున్నాయి.
బిహార్
- దేశంలో అతిపెద్ద వాలి ఉన్న బుద్ధుడి (రిైక్లెనింగ్ బుద్ధ) విగ్రహాన్ని బీహార్ రాష్ట్రంలోని బోధ్‌గయలో నిర్మిస్తున్నారు. ఫైబర్ గ్లాస్‌తో దీనిని తయారు చేస్తున్నారు. 100 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉంటుంది.
- భారత దేశపు మొట్టమొదటి ఇథనాల్ ప్లాంట్‌ను బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఏర్పాటు చేశారు.
బీహార్‌లోని జముయ్ జిల్లాలో 222.88 మిలియన్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. దేశంలో ఇదే అతిపెద్ద బంగారు రిజర్వ్‌గా పేర్కొంటున్నారు. వీటి తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని తాజాగా నితిశ్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించింది. - కుల ఆధారిత గణనను చేపట్టాలని జూన్ 1న బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పార్టీల సంయుక్త సమావేశం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ నేతృత్వంలో జరిగింది. ‘జాతి ఆధారిత గణన’ అనే పేరుతో గణనను నిర్వహించనున్నారు.
జార్ఖండ్
జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారాలో ఉన్న అన్ని పంచాయతీల్లో కమ్యూనిటీ లైబ్రరీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధంగా పూర్తి స్థాయిలో ఒక జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కమ్యూనిటీ లైబ్రరీలు ప్రారంభం కావడం ఇదే ప్రథమం. ఈ జిల్లాల్లో ఎనిమిది లక్షల జనాభా ఉంది. 118 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలతో పాటు బ్యాంకింగ్, మూలధన మార్కెట్, ఎగుమతులు-దిగుమతులు, ప్రభుత్వ ఆర్థిక విధానాలు, బడ్జెటింగ్ అంశాలు ఉంటాయి. వాటిని పరిశీలిస్తే..
వ్యవసాయ రంగం
కిసాన్ సమ్మాన్ నిధి:
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం ఇది. పదో విడత నగదును జనవరి 1న రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఏటా రూ.6000 ప్రతి రైతు కుటుంబానికి ఇస్తుంది. మూడు విడతల్లో ఇది వారికి అందుతుంది. ప్రతి ఇన్స్టాల్మెంట్లో రూ.2000 చెల్లిస్తారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రం. రైతుబంధు పేరుతో దీనిని అమలు చేస్తుంది. ప్రతి ఎకరాకు ఏటా రూ.10,000 చొప్పున భూ యజమానులకు ఇస్తుంది. అలాగే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు కూడా ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్నాయి.
ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంఎస్కేవై):
మార్చి 2026 వరకు దీనిని పొడిగించారు. దీనికి రూ.4600 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని 2017లో ఎస్ఏఎంపీఏడీఏ పేరుతో ప్రారంభించారు. దీనిని అదే ఏడాది పీఎంఎస్కేవైగా మార్చారు.
జీవా ప్రారంభం:
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డ్ జీవా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఇందుకు ఒక్కో హెక్టార్‌కు రూ.50,000 వ్యయం చేయనుంది.
పునరుత్పాదక శక్తి:
2024 నాటికి వ్యవసాయ రంగంలో డీజిల్ స్థానంలో పునరుత్పాదక శక్తిని వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. 2030 నాటికి శిలాజేతర ఇంధనాల వాటా పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2070 నాటికి శూన్య ఉద్గారాల దేశంగా అవతరించే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు
మేరీ పాలసీ మేరీ హాత్:
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రయోజనాలను రైతులు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మేరీ పాలసీ మేరీ హాత్ పేరుతో కేంద్రం మరో పథకాన్ని ప్రారంభించింది.
అగ్రిబజార్:
దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ వాణిజ్య విపణి అగ్రి బజార్. రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో పంట విధానాన్ని ప్రారంభించింది. అగ్రి బజార్లో నమోదు చేసుకున్న దాదాపు మూడు లక్షల మంది ప్రస్తుతం ఈ సేవలను పొందుతున్నారు. రానున్న 12 నెలల్లో మరో 10 లక్షల మంది చేరొచ్చని అంచనా. ఈ తరహా వ్యవసాయ విధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. తక్కువ వ్యయంతో, ఎక్కువ దిగుబడిని పొందేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
ఈ-గోపాల:
పాల ఉత్పత్తి చేసే రైతులకు ప్రయోజనం అందించేందుకు కేంద్రం ఈ-గోపాల అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది 12 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో తెలుగు కూడా ఉంది.
రికార్డ్ స్థాయిలో వ్యవసాయ ఎగుమతులు:
2021 -22 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 50.21 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యవసాయ ఎగుమతి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 17.66% ఎగుమతులు పెరిగాయి.
చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానం:
చక్కెర ఉత్పత్తిలో అయిదు సంవత్సరాలుగా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. తాజాగా ఆ స్థానాన్ని ఉత్తరప్రదేశ్ చేజిక్కించుకుంది.
రైతుల బలోపేతం కోసం:
రైతులను బలోపేతం చేసే ఉద్దేశంతో ‘కిసాన్ భాగిదారి ప్రాథ్మిక్తా హమారి’ పేరుతో ఒక ప్రచారాన్ని కేంద్రం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలతోపాటు ఇతర వ్యవసాయ వ్యవస్థల ద్వారా పార్లమెంట్ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. అలాగే ఈ-నామ్, ఏపీఎంసీ తదితర వ్యవస్థలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రైతులకు అందిస్తారు. ఇందులో భాగంగా ఫసల్ బీమా పాఠశాలను కూడా ప్రారంభించనున్నారు.
వ్యవసాయ రంగంలో డ్రోన్ పరిజ్ఞానం:
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకు ‘వ్యవసాయ యాంత్రీకరణ సబ్మిషన్’లో పలు మార్పులను చేసింది. ఇందులో భాగంగా ఆర్థిక సాయం 2023 మార్చి 31 వరకు అందుతుంది. డ్రోన్ల వినియోగానికి 40-100% రాయితీ ఇవ్వనున్నారు. వ్యవసాయ యాంత్రిక శిక్షణ సంస్థలు, ప్రయోగ వ్యవస్థలు, ఐసీఏఆర్, కృషి విజ్ఞాన్ కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు 100% రాయితీ ఇస్తారు. వ్యవసాయ గ్రాడ్యుయేట్ల నేతృత్వంలోని కస్టమర్ హైరింగ్ సెంటర్లకు రూ.5 లక్షలు లేదా డ్రోన్ ధరలో 50% రాయితీ లభిస్తుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు అలాగే సహకార వ్యవస్థల ఆధ్వర్యంలోని కస్టమర్ హైరింగ్ సెంటర్లకు 40% లేదా రూ.4 లక్షల వరకు రాయితీ లభిస్తుంది.
– వీ రాజేంద్ర శర్మ, ఫ్యాకల్టీ
ఎడ్యురిపబ్లిక్ – 98492 12411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?