నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కు ఎంపికైన తెలుగు చిత్రం ?
తెలంగాణ
దీపికా రెడ్డి
తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీపికా రెడ్డి జూలై 24న నియమితులయ్యారు. ఈమె ఈ పదవిలో రెండేండ్లు ఉంటారు.
వేణుగోపాల్
ప్రముఖ కవి, విమర్శకుడు డా.అమ్మంగి వేణుగోపాల్ ఈ ఏడాది డా.సినారె పురస్కారం జూలై 26న అందుకున్నారు. అవార్డు కింద రూ.25 వేల నగదు, జ్ఞాపికను అందజేశారు.
అంతర్జాతీయం
ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఇండెక్స్
ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) రూపొందించిన వరల్డ్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ డేటాసెట్-2021ని జూలై 25న విడుదల చేసింది. 180కి పైగా దేశాల్లోని 2,600 పైగా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులతో ఏసీఐ ఈ సూచీని రూపొందించింది. అమెరికాలోని జార్జియాలో ఉన్న హార్ట్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది. డల్లాస్/ఫోర్ట్ వర్త్ టీఎక్స్ (యూఎస్) 2, డెన్వెర్ కో (యూఎస్) 3, చికాగో (యూఎస్) 4, లాస్ ఏంజెల్స్ (యూఎస్) 5, చార్లాట్ ఎన్సీ (యూఎస్), 6, ఆర్లాండో ఎఫ్ఎల్ (యూఎస్) 7, గ్వాన్జౌ (చైనా) 8, చెంగ్డు (చైనా) 9, లాస్ వెగాస్ (యూఎస్) 10వ స్థానాల్లో నిలిచాయి.
ఈ జాబితాలో భారత్‌లోని న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ 13వ స్థానంలో, టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ 14వ స్థానంలో ఉన్నాయి. కెనడాలోని మాంట్రియల్లో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఏసీఐని 1991లో స్థాపించారు. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని డిసెంబర్ 7న నిర్వహిస్తారు.
చైనా ల్యాబ్ మాడ్యూల్
చైనా తన శాశ్వత అంతరిక్ష కేంద్రానికి రెండో స్పేస్ వెంటియన్ ల్యాబొరేటరీ మాడ్యూల్‌ను జూలై 25న విజయవంతంగా ప్రయోగించింది. చైనా ప్రస్తుతం తియాంగాంగ్ అనే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులోని కోర్ భాగమైన తియాన్హే ఏడాది కిందటే సిద్ధమైంది. దీనిలో ముగ్గురు వ్యోమగాములు ఉంటున్నారు. రెండో భాగమైన వెంటియాన్ ల్యాబ్ మాడ్యూల్‌ను నింగిలోకి పంపింది. ఇది అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ముందు భాగంలో అనుసంధానమైంది. ఈ అంతరిక్ష కేంద్రాన్ని ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయితే సొంతంగా స్పేస్ స్టేషన్‌ను కలిగిన ఏకైక దేశంగా చైనా నిలుస్తుంది.
వరల్డ్ హెపటైటిస్ డే
వరల్డ్ హెపటైటిస్ డేని జూలై 28న నిర్వహించారు. 1967లో అమెరికన్ వైద్యుడు బరూచ్ శామ్యూల్ బ్లూమ్‌బెర్గ్ హెపటైటిస్ బి వైరస్‌ను కొనుగొన్నాడు. ఆయన పుట్టిన రోజైన జూలై 28న ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని 2007లో నిర్ణయించి 2008 నుంచి పాటిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘బ్రింగింగ్ హెపటైటిస్ కేర్ క్లోజర్ టు యూ’.
జాతీయం
5 కొత్త రామ్సర్ సైట్లు
భారత్‌లో కొత్తగా 5 ప్రదేశాలను రామ్సర్ జాబితాలో చేర్చారని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ జూలై 26న వెల్లడించారు. తమిళనాడులోని కలికిరి పక్షుల అభయారణ్యం, పల్లికరణై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్, పిచ్చవరం మాంగ్రూవ్, మిజోరంలోని పాల వెట్లాండ్, మధ్యప్రదేశ్‌లోని సఖ్య సాగర్ ఈ జాబితాలో చేరాయి. దీంతో దేశంలోని రామ్సర్ సైట్ల జాబితా 49 నుంచి 54కు చేరింది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (ఇంటర్నేషనల్ వెట్‌ల్యాండ్ డే) ఫిబ్రవరి 2.
సంపన్న మహిళల జాబితా
దేశంలోని మహిళా సంపన్నుల జాబితాను రున్ ఇండియా జూలై 27న విడుదల చేసింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా మొదటి స్థానంలో నిలిచారు. ఫల్గుణి నాయర్ (నైకా సీఈవో, వ్యవస్థాపకురాలు) 2, కిరణ్ మజుందార్ షా (బయోకాన్ వ్యవస్థాపకురాలు) 3, నీలిమ మోటపర్తి (దివీస్ ల్యాబొరేటరీ డైరెక్టర్) 4, రాధా వెంబు (జోహో) 5, లీనా గాంధీ తివారీ (యూఎస్వీ) 6, అను అగా, మెహర్ పుదుమ్‌జీ (థర్మాక్స్) 7, నేహ నర్ఖేడే (కాన్ఫ్లూయెంట్) 8, వందన లాల్ (లాల్ పాథ్ ల్యాబ్స్) 9, రేణు ముంజల్ (హీరో ఫిన్‌కార్ప్) 10వ స్థానాల్లో నిలిచారు.ఈ జాబితాలో ఢిల్లీ నుంచి 25 మంది ఉండగా.. తరువాతి స్థానాల్లో ముంబై (21), హైదరాబాద్ (12) ఉన్నాయి.
విక్రాంత్
దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ను భారత నౌకాదళానికి జూలై 28న కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అందజేసింది. ఆగస్టు 15 నుంచి దీనిని నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. రూ.20 వేల కోట్లతో నిర్మించిన విక్రాంత్ నాలుగో, తుది దశ సీ ట్రయల్స్‌ను కొద్దిరోజుల క్రితం విజయవంతంగా పూర్తిచేశారు.
వార్తల్లో వ్యక్తులు
దినేశ్ గుణవర్దెన
శ్రీలంక ప్రధానిగా మహాజన ఏక్నాథ్ పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్ గుణవర్దెన జూలై 22న ప్రమాణం చేశారు. సంక్షోభం కారణంగా గత మూడు నెలల్లో నియమితులైన మూడో ప్రధాని ఆయన.
వాస్ఫియా నజ్రీన్
బంగ్లాదేశ్ పర్వతారోహకురాలు వాస్ఫియా నజ్రీన్ పాకిస్థాన్‌లోని రెండో ఎత్తయిన కే2 శిఖరాన్ని అధిరోహించినట్లు ఆమె జూలై 22న ఇన్‌స్టాలో వెల్లడించారు. దీంతో ఈ శిఖరాన్ని అధిరోహించిన బంగ్లాదేశ్‌కు చెందిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. దీని ఎత్తు 8,611 మీ. (28,251 అడుగులు). 2012లో ఎవరెస్ట్‌ను అధిరోహించిన బంగ్లాదేశ్‌కు చెందిన రెండో మహిళగా నిలిచారు.
షేక్ అహ్మద్
కువైట్ కొత్త ప్రధాన మంత్రిగా షేక్ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాను నియమిస్తూ పాలకుడు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా జూలై 24న ఉత్తర్వులు జారీచేశారు. కువైట్ 12వ పాలకుడు షేక్ సబా అల్ సలేమ్ అల్ సబా నాలుగో కుమారుడు.
బజ్రమ్ బేగాజ్
అల్బేనియా 9వ అధ్యక్షుడిగా బజ్రమ్ బేగాజ్ జూలై 24న ప్రమాణం చేశారు. జూన్ 4న నిర్వహించిన ఎన్నికల్లో బేగాజ్కు మొత్తం 83 ఎంపీ ఓట్లల్లో 73 లభించాయి. అల్బేనియా రాజధాని టిరానా, కరెన్సీ అల్బేనియన్ లెక్.
ఇందర్మిత్ గిల్
వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఇందర్మిత్ గిల్ జూలై 25న నియమితులయ్యారు. కౌశిక్ బసు తర్వాత ప్రపంచ బ్యాంకులో చీఫ్ ఎకనామిస్ట్ గా నియమితులైన రెండో భారతీయుడు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్.
క్రీడలు
మాక్స్ వెర్స్టాపెన్
మాక్స్ వెర్స్టాపెన్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్‌ను గెలిచాడు. జూలై 24న నిర్వహించిన ఈ ఫార్ములా వన్ రేసులో వెర్స్టాపెన్ గెలవగా.. ఏడుసార్లు చాంపియన్ అయిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. లూమిస్ హామిల్టన్‌కు ఇది 300వ గ్రాండ్ ప్రిక్స్.
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
అమెరికాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ జూలై 25న ముగిసింది. ఈ పోటీలకు తొలిసారిగా అమెరికా ఆతిథ్యమిచ్చింది. ఈ పోటీల్లో 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు మొత్తం 33 పతకాలతో మొదటిస్థానంలో నిలిచింది. ఇథియోపియా (4, 4, 2) 2, జమైకా (2, 7, 1) 3, కెన్యా (2, 5, 3) 4, చైనా (2, 1, 3) 5, ఆస్ట్రేలియా (2, 0, 1) 6, పెరు (2, 0, 0) 7, పోలెండ్ (1, 3, 0) 8వ స్థానాల్లో నిలిచాయి. భారత్ ఒకే ఒక రజతం (నీరజ్ చోప్రా)తో 33వ స్థానంలోస్థానంలో నిలిచింది.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ జూలై 22న ప్రకటించారు. దీనిని 1954లో స్థాపించారు.
బెస్ట్ యాక్టర్: సూర్య, (సూరరై పోట్రు-తమిళం), అజయ్ దేవగణ్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్-హిందీ) సంయుక్తంగా.
బెస్ట్ యాక్టెస్ (నటి): అపర్ణా బాలమురళి (సూరరై పోట్రు)
ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు
ఉత్తమ తెలుగు చిత్రం: కలర్‌ఫొటో
ఉత్తమ చిత్రం (సామాజిక అంశాలు): ఫ్యునెరల్ (మరాఠీ)
ఉత్తమ చిత్రం (పర్యావరణ పరిరక్షణపై): తలెదంద (కన్నడ)
ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రం: తానాజీ: ది అన్సంగ్ వారియర్
ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్ సచ్చిదానందన్ అలియాస్ సచి (అయ్యప్పనుమ్ కోషియమ్-మలయాళం)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (ఇందిరాగాంధీ అవార్డు): మడోన్నె అశ్విన్, మండేలా (తమిళం)
ఉత్తమ సంగీతం (పాటలు): అల వైకుంఠపురములో (తమన్)
ఉత్తమ నేపథ్య సంగీతం: సూరరై పోట్రు (జీవీ ప్రకాశ్ కుమార్)
ఉత్తమ గీత రచన: మనోజ్ ముంతశిర్ (సైనా-హిందీ)
ఉత్తమ పోరాటాలు: రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీం సుందర్ (అయ్యప్పనుమ్ కోషియమ్)
ఉత్తమ సహాయ నటుడు: బిజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియమ్)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీప్రియ చంద్రమౌళి (శివరంజనీయుం ఇన్నుమ్ సిల పెన్గలుమ్- తమిళం)
ఉత్తమ నృత్యాలు: సంధ్యారాజు (నాట్యం-తెలుగు)
ఉత్తమ మేకప్ కళాకారుడు: టీ రాంబాబు (నాట్యం-తెలుగు)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: నచికేత్ బర్వే, మహేష్ షెర్లా (తానాజీ)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: అనీశ్ నడోడి (కప్పేలా-మలయాళం)
బెస్ట్ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం ఇస్నుమ్ సిల పెన్గలుమ్)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్: షాలిని ఉషా నాయర్, సుధా కొంగర (సూరరై పోట్రు)
ఉత్తమ సంభాషణల రచయిత: మడోన్నె అశ్విన్ (మండేలా-తమిళం)
ఉత్తమ ఛాయాగ్రహణం: సుప్రతిమ్ భోల్ (అవిజత్రిక్-బెగాలీ)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: రాల్ దేశ్‌పాండే (మివసంత్రవో-మరాఠీ)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): నంచమ్మ (అయ్యప్పనుమ్ కోషియమ్)
ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠీ)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠీ)
అర్చన కే
ఉపాధ్యాయురాలు, విషయనిపుణులు
నల్లగొండ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?