Telangana Current Affairs | చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డు గెలుచుకున్న గ్రామం?
ఏప్రిల్ 19వ తేదీ తరువాయి..
136. కింది వాటిని జతపర్చండి.
1. పిల్లలమర్రి డీర్ పార్క్ ఎ. మహబూబ్‌నగర్
2. మృగవని నేషనల్ పార్క్ బి. రంగారెడ్డి
3. శివరాం వైల్డ్‌లైఫ్ శాంక్చువరి సి. మంచిర్యాల, పెద్దపల్లి
4. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ డి. హైదరాబాద్
ఇ. మేడ్చల్ మల్కాజిగిరి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
4) 1-ఎ, 2-ఇ, 3-సి, 4-డి
137. EPTRI ఇన్స్టిట్యూట్ దేనికి సంబంధించింది?
1) ఎడ్యుకేషన్
2) ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్
3) ఎనర్జీ సేవింగ్ 4) ఏదీకాదు
138. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి (తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం)
ఎ. ఘన వ్యర్థాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం దుండిగల్‌లో 14.5 మెగావాట్ల సామర్థ్యం గల ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించింది
బి. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును జవహర్ నగర్ వద్ద ఏర్పాటు చేశారు
1) ఎ, బి 2) ఎ 3) బి 4) ఎ, బి సరికావు
139. CBWTF ఫెసిలిటీ దేనికి సంబంధించింది?
1) వినియోగదారుల వ్యవహారాలకు
2) బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణకు
3) ైక్లెమేట్ (వాతావరణ) మార్పులకు
4) ఏదీకాదు
140. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
ఎ. రాష్ట్రంలోని మొత్తం జూలాజికల్ పార్కులు-2 (నెహ్రూ, కాకతీయ)
బి. ప్రభుత్వం ఆధీనంలోని జింకల పార్కులు-4
సి. ప్రైవేట్ జింకల పార్కులు- 2
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
141. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. ఇన్-సిటు పరిరక్షణలో భాగంగా వివిధ జీవ జాతులను సంరక్షించడానికి వన్యప్రాణి అభయారణ్యాలు, జాతీయ పార్కులు, బయో డైవర్సిటీ కేంద్రాలు ఉంటాయి
బి. ఎక్స్-సిటు పరిరక్షణలో భాగంగా జీవ జాతులను సంరక్షించడానికి జూలాజికల్ పార్కులు, నర్సరీలు, బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఎ, బి సరికావు
142. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
(తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం)
ఎ. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మొత్తం విస్తీర్ణం 2611 చ.కి.మీ.
బి. ఈ టైగర్ రిజర్వ్ నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. దేశంలోని మొత్తం 52 టైగర్ రిజర్వ్‌లలో విస్తీర్ణం పరంగా ఇది 5వ అతిపెద్దది
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
143. కింది వాటిలో సరైన జతలు ఎన్నో గుర్తించండి?
ఎ. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్- హైదరాబాద్ జిల్లా
బి. మృగవని నేషనల్ పార్క్- రంగారెడ్డి జిల్లా
సి. మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
1) ఎ 2) బి 3) సి 4) జీరో
144. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను, గ్రామ పంచాయతీల పాలనను మెరుగుపర్చాలనే లక్ష్యాలతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది
బి. ఈ కార్యక్రమం ద్వారా 2022 జూన్ నాటికి 5 దశల్లో (రౌండ్లలో) చేపట్టారు
సి. 2022 జూన్ నాటికి ఈ కార్యక్రమం కింద రూ.14,235.50 కోట్లు గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసింది
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి 4) బి, సి
145. తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం రాష్ట్రంలో అత్యధిక గ్రామ పంచాయతీలున్న మొదటి మూడు జిల్లాలను గుర్తించండి?
1) నల్లగొండ, సంగారెడ్డి, ఖమ్మం
2) నల్లగొండ, వికారాబాద్, కామారెడ్డి
3) నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం
4) నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి
146. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం కింది వాటిలో సరైనవి?
ఎ. 2022, డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు- 9
బి. 2022, డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మండల పరిషత్‌లు- 540
సి. 2022, డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం గ్రామపంచాయతీలు- 12,769
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
147. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు-2022 (అప్రైజల్ ఇయర్ 2020-21)ను చందాపూర్ (వనపర్తి జిల్లా) గెలుచుకుంది
బి. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు-2022 (అప్రైజల్ ఇయర్ 2020-21)ను ఎర్రవల్లి (సిద్దిపేట జిల్లా) గెలుచుకుంది
సి. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్-2022 (అప్రైజల్ ఇయర్ 2020-21)ను మంథన్‌గోడ్ (నారాయణపేట జిల్లా) గెలుచుకుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
148. పల్లె ప్రగతి దశలు, అవి జరిగిన సమయానికి సంబంధించి సరైన జతలు గుర్తించండి?
ఎ. 1వ దశ- 2019, సెప్టెంబర్ 6 – అక్టోబర్ 5
బి. 2వ దశ- 2020, జనవరి 2 – జనవరి 12
సి. 3వ దశ- 2021, జూన్ 1 – జూన్ 8
డి. 4వ దశ- 2022, ఆగస్ట్ 1 – ఆగస్ట్ 10
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, డి
149. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. రాష్ట్రంలో రూ.1329.73 కోట్లతో 12,742 వైకుంఠధామాలు పూర్తయ్యాయి
బి. రూ.279.10 కోట్లతో 12,753 డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది
సి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో 10 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) బి, సి
150. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి? (తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం)
ఎ. రాష్ట్రంలో నిర్మించిన మొత్తం రైతు వేదికల సంఖ్య- 2601
బి. రాష్ట్రంలో నిర్మించిన మొత్తం కల్లాలు (డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్స్)- 22,858
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఎ, బి సరికావు
151.MGNREGSకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. 2022-23కు గాను (2023, జనవరి 18 నాటికి ఫిజికల్ పర్ఫామెన్స్ పరంగా) అత్యుత్తమ స్థానంలో ఉన్న మొదటి జిల్లా జయశంకర్ భూపాలపల్లి
బి. 2022-23కు గాను (2023, జనవరి 18 నాటికి ఫిజికల్ పర్ఫామెన్స్ పరంగా) అట్టడుగు స్థానంలో ఉన్న జిల్లా కామారెడ్డి
సి. MGNREGS ఫిర్యాదులకు సంబంధించిన టోల్ ఫ్రీ నం. 1800-200-1011
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, సి
152. సమతుల్య ఆహారం, రక్తహీనత నివారణ ఇలా ఏదో ఒక థీమ్‌కు సంబంధించి ప్రతి నెలా రెండో వారంలో ‘ద్వితీయ’ అనే సమావేశాన్ని నిర్వహించేది ఎవరు?
1) SGH లు 2) FPO లు
3) PHC లు 4) ఎవరూకాదు
153. కింది వాటిలో SERP నిర్వహించే కార్యక్రమాన్ని గుర్తించండి?
ఎ. జెండర్ సెన్సిటైజేషన్ బి. న్యూట్రి గార్డెన్స్
సి. కమ్యూనిటీ మేనేజ్డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) బి, సి
154. అజీవక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన (AGEY) కింద స్వయం సహాయక సంఘా ల మహిళలకు ఏ రకమైన కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి వడ్డీలేని రుణాలను అందిస్తుంది?
1) వ్యవసాయం 2) రవాణా
3) నిర్మాణ రంగం 4) ఏదీకాదు
155. SARAS ఫెయిర్ ఉద్దేశం ఏమిటి?
1) SGH లకు వివిధ ఆర్టికల్ అంశాలపై శిక్షణ కోసం
2) SGH లకు విద్యా అంశాలపై శిక్షణ కోసం
3) SGH లు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం, అమ్మడం కోసం
4) ఏదీకాదు
156. ఓడీఎఫ్ ప్లస్ సూచికల సాధనను కొలవడానికి జిల్లాలకు క్రమం తప్పకుండా డెల్టా ర్యాంకింగ్‌లను అందిస్తున్నారు. ఈ డెల్టా ర్యాంకింగ్‌లు ఐదు రకాలుగా వర్గీకరించగా అత్యుత్తమ వర్గీకరణ అయిన ఫ్రంట్ రన్నర్స్ (స్కోర్ 100)ను సాధించిన దేశంలో ఏకైక జిల్లాను గుర్తించండి?
1) రాజన్న సిరిసిల్ల 2) కరీంనగర్
3) పెద్దపల్లి 4) మేడ్చల్
157. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) కింద గ్రామాలకు వివిధ కొలమానాల ఆధారంగా భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్ ఇస్తుంది
బి. 2022-23లో దేశంలో ఎస్ఏజీవై పనితీరు కనబరిచిన టాప్ 20 గ్రామాల్లో 11 గ్రామాలు తెలంగాణకు చెందినవి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
158. 2023, జనవరి 23 నాటికి తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)కు సంబంధించి కింది ఏ సూచీల్లో వంద శాతం అచీవ్మెంట్ సాధించింది?
1) ఘన వ్యర్థ నిర్వహణ ఏర్పాట్లు గల గ్రామాలు
2) అతి తక్కువ చెత్త ఉన్న గ్రామాలు
3) నిల్వ నీరు అతి తక్కువగా ఉన్న గ్రామాలు
4) ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ఏర్పాట్లు గల గ్రామాలు
159. కింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, అవి ఏర్పాటైన సంవత్సరానికి సంబంధించి సరైన జతలను గుర్తించండి?
ఎ. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- 2017
బి. మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- 2022
సి. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- 2017
డి. నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- 2022
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, సి 4) పైవన్నీ సరైనవే
160. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం అత్యధిక అర్బన్ లోకల్ బాడీలున్న మొదటి రెండు జిల్లాలను గుర్తించండి?
1) రంగారెడ్డి, సంగారెడ్డి
2) రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి
3) మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి
4) ఏదీకాదు
161. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. నాంపల్లి వద్ద జర్మన్ పజిల్ పార్కింగ్ టెక్నాలజీతో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) చేపట్టనుంది
బి. రాయదుర్గం టెర్మినల్ స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కి.మీ. పొడవైన ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు నిర్మాణాన్ని రూ.6,250 కోట్లతో చేపట్టనుంది
సి. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో రైలు ప్రాజెక్టు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
162. హైదరాబాద్ సిటీకి ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూసేది?
1) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)
2) హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్)
3) హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) 4) ఏదీకాదు
163. కింది వాటిలో రోడ్ల నిర్వహణకు/నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమాలను గుర్తించండి?
ఎ. ఎస్ఎన్డీపీ బి. ఎస్ఆర్డీపీ
సి. సీఆర్ఎంపీ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
164. బస్తీ దవాఖానలకు సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో ఒక వార్డుకు 2 బస్తీ దవాఖానలను నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది
బి. 2022, డిసెంబర్ నాటికి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు 263 కాగా, 37 నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఎ, బి సరికాదు
165. అన్నపూర్ణ భోజనానికి సంబంధించి సరైనవి?
ఎ. 2014 నుంచి రూ.5 అన్నపూర్ణ భోజనం పేరుతో పోషకాలతో కూడిన ఆహారాన్ని హెచ్ఎండీఏ అందిస్తుంది
బి. ప్రస్తుతం మొబైల్ వ్యాన్లతో సహా 373 కేంద్రాల ద్వారా మధ్యాహ్నం అన్నపూర్ణ భోజనం సరఫరా అవుతుంది
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఎ, బి సరికాదు
166. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. రాష్ట్ర ప్రభుత్వం చర్యల ఫలితంగా స్వచ్ఛ పర్యవేక్షణ్-2022 ర్యాంకింగ్స్‌లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో హైదరాబాద్ స్థానం 13 నుంచి 11కు చేరింది
బి. 2022 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో ‘వాటర్ ప్లస్’ నగరంగా గుర్తింపు నిలబెట్టుకుంది
సి. రాష్ట్రంలో గల 142 యూఎల్బీల్లో 70 యూఎల్బీలు ఓడీఎఫ్+గా, 42 యూఎల్బీలు ఓడీఎఫ్++గా, 29 యూఎల్బీలు ఓడీఎఫ్‌గా గుర్తింపు పొందాయి
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
సమాధానాలు
136-1, 137-2, 138-1, 139-2, 140-2, 141-1, 142-2, 143-2, 144-2, 145-1, 146-1, 147-3, 148-1, 149-1, 150-1, 151-2, 152-1, 153-2, 154-2, 155-3, 156-1, 157-3, 158-1, 159-4, 160-1, 161-4, 162-3, 163-2, 164-1, 165-3, 166-1.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?