Science & Technology | కృత్రిమ మేధ.. మనిషిని మించిన యోధ!
బ్లాగ్ రాయలా? నిమిషంలో రాసేస్తుంది. పాట రాయాలా? గొప్ప రచయితలా చకటి పదాలతో అల్లేస్తుంది. ఆ పాటను ఫేవరెట్ సింగర్ గొంతుతో పాడాలా? సిద్ధం అంటుంది. అంతే కాదండోయ్ మ్యూజిక్ డైరెక్టర్లా మారి చకటి బాణీ సమకూర్చుతుంది. అంతేకాదు మేటి సాఫ్ట్వేర్ ఇంజినీర్లా కోడింగ్ కూడా చేస్తుంది. ఇన్ని నైపుణ్యాలు కలిగిన మనిషి ఎవరనుకుంటున్నారా? మనిషి కాదు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.
పెరిగిన పెట్టుబడులు
- ఆరు నెలల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టిన మనిషిలా చాటింగ్ చేయగలిగే చాట్‌జీపీటి, మైక్రోసాఫ్ట్ వారి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బింగ్ సెర్చ్ ఇంజిన్, మనకు కావాల్సిన చిత్రం ఎలా ఉండాలో చెబితే వెంటనే గీసి పెట్టే మిడ్ జర్నీ వంటి టూల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.
- చాట్‌జీపీటి విషయానికి వస్తే కేవలం రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వాడటం మొదలుపెట్టారు. ఇంటర్నెట్ ఆరంభం నుంచి నేటి వరకు ఇంత వేగంగా ప్రాచుర్యం పొందిన మరొక అప్లికేషన్ లేదని చెబుతున్నారు టెక్నాలజీ నిపుణులు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే వేలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు 2013తో పోలిస్తే 2022లో పద్దెనిమిది రెట్లు పెరిగాయి.
- ఇంత జరుగుతున్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ శకానికి ఆరంభం మాత్రమే. వైద్యం, విద్య, వ్యవసాయం, బ్యాంకింగ్ ఇంకా చాలా రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించబోతున్నాం.
- అందుకే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి ‘మానవుడు కనుగొన్న వాటిల్లో విద్యుత్, నిప్పు కంటే కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యమైంది’ అని అన్నారు. ఇది సాధారణమైన టెక్నాలజీ కాదని అర్థమవుతుంది కదా. అలాగే అది మన ప్రపంచ సంపదకి ఎంత విలువను తీసుకురాబోతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మెకిన్సే రిపోర్ట్ ప్రకారం ఏటా 13 ట్రిలియన్ అంటే 10 కోట్ల రూపాయలను 2030కి సృష్టించనుంది. అంటే ఈ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాలు మెండుగా ఉన్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి?
- మేధస్సు కలిగిన తెలివైన యంత్రాలను తయారు చేయడమే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ఇకడ యంత్రం అంటే కేవలం మనిషిలా ఉండే రోబో అనుకుంటే పొరపాటే. అది స్మార్ట్‌ఫోన్ అవ్వొచ్చు, కార్ అవ్వొచ్చు, ఫ్రిడ్జ్ అవ్వొచ్చు అలాగే తయారీ పరిశ్రమల్లో భారీ యంత్రం కావొచ్చు. ముఖం చూపించగానే ఫోన్ అన్‌లాక్ అవుతుందంటే ముఖాన్ని గుర్తుపట్టే తెలివి ఫోన్‌కు ఉన్నట్టే కదా. అలాగే డ్రైవర్ రహిత వాహనాల గురించి కూడా విన్నాం. డ్రైవర్ లాగా కార్‌ను నడిపే తెలివి వాటికి ఉంటుందన్న మాట. ఇలాంటి తెలివైన యంత్రాలను తయారు చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు మెషిన్ లెర్నింగ్ ఒకటి.
- మనిషికి ఉన్న ముఖ్యమైన సిల్ గమనించడం. చూడటం, వినడం, తాకడం ద్వారా సమాచారాన్ని మెదడుకు అందిస్తాం. అంతక్రితం మెదడుకు అనుభవంలో ఉన్న విషయాలను పరిగణించి వాటిలో పేటర్న్స్ను మెదడు గుర్తించగలుగుతుంది. అలా గుర్తించిన పేటర్న్స్ను ఉపయోగించి కొత్త సమాచారానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది.
- ఇదే విధంగా ఒక యంత్రానికి ఇలా పేటర్న్స్ను గుర్తించేలా శిక్షణ ఇవ్వొచ్చు. ఎలాగైతే వినడం, చూడటం ద్వారా మెదడుకు సమాచారం అందుతుందో ఈ యంత్రాలకు శిక్షణ ఇవ్వడానికి కూడా సమాచారం అందించాలి. ఈ సమాచారాన్నే డేటా అంటాం. ఈ డేటా టెక్ట్స్, ఆడియో, వీడియో ఇలా పలు రకాలుగా ఉంటుంది. అలాంటి డేటా నుంచి పేటర్న్స్ను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తాం. ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడుకొని యంత్రం తెలివిగా వ్యవహరిస్తుంది.
- అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఉబెర్, టెస్లా వంటి సంస్థలు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి సంస్థలను అభివృద్ధి చేసుకోడమే కాకుండా వారి కస్టమర్లకు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వగలుగుతున్నాయి. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని సినిమాలు చూస్తే అందులో ఉపయోగించే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ పేటర్న్స్ను గమనించి అటువంటి సినిమాలే మనకు సలహాలుగా చూపిస్తుంది. అలాగే ఆటోమొబైల్ రంగంలో అద్భుతమైన మైలురాయిగా నిలిచిన టెస్లా కారులోని ఆటో పైలట్‌లో కూడా ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తారు.
రెండు రకాలు
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అనలిటికల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఇంటెలిజెన్స్. ఒక డేటాని విశ్లేషించి అందులో పేటర్న్స్ను గుర్తించి వాటిని వివిధ రకాలుగా ఉపయోగించడమే అనలిటికల్ ఇంటెలిజెన్స్. ఉదాహరణకు స్విగ్గీ లేదా జొమాటోలో ఇష్టమైన వంటకాన్ని ఆర్డర్ చేసినప్పుడు, ఆర్డర్ చేరడానికి ఎంత సమయం పడుతుందో అనలిటికల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించే చూపిస్తారు. అలాగే పైన చెప్పినట్టు నెట్‌ఫ్లిక్స్ సినిమా సలహాలు ఇవ్వడం, డ్రైవర్ రహిత వాహనం ఇవి కూడా అనలిటికల్ ఇంటెలిజెన్స్‌కు ఉదాహరణలే.
- మనుషులకు సమాచారాన్ని విశ్లేషించడమే కాకుండా సృజనాత్మకత కూడా ఉంటుంది. అంటే ఊహా శక్తితో కొత్తదాన్ని సృష్టించగలం. ఉదాహరణకు కవిత్వం రాయడం, కథలు రచించడం, అందమైన చిత్రాలు గీయడం ఇలా ఎన్నో చేయగలం. కొంతకాలం క్రితం వరకు సృజనాత్మకత అవసరమయ్యే పనులను యంత్రాలు చేయలేకపోయేవి. కానీ ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో జరిగిన అభివృద్ధితో సృజనాత్మకత అవసరమయ్యే పనులు చేయడంలో యంత్రాలు మెరుగవ్వడం మొదలుపెట్టాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ఈ కొత్త వర్గాన్నే జనరేటివ్ ఇంటెలిజెన్స్ అంటారు.
- మొత్తానికి రాబోయే సంవత్సరాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఎంతగానో మార్చివేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంటే టెక్నాలజీ రంగంలో కొత్త శకం మొదలయ్యింది.
- ఇంత భవిష్యత్తు ఉన్న ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకోవడం చాలా అవసరం. దీనికోసం నెక్ట్స్‌వేవ్ సీసీబీపీ ప్రోగ్రామ్స్ ద్వారా ఏఐ వంటి అధునాతన టెక్నాలజీల్లో శిక్షణ ఇస్తూ ఇండస్ట్రీకి అవసరమైన నిపుణులను తయారు చేస్తుంది. ఈ ప్రోగ్రాం గురించి ఇతర వివరాల కోసం ccbp.in <https://www.ccbp.in/> ను చూడండి. యూట్యూబ్, ఉడెమి, కోర్సెరా వంటి వాటిలో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని నేర్చుకోవచ్చు.
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ప్రాక్టికల్‌గా నేర్చుకుని అప్లికేషన్స్, ప్రాజెక్ట్స్ చేయాలంటే హైసూల్ గణితం, ప్రోగ్రామింగ్‌లోని బేసిక్స్ కూడా నేర్చుకోవాలి.
రాహుల్ అత్తులూరి
సీఈవో
నెక్ట్స్ వేవ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు