Telangana Current Affairs | ధరణి పోర్టల్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
గతవారం తరువాయి..
167. కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి?
ఎ. ఆర్టీడీఏఐ- రియల్ టైమ్ డిజిటల్ అథెంటిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ
బి. ఈ పీవోఎస్- ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్
సి. పీడీఎస్- పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
168. ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకత, సక్రమంగా పని చేయడం, అధికారుల జవాబుదారీతనం కోసం ఫిర్యాదుల నమోదు కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ (24X7) హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తించండి?
ఎ. 1967 బి. 1800 425 00333
సి. 1947
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
169. మీ సేవ ఏ కేటగిరీకి సంబంధించిన సర్వీసులను అందిస్తుంది?
ఎ. జీ టు సీ (గవర్న్మెంట్ టు సిటిజన్)
బి. జీ టు బీ (గవర్న్మెంట్ టు బిజినెస్)
సి. బీ టు సీ (బిజినెస్ టు సిటిజన్)
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
170. తెలంగాణ రాష్ట్రం 2022లో ప్రతి 1000 మంది జనాభాకు వార్షిక ఈ-లావాదేవీల సంఖ్యాపరంగా దేశంలో ప్రత్యేక హోదాలోని రాష్ర్టాల్లో ఎన్నో స్థానంలో నిలిచింది?
1) మొదటి 2) రెండో
3) మూడో 4) నాలుగో
171. ఈటీఏఏఎల్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది?
1) ఈ-లావాదేవీల సంఖ్యను తెలుపుతుంది
2) రవాణా రంగ సేవలను పౌరులకు అందించేది
3) టెలికాం రంగ సేవలకు సంబంధించింది
4) ఏదీకాదు
172. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. మీ సేవ 2.0లో భాగంగా తన ఎం గవర్నెన్స్ (మొబైల్ గవర్నెన్స్) కింద టీ-ఏపీపీ ఫోలియో యాప్‌ను ప్రభుత్వం 2018లో ప్రారంభించింది
బి. ఇది మీ సేవ, ప్రాంతీయ రవాణా అథారిటీ సేవలు, బిల్లు చెల్లింపులు వంటి సేవలను పౌరులకు అందిస్తుంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
173. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ ప్రభుత్వం 2020, అక్టోబర్ 30న ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది
బి. ఇది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యూటేషన్ సేవలను అందిస్తుంది
సి. పోర్టల్‌లోని మొత్తం లావాదేవీల్లో అతిపెద్ద లావాదేవీలుగా 58.9 శాతం భూ విక్రయాలు, 18.6 శాతం బహుమతులు (గిఫ్ట్ డీడ్) ఉన్నాయి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
174. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్-బీ పీఏఎస్ఎస్)ను ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది?
1) 2020, నవంబర్ 16
2) 2021, నవంబర్ 16
3) 2020, సెప్టెంబర్ 16
4) 2022, సెప్టెంబర్ 16
175. కింది వాటిలో సరైనవి?
ఎ. డీవోఎస్‌టీ- డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ
బి. ఎఫ్ఈఎస్టీ- ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్
సి. పీఎల్సీఎస్- పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ అథెంటిఫికేషన్ త్రూ సెల్ఫీ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
176. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. టీ-వాలెట్‌ను 2018లో ప్రారంభించారు
బి. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని మొట్టమొదటి డిజిటల్ వాలెట్
సి. టీ-వాలెట్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ లావాదేవీల కోసం కూడా ఉపయోగించవచ్చు
డి. టీ-వాలెట్ 73 డిపార్ట్మెంట్లకు చెందిన 1032 రకాల సేవలను అందిస్తుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) పైవన్నీ
177. పౌరులు తమ వాహన సంబంధిత పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మోటార్ ఇన్సూరెన్స్ డిజిటల్ కాపీలను స్టోర్ చేయడానికి ప్రభుత్వం రూపొందించిన ఆర్టీఏ ఎం-వాలెట్ మొబైల్ యాప్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2016, మార్చి 2) 2017, మార్చి
3) 2016, ఏప్రిల్ 4) 2017, ఏప్రిల్
178. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 2016, జూలైలో ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌ను ప్రారంభించింది
బి. దీని ద్వారా పెంపుడు కుక్కల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
సి. జనన, మరణ ధ్రువపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
179. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ డయాగ్నస్టిక్స్ యాప్‌ను ప్రభుత్వం 2022, మేలో అందుబాటులోకి తెచ్చింది
బి. రేషన్ కార్డుదారులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో ‘టీ-రేషన్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ సరికాదు
180. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు వారంలో ఏదేని ఒక రోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ‘ప్రజావాణి’ పేరుతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు
బి. ప్రజలు ప్రజావాణి పోర్టల్ ద్వారా లేదా నేరుగా లిఖితపూర్వకంగా తమ ఫిర్యాదులు అందించవచ్చు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
181. ఐ-టీఐఎంఎస్ (ఐ టిమ్స్) కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) టెలికాం రంగ సేవలకు సంబంధించింది
2) ఆరోగ్య రంగ సేవలకు సంబంధించింది
3) ఆన్లైన్ టికెట్ల జారీకి సంబంధించింది
4) ఏదీకాదు
182. టీ సవారి యాప్ ఏ రవాణా వాహన మార్గాల సేవల పైన మాత్రమే సమాచారాన్ని అందిస్తుంది?
ఎ. టీఎస్ఆర్టీసీ బస్సులు
బి. ఎంఎంటీఎస్ రైళ్లు
సి. మెట్రో రైళ్లు
1) ఎ, బి 2) ఎ
3) ఎ, సి 4) ఎ, బి, సి
183. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీ-2016కు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో సరైనది గుర్తించండి?
ఎ. సైబర్ భద్రతా సంఘటనలను పర్యవేక్షించడానికి, ప్రతిస్పందించడానికి రాష్ట్రస్థాయి సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేషన్ సెంటర్ (సీఎస్‌సీసీ) ఏర్పాటు
బి. సైబర్ నేరాలను దర్యాప్తు చేయడానికి, చట్టాన్ని అమలుపరిచే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఎస్ఐయూ) ఏర్పాటు
సి. సైబర్ ఘటనలపై త్వరితగతిన స్పందించేందుకు వీలుగా సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎస్ఐఎంఎస్) ఏర్పాటు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
184. టీ4సీ దేనికి సంబంధించింది?
1) ట్రాన్స్పోర్ట్ సేవలకు
2) సైబర్ మోసాల బాధితులకు సహాయం అందించడానికి
3) మాదకద్రవ్యాల సరఫరాని నిరోధించడానికి
4) ఏదీకాదు
185. ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ దేనికి సంబంధించింది?
1) సైబర్ క్రైమ్స్‌కు సంబంధించి వేగవంతమైన దర్యాప్తునకు ఏర్పాటు చేసింది
2) మాదక ద్రవ్యాల నేరాలకు సంబంధించి దర్యాప్తు అధికారులకు సహాయం కోసం ఏర్పాటు చేసింది
3) పోలీస్ వ్యవస్థలో ఆన్లైన్ మోసాల పట్ల అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసింది
4) ఏదీకాదు
186. పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలు, నేర సమాచారం, పోలీస్ సిబ్బంది ఉల్లంఘనలను నివేదించడానికి, పోలీసింగ్‌ను మెరుగుపరచడానికి, సూచనలను అందించడానికి తెలంగాణ పోలీస్ విభాగం రూపొందించిన యాప్‌ను గుర్తించండి?
1) వెరీ ఫెయిత్ 2) హాక్ ఐ
3) థర్డ్ ఐ 4) ఏదీకాదు
187. పాస్‌పోర్టుల తనిఖీకి, జారీ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్‌ను గుర్తించండి?
1) వెరీ ఫాస్ట్ 2) స్పీడ్
3) సూపర్ ఫాస్ట్ 4) ఏదీకాదు
188. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో ఆధునిక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ)తో కూడిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రాంభించారు?
1) 2022, ఆగస్ట్ 4 2) 2022, ఆగస్ట్ 3
3) 2022, ఆగస్ట్ 2 4) 2022, ఆగస్ట్ 1
189. H-TRIMS దేనికి సంబంధించింది?
1) హైదరాబాద్ నగర నీటి సమస్యలకు
2) హైదరాబాద్ నగర ఆరోగ్య సేవలకు
3) హైదరాబాద్ నగర ట్రాఫిక్ మేనేజ్మెంట్కు
4) ఏదీకాదు
190. 2014, అక్టోబర్ 24న మహిళల భద్రతకు సంబంధించి ఏర్పాటు చేసింది షీ టీమ్స్. 2022, డిసెంబర్లో రాష్ట్రంలో పర్యటించిన ఎవరు షీ టీమ్స్ ప్రాముఖ్యం గురించి వివరించారు?
1) భారత ప్రధాని 2) భారత రాష్ట్రపతి
3) కేంద్ర హోంశాఖ మంత్రి
4) ఎవరూ కాదు
191. అవతార్ గ్రూప్ (డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సొల్యూషన్స్ సంస్థ) 2022, జనవరిలో నిర్వహించిన అధ్యయనంలో దేశంలోని మొదటి 25 మహిళల స్నేహపూర్వక నగరాల జాబితాలో హైదరాబాద్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) మొదటి 2) రెండో
3) మూడో 4) నాలుగో
192. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. 2019లో తెలంగాణ ప్రభుత్వం మానవ అక్రమ రవాణా వ్యవస్థను అరికట్టడానికి 31 జిల్లాలు, కమిషనరేట్‌లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల (ఏహెచ్‌టీయూ)ను ఏర్పాటు చేసింది
బి. ఏహెచ్‌టీయూ యూనిట్లో ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు (కనీసం ఒక మహిళా కానిస్టేబుల్) ఉంటారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
193. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా, మానవ అక్రమ రవాణా అంశంపై సమాచారాన్ని అందించడానికి 2021, ఫిబ్రవరి 11న ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్‌ను గుర్తించండి?
1) హ్యూమన్ సేఫ్టీ 2) ధ్రువ
3) హాక్ ఐ 4) ఏదీకాదు
194. తప్పిపోయిన వ్యక్తులను కనుగొని తిరిగి వారి కుటుంబాలకు అప్పగించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్’ను ఏ సంస్థల/విభాగాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు?
ఎ. యునిసెఫ్
బి. ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్
సి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
195. ‘ప్రైడ్ ప్లేస్’ ఏ వర్గాల వ్యక్తులపై నేరాలను నిరోధించడానికి సంబంధించింది?
ఎ. ట్రాన్స్‌జెండర్ బి. లెస్బియన్
సి. బైసెక్సువల్ డి. అసెక్సువల్
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) పైవన్నీ
196. కింది వాటిలో సరైనవి?
ఎ. తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, అక్రమ రవాణాకు గురైన లేదా బలవంతం చేసిన పిల్లలను రక్షించడం, వీధి బాలలను ఆదుకోవడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి ‘ఆపరేషన్ స్మైల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది
బి. వివిధ నేరాల్లో బాధితులైన మహిళలు, పిల్లలకు న్యాయ సహాయం, వైద్య సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘భరోసా’ కేంద్రాలను 2016లో ప్రారంభించింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
197. ఉన్నతి (యూఎన్ఎన్ఏటీఐ) కార్యక్రమం దేనికి సంబంధించింది?
1) బాలల సంరక్షణకు
2) మహిళ సంరక్షణకు
3) ఖైదీల నేర ప్రవర్తన తగ్గించడానికి
4) ఏదీకాదు
198. మహాపరివర్తన్ పథకం ఎవరికి సంబంధించింది?
1) వివిధ నేరాల్లో బాధితులైన మహిళలకు ఆర్థిక సాయం అందించడానికి
2) ఖైదీలకు (3 సంవత్సరాల శిక్ష
కాలం మిగిలి ఉన్నా) వడ్డీలేని రుణాలు
అందించడానికి
3) ఎ, బి 4) ఏదీకాదు
199. నేషనల్ జెండర్ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో కింది ఏ అంశాలపై అవగాహన కల్పిస్తారు?
ఎ. మానవ అక్రమ రవాణా
బి. బాల్యవివాహాలు
సి. సైబర్ మోసాలు డి. వెట్టిచాకిరీ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, డి 4) పైవన్నీ
సమాధానాలు
167-4, 168-1, 169-1, 170-2, 171-1, 172-3, 173-4, 174-1, 175-4, 176-4, 177-1, 178-3, 179-3, 180-2, 181-3, 182-4, 183-3, 184-2, 185-2, 186-2, 187-1, 188-1, 189-3, 190-2, 191-4, 192-3, 193-2, 194-3, 195-4, 196-3, 197-3, 198-2, 199-4.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?