వార్తల్లో వ్యక్తులు 01/06/2022
ఆంథోని అల్బనీస్
ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా ఆంథోని అల్బనీస్ మే 22న ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల్లో లేబర్ పార్టీ 72 స్థానాల్లో గెలుపొందింది. 1996లో పార్లమెంట్ సభ్యుడిగా, 2013లో ఉపప్రధానిగా, 2019 నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
జ్రోస్ రామోస్ హోర్టా
తూర్పు తైమూర్ దేశానికి అధ్యక్షుడిగా జోస్ రామోస్ హోర్టా మే 23న ఎన్నికయ్యారు. ఆయన గతంలో 2006 నుంచి 2007 వరకు ప్రధానిగా పనిచేశారు. ఈ దేశం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయ్యింది. ఆయనకు 1996లో నోబెల్ శాంతి బమతి లభించింది. ఈ దేశం ఇండోనేషియా నుంచి విముక్తి పొందింది.
కిశోర్ జయరామన్
రోల్స్ రాయిస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ కిశోర్ జయరామన్ ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ అవార్డును మే 23న అందుకున్నారు. ఈయన యూకే బిజినెస్ కౌన్సిల్ సభ్యుడు. 2015లో బెంగళూరులో ఇంజినీరింగ్ సెంటర్‌ను స్థాపించారు.
వివేక్ కుమార్
ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా వివేక్కుమార్ను జాయింట్ సెక్రటరీ స్థాయిలో నియమించేందుకు క్యాబినెట్ నియామక కమిటీ మే 22న ఆమోదం తెలిపింది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన ఆయన 2014లో పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు.
అభిలాష బరాక్
ఆర్మీ ఏవియేషన్ కార్ప్‌లో పోరాట ఏవియేటర్‌గా చేరిన తొలి మహిళా అధికారిగా అభిలాష బరాక్ మే 25న రికార్డులకెక్కింది. హర్యానాకు చెందిన ఆమె 36 మంది పైలట్లతో పాటు శిక్షణ పూర్తిచేశారు.
మొహిందర్ కే మిధా
వెస్డ్ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా భారత సంతతికి చెందిన మొహిందర్ కే మిధా మే 25న ఎన్నికయ్యారు. ఆమె ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందినవారు. బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డులకెక్కారు. 2022-23కు ఆమెను ఎన్నుకున్నారు.
గౌతమ్ రాణా
స్లొవేకియాలో అమెరికా రాయబారిగా భారతీయ-అమెరికన్ గౌతమ్ రాణా మే 25న నియమితులయ్యారు. అతడు అల్జీరియాలోని అమెరికా ఎంబసీలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేస్తున్నారు.
వినయ్ కుమార్ సక్సేనా
22వ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనా మే 26న నియమితులయ్యారు. అనిల్ బైజల్ రాజీనామా చేయడంతో వినయ్‌ను ఆ స్థానంలో నియమించారు.
గీతాంజలి శ్రీ, డైసీ రాక్వెల్
భారత్‌కు చెందిన గీతాంజలి శ్రీతో పాటు అమెరికాకు చెందిన అనువాదకురాలు డైసీ రాక్వెల్కు 2022కు ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ మే 26న లభిం చింది. గీతాంజలి హిందీలో రచించిన ‘రేత్ సమాధి’ నవలను ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో డైసీ రాక్వెల్ ఇంగ్లిష్‌లోకి అనువదించింది. హిందీ మూల రచనకు బుకర్ ప్రైజ్ రావడం ఇదే మొదటిసారి. ప్రైజ్‌మనీ కింద ఇచ్చే 50 వేల పౌండ్ల నగదును ఇద్దరికి సమానంగా పంచుతారు. ఈ బమతిని 2005 నుంచి బ్రిటన్ ప్రదానం చేస్తుంది.
అన్వర్ హుస్సేన్ షేక్
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కమిటీ ఆన్ టెక్నికల్ బారీస్ ఆన్ ట్రేడ్‌కు చైర్మన్‌గా భారత్‌కు చెందిన అన్వర్ హుస్సేన్ షేక్ మే 26న ఎన్నికయ్యారు. దీనిలో సభ్యదేశాల సంఖ్య 164. ఈ సంస్థ 1995, జనవరి 1న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?