సవాళ్లను అధిగమించి… అధ్యక్ష పీఠం అధిరోహించి.. (కరెంట్ అఫైర్స్)
ఆసియాన్-భారత్ ఉన్నతాధికారుల 24వ సమావేశం
- 2022, జూన్ రెండో వారంలో ఆసియాన్- భారత్ ఉన్నతాధికారుల 24వ సమావేశం ఢిల్లీలో జరిగింది.
కీలకాంశాలు –
-రెండు పక్షాల మధ్య మూడు ప్రధానాంశాలైన రాజకీయ భద్రత, ఆర్థిక రంగం, సామాజిక- సాంస్కృత ; సామాజిక అంశాల మీద ఈ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు.
– ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత ఆశయాలకు అనుగుణంగా-ఆసియాన్-భారత్ సహకారం గురించిన సంయుక్త ప్రకటన (ఆసియాన్ అవుట్‌లుక్ ఆన్ ఇండో-పసిఫిక్) అమలు జరపాలని, తద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పై స్థాయికి చేర్చి బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఆగ్నేయాసియా దేశాల కూటమి- ఆసియాన్
-ఆసియా ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ, భద్రతా సహకారాన్ని పెంపొందించేందుకు 1967లో ఏర్పాటైన కూటమి. 1967 ఆగస్టులో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో వ్యవస్థాపక సభ్య దేశాలైన ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ దేశాలు కలిసి ఆసియన్ డిక్లరేషన్ లేదా బ్యాంకాక్ డిక్లరేషన్ మీద సంత-కాలు చేయడం ద్వారా ఈ కూటమిని ప్రారంభించాయి.
-ఈ కూటమి ప్రస్తుతం భారత్‌కు నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రెండు పక్షాల మధ్య 86.9 బిలియన్ డాలర్ల
ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుంది. ఈ కూటమిలో 10 ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి. అవి- బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం.
జీ-20 సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం
-2022 జూలై రెండో వారంలో ఇండోనేషియాలోని బాలి నగరంలో జీ-20 కూటమి సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఇందులో భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి జై శంకర్ పాల్గొన్నారు.
‘మరింత శాంతియుతమైన, సుస్థిరమైన సుసంపన్నమైన ప్రపంచాన్ని ఉమ్మడిగా నిర్మించడం’ అనే నినాదం కింద ఈ సమావేశం నిర్వహించారు.
-ఈ సమావేశంలో జీ-20 కూటమి సభ్య దేశాల మధ్య విభేదాలు స్పష్టంగా బయటకు వచ్చాయి. యూరప్, ఇతర ప్రపంచ దేశాలు చవకగా లభించే ఇంధన వనరులు ఉపయోగించుకోకుండా అమెరికా అడ్డుపడుతుందని ఈ సందర్భంగా రష్యా ఆరోపించింది. మరో వైపు అంతర్జాతీయంగా ఆహార అభ్రదత ఏర్పడడానికి రష్యానే కారణమని అమెరికా ఆరోపించింది.
– ఉక్రెయిన్- రష్యా యుద్ధం, దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక ప్రభావాల కారణంగా అంతర్జాతీయ కూటముల్లో విభేదాలు పెరిగిపోతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు కలిసి ఒక పక్షంగా ఏర్పడి రష్యాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు భారత్ సహా మిగిలిన దేశాలన్నీ తటస్థ వైఖరి అవలంబిస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం వెతకాలని కోరుతున్నాయి.
జీ-20 శిఖరాగ్ర సదస్సులో భారత్-చైనా
-ఇటీవల జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో విడిగా భారత్, చైనాల విదేశాంగ మంత్రుల
సమావేశం జరిగింది. తూర్పు లడఖ్ ప్రాంతంలో సరిహద్దు రేఖకు సంబంధించి వివాదాలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్క- రించుకోవాలని భారత్ ఆ సందర్భంగా పిలుపునిచ్చింది.
జీ-20 అధ్యక్ష స్థానంలో భారత్
– ఈ ఏడాది (2022) జీ-20 అధ్యక్ష స్థానంలోకి భారత్ వచ్చింది. జీ-20 కూటమి వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటైన భారత్ అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఈ వేదిక మీద లేవనెత్తడానికి మొదటి నుంచి దీన్ని ఉపయోగిస్తూ వస్తుంది. అయితే దేశీయంగా నిరుద్యోగం, పేదరికం మొదలైన సవాళ్ల కారణంగా ఇప్పటి వరకు నాయకత్వం వహించే పరిస్థితి సాధించలేకపోయింది.
ఎస్-400 క్షిపణి
రష్యా నుంచి భారత్‌కు ఎస్-400 క్షిపణి వ్యవస్థల రెండో విడత సరఫరా ప్రారంభమైంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ క్షిపణుల సరఫరా ఆలస్యం కావచ్చన్న ఆందోళనలు మన దేశంలో వ్యక్తమయ్యాయి. అయితే వీటిని తోసిపుచ్చేలా రెండో రెజిమెంట్‌కు చెందిన క్షిపణి వ్యవస్థల బట్వాడా ప్రారంభమైంది. మన దేశానికి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరా గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైంది. తొలివిడతలో అందిన క్షిపణులను చైనా, పాకిస్థాన్‌తో మనకున్న
సరిహద్దుల వెంట సైన్యం మోహరించింది.
ఐ2యూ2 అంతర్జాతీయ కూటమి
– ఐ2 అంటే ఇండియా, ఇజ్రాయెల్. యూ2 అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఎస్ఏ అని అర్థం.
-ప్రపంచవ్యాప్తంగా పలు సంబంధాలను పునరుద్ధరించి, బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా అమెరికా కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ కూటమిని కూడా అదేవిధంగా ఏర్పాటు చేసినట్టు ఆమెరికా పేర్కొంటుంది. ఇటీవల ఇజ్రాయెల్, యూఏఈ దేశాల మధ్య అబ్రహాం ఒప్పందాల పేరుతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కృషి ప్రారంభమైంది. అక్టోబర్ నెలలో ఐ2యు 2 బృందాన్ని ఏర్పాటు చేశారు.
-ఏర్పాటు చేసిన మొదట్లో ‘అంతర్జాతీయ ఆర్థిక సహకార ఫోరం’గా వ్యవహరించారు. ప్రస్తుతం పశ్చిమాసియా చతుర్భుజ కూటమి’ (వెస్ట్ క్వాడ్)గా కూడా పిలుస్తున్నారు. అధికారికంగా ఈ బృందానికి ఐ2యూ2గా పేరు ఖరారు చేశారు.
మొట్టమొదటి సదస్సు
-తమ మొట్టమొదటి సదస్సును వర్చువల్ పద్ధతిలో జూలై నెల 14న నిర్వహించింది. దీనిలో పై నాలుగు దేశాల నేతలు నరేంద్ర మోదీ, యైయిర్ లాపిడ్, మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, జో బైడెన్ పాల్గొన్నారు.
– ఈ సమావేశంలో ప్రధానంగా జల రంగం, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆహార భద్రత, హరిత ఇంధనం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆహార, ఇంధన భద్రతలు, తక్కువ ఉద్గారాలతో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ మొదలైన అంశాల గురించి చర్చించారు.
భారత్‌లో భారీగా ఫుడ్ పార్కులు
-భారత్‌లో దేశవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లతో (దాదాపు 16 వేల కోట్ల రూపాయలు) ఫుడ్ పార్కులు నెలకొల్పేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకు వచ్చింది. గుజరాత్లో బ్యాటరీ నిల్వ వ్యవస్థ విధానంలో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ తరహా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నెలకొల్పాలని సదస్సులో నిర్ణయం తీసుకున్నారు.
– అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లోని ప్రైవేట్ రంగ నిపుణుల సహాయంతో భారత్‌లో సమీకృత వ్యవసాయ పార్కులను అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించినట్లు అమె-రికా అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు.
ప్రాక్టీస్ బిట్స్
1. తొలి ఎస్డీజీ అర్బన్ ఇండెక్స్, డ్యాష్‌బోర్డు 2021-22లో ఏ నగరం టాప్ ర్యాంక్‌లో నిలిచింది?
1) సిమ్లా 2) గువాహటి
3) చండీగఢ్ 4) కొచ్చి
2. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ విడుదల చేసిన గ్లోబల్ సిస్టమిక్ బ్యాంకుల జాబితాలో ఏ బ్యాంకు అగ్రస్థానంలో నిలిచింది?
1) వెల్స్ ఫార్గో
2) జేపీ మోర్గాన్ చేజ్
3) మోర్గాన్ స్టాన్లీ
4) గోల్డ్‌మన్ శాచ్స్
3. ఏ దేశపు అంతరిక్ష సంస్థ ఉద్దేశపూర్వకంగా గ్రహశకలాల్లోకి అంతరిక్ష నౌకను ధ్వంసం చేయడానికి డార్డ్ మిషన్‌ను ప్రారంభించింది?
1) రష్యా 2) ఇజ్రాయెల్
3) చైనా 4) యునైటెడ్ స్టేట్స్
4. 2021 ఏటీపీ ఫైనల్స్‌లో ఏ టెన్నిస్ ఆటగాడు విజేతగా నిలిచాడు?
1) రోజర్ ఫెదరర్ 2) డానిల్ ఎద్వెదేవ్
3) స్టెఫాసోస్ సిట్సిపాస్
4) అలెగ్జాండర్ జ్వెరెవ్
5. మహిళలపై హింస నిరోధక అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 24 2) నవంబర్ 25
3) నవంబర్ 23 4) నవంబర్ 22
6. మహిళలపై హింస నిరోధక అంతర్జాతీయ దినోత్సవం 2021 థీమ్ ఏమిటి?
1) ఆరెంజ్ ది వరల్డ్ – ఎండ్ వయోలెన్స్ ఎగైనెస్ట్ ఉమన్ నౌ
2) ఆరెంజ్ ది వరల్డ్ – ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్
3) ఆరెంజ్ ది వరల్డ్ – రైజ్ ఫండ్ టు ఎండ్ వయోలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ నౌ
4) ఆరెంజ్ ది వరల్డ్ – #హియర్మీటూ
7. పటాల్‌పానీ రైల్వేస్టేషన్‌కు ట్రైబల్ ఐకాన్ తంటియా భిల్ పేరు పెట్టారు. అయితే ఈ రైల్వేస్టేషన్ ఏ నగరంలో ఉంది?
1) పాట్నా 2) జైపూర్
3) ఇండోర్ 4) ఢిల్లీ
8. సీఎస్ఐఆర్ జిగ్యాసా ప్రోగ్రామ్ కింద పిల్లల కోసం భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పేరు?
1) రావు ఇందర్జిత్ సింగ్
2) ధర్మేంద్ర ప్రధాన్
3) రవిశంకర్ ప్రసాద్ 4) జితేంద్ర సింగ్
9. పీఎంసీ బ్యాంకును ఏ బ్యాంకులో విలీనం చేయడం కోసం ఆర్బీఐ డ్రాఫ్ట్ స్కీంను ప్రకటించింది?
1) ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
2) ఏ యూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
3) యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
4) ఈఎస్ఎఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
10. వ్యక్తిగత పాడి రైతులకు ఆర్థిక సహాయం చేయడం కోసం పాండిచ్చేరి కో-ఆప్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌తో ఏ బ్యాంకు ఎంఓయూపై సంతకం చేసింది?
1) బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) కెనరా బ్యాంక్
11. పార్టే గుల్ఫా నైట్ డ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడు ఎవరు?
1) ఎం. ముకుందన్ 2) బెరిల్ తంగ
3) నావ్ అగర్వాల్
4) ఎస్కే సోహాన్ రాయ్
12. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ దేశాల్లో ద్వైవార్షిక త్రిముఖ వ్యాయామం ‘దోస్తీ’ నిర్వహిస్తుంది?
1) మాల్దీవులు, శ్రీలంక
2) న్యూజిలాండ్, వియత్నాం
3) స్పెయిన్, రష్యా
4) ఆస్ట్రేలియా, ఫ్రాన్స్
13. ‘కన్వర్జేషన్స్ : ఇండియన్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ 101 థీమ్స్, అండ్ మోర్’ పుస్తకాన్ని రచించింది?
1) మాల్దీవులు, శ్రీలంక
2) న్యూజిలాండ్, వియత్నాం
3) స్పెయిన్, రష్యా
4) ఆస్ట్రేలియా, ఫ్రాన్స్
14. చున్ డూ-హ్వాన్ 2021 నవంబర్‌లో మరణించారు. అయితే అతను ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు?
1) దక్షికొరియా 2) జపాన్
3) వియత్నాం 4) మలేషియా
జవాబులు
1.1 2.2 3.4 4.4 5.2 6.1 7.3 8.4 9.3 10.2 11.4 12.1 13.4 14.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?