జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు
-పరీక్షలో మాస్ కాఫీయింగ్
-పోలీసుల విచారణలో నిర్ధారణ
-181 మందికి అందిన జవాబులు
-త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ
-సీఎండీ రఘుమారెడ్డి ప్రకటన
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో వెయ్యి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది జులై 17న నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. కొంతమంది రాష్ట్ర విద్యుత్తు సంస్థ ఉద్యోగులు, ఇతరులు కలిసి సుమారు 181 మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు రాచకొండ పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరింత మంది అభ్యర్థు ల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎండీ తెలిపా రు. రాతపరీక్షలో అక్రమాలపై కొంతమంది కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నాచేశారు. పరీక్షను రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డ పలువురు విద్యుత్తు సంస్థల ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు