Current Affairs May 17 | వార్తల్లో వ్యక్తులు
వార్తల్లో వ్యక్తులు
ప్రియదర్శి
తెలుగు సినిమా నటుడు ప్రియదర్శికి అంతర్జాతీయ అవార్డు మే 8న లభించింది. బలగం సినిమాలో నటనకు స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023లో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. అలాగే బలగంలో నటించిన కేతిరి సుధాకర్ రెడ్డికి ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. గతంలో ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్లో 9 అవార్డులు, 13వ దాదాసాహెబ్ ఫాల్కేలో అవార్డు బలగం సినిమాకు లభించాయి.
పర్మిందర్ చోప్రా
భారత అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) తదుపరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా పర్మిందర్ చోప్రా ఎన్నికయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పీఈఎస్బీ) మే 8న ఆమెను ఈ పదవికి సిఫారసు చేసింది. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె పీఎఫ్‌సీలో 2005 నుంచి పనిచేస్తున్నారు. 2020 నుంచి డైరెక్టర్ (ఫైనాన్స్), సీఎఫ్‌వోగా వ్యవహరిస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?